
తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలయిన కౌంటింగ్
ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న అధికారులు
దేశంలో నలభై రోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.
విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..
పుదుచ్చేరిలో..
కేరళ..
పశ్చిమ బెంగాల్ లో..
అస్సాం..
Live Updates
- 4 May 2026 10:52 AM IST
భవానీపూర్‌లో దీదీ వెనుకంజ
భవానీపూర్‌లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. బీజేపీ నేత సువేంధు అధికారి 1558 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
- 4 May 2026 10:48 AM IST
యూడీఎఫ్ కీలక నేతకు షాక్: తొలి రౌండ్‌లో వెనుకబడ్డ సతీశన్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో ప్రముఖ నేతల్లో ఒకరు వీడీ సతీశన్. నార్త్ పరవూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన, తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో వెనకబడినట్లు వార్తలొస్తున్నాయి.
సీపీఎం అభ్యర్థి ఈటీ టైసన్ 240కి పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు.
ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న సతీశన్, అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ప్రచారానికి నాయకత్వం వహించారు. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుల్లో ఆయన ఒకరుగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తాజా ట్రెండ్స్ ప్రకారం కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
- 4 May 2026 10:48 AM IST
ధర్మదంలో సీఎం పినరయి విజయన్ వెనుకంజ
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల సంఘం ధోరణుల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి వి.పీ. అబ్దుల్ రషీద్ ఆయనపై 2,812 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రాష్ట్రంలో 71 సీట్ల మెజారిటీ మార్క్‌ను దాటి ఆధిక్యంలో నిలిచింది.
- 4 May 2026 10:45 AM IST
కేరళలో యూడీఎఫ్ మెజారిటీ దాటింది
తాజా ఎన్నికల సంఘం ధోరణుల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళలో మెజారిటీ మార్క్ దాటింది. 140 స్థానాల అసెంబ్లీలో అవసరమైన 71 సీట్లను అధిగమించి, ప్రస్తుతం 71కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
- 4 May 2026 10:43 AM IST
భవానీపూర్‌లో లీడ్‌లో TMC చీఫ్..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నియోజకవర్గం భవానీపూర్‌లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పోటీ చేశారు.
మొదటి రౌండ్‌లో మమతా బెనర్జీ 3,666 ఓట్లు సాధించగా, సువేందు 1,670 ఓట్లు పొందారు. దీంతో మమతా 1,996 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది.
- 4 May 2026 10:42 AM IST
స్పష్టమైన మెజారిటీతో మాదే సర్కార్: టీవీకే
తమిళనాడులో టీవీకే భారీ మెజారిటీతో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో టీవీకే గణనీయ ఆధిక్యం సాధిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంగా ఉన్న పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో టీవీకేకు మద్దతు లభించిందని చెప్పారు. “50-75 ఏళ్ల అనుభవం ఉన్నా, అది రాష్ట్రాన్ని దోచుకునే అనుభవమే” అని విమర్శించారు. ప్రచార సమయంలో పార్టీ చీఫ్ విజయ్ మీడియాతో తక్కువగా మాట్లాడటంపై స్పందిస్తూ, ప్రజలతో నేరుగా కలవడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. బయటి మద్దతు అవసరం లేకుండానే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఫెలిక్స్ జెరాల్డ్ స్పష్టం చేశారు.
- 4 May 2026 10:39 AM IST
తమిళనాడులో TVK సెంచరీ
తమిళనాడు:
TVK – 100
AIADMK+ – 74
DMK+ – 54
పశ్చిమ బెంగాల్:
BJP+ – 172
TMC+ – 112
కేరళ:
UDF – 82
LDF – 45
BJP+ – 3
అస్సాం:
BJP+ – 97
Congress – 23
AIUDF+ – 2
పుదుచ్చేరి:
NRC+ – 16
TVK+ – 4
- 4 May 2026 10:38 AM IST
కర్ణాటక ఉపఎన్నికలు: బాగలకోటలో కాంగ్రెస్ లీడ్, దావణగెరె సౌత్‌లో బీజేపీ..
కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం..అధికార కాంగ్రెస్ బాగలకోటలో ఆధిక్యంలో ఉండగా, ప్రతిపక్ష బీజేపీ దావణగెరె సౌత్‌లో ముందంజలో కొనసాగుతోంది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది.
సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్. వై. మేటి, శమనూర్ శివశంకరప్ప చనిపోవడంతో ఈ ఉపఎన్నికలు జరిగాయి.
ఎలక్షన్ కమిషన్ సమాచారం ప్రకారం.. బాగలకోటలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ మేటి, బీజేపీ అభ్యర్థి వీరభద్రయ్య చరణ్తిమఠ్‌పై 5,016 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దావణగెరె సౌత్‌లో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ. దసకరియప్ప, కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ మల్లికార్జునపై 577 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
ఈ ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు తెలిసే అవకాశం ఉంది.
- 4 May 2026 10:34 AM IST
కేరళలో యూడీఎఫ్ దూకుడు: 100 సీట్ల దిశగా కూటమి..
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ దశలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) బలపడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మొదటి గంటలో వచ్చిన ట్రెండ్స్ తరువాత పార్టీ నాయకులు ధైర్యంగా స్పందించారు.
ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ అన్నారు. యూడీఎఫ్ 140 స్థానాల అసెంబ్లీలో 100కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కౌంటింగ్ మొదటి గంట ముగిసే సరికి యూడీఎఫ్ 90కి పైగా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ సుమారు 40 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
అలాగే ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సహా రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు వెనుకబడినట్లు సమాచారం.
- 4 May 2026 10:32 AM IST
మహా బైపోల్స్: పవార్, కర్దిలే లీడ్
మహారాష్ట్ర బైఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా బారామతిలో సునేత్రా పవార్ భారీ ఆధిక్యం సాధించారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఆమెకు 26,773 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఇంకా 100 ఓట్ల మార్క్ కూడా దాటలేదు.
పుణే జిల్లాలోని బారామతి నియోజకవర్గంలో 58.27% పోలింగ్ నమోదైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంతో ఈ బైఎన్నిక జరిగింది.
ఇక రాహురిలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ కర్దిలే, ఎన్‌సీపీ (ఎస్‌పి) అభ్యర్థి గోవింద్ మోకటేపై 21,000కిపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నిక బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కర్దిలే మృతి కారణంగా నిర్వహించబడింది.

