
తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలయిన కౌంటింగ్
ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న అధికారులు
దేశంలో నలభై రోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.
విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..
పుదుచ్చేరిలో..
కేరళ..
పశ్చిమ బెంగాల్ లో..
అస్సాం..
Live Updates
- 4 May 2026 10:31 AM IST
టీవీకే అధినేత విజయ్ ఇంటి వద్ద భాారీ భద్రత
తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తళపతి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అధికారిక ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ ౬౮ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరికొన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్న వేళ ఆయన నివాసం దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రత కల్పిస్తున్నారు.
- 4 May 2026 10:20 AM IST
బాగల్‌కోటలో కాంగ్రెస్ లీడ్, దావణగెరె సౌత్‌లో బీజేపీ ముందంజ
కర్ణాటక అసెంబ్లీ బైఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది. బాగల్‌కోటలో అధికార కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, దావణగెరె సౌత్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికల సంఘం ప్రకారం, బాగల్‌కోటలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ మెటి, బీజేపీకి చెందిన వీరభద్రయ్య చరణ్తిమఠ్‌పై 5,016 ఓట్లతో ముందంజలో ఉన్నారు. దావణగెరె సౌత్‌లో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ దసకరియప్ప, కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ మల్లికార్జున్‌పై 577 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ బైఎన్నికలు సీనియర్ కాంగ్రెస్ నేతలు హెచ్.వై. మెటి, శమనూరు శివశంకరప్ప మృతి నేపథ్యంలో నిర్వహించబడ్డాయి. ఫలితాలు తక్షణ రాజకీయ సమీకరణాలను మార్చకపోయినా, కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

