LIVE తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలయిన కౌంటింగ్
x

తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలయిన కౌంటింగ్

ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న అధికారులు


దేశంలో నలభై రోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.

విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..

దేశంలో అత్యంత కీలకమైన తమిళనాడు ఎన్నికలలో తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తుందా? మెజారిటీ ఎంత సాధిస్తారు? విజయ్ కింగ్ మేకర్ అవుతాడా? హంగ్ వస్తుందా? ఇవే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి. సంక్షేమ పథకాలు, ద్రవిడవాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని స్టాలిన్ నమ్ముతున్నారు. అయితే పార్టీ ఎప్పుడూ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే వైపే నిలిచాయి.
అయితే సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీగా ఓట్లు చీలుస్తుందని అంచనాలు ఉన్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒంటరిగా బరిలోకి దిగింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే 30 శాతం ఓట్లు, 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది మొత్తం ఎన్నికల కథనాన్ని తలకిందులు చేసింది. ఇదే నిజమైతే భారత ఎన్నికల చరిత్రలో ఇదో సంచలనం అవుతుంది.

పుదుచ్చేరిలో..

30 స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం బలంగా ఉండటంతో పోరు హోరాహోరీగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న అంశాలు కూడా వేగంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

కేరళ..

కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పడు ఆయన హ్యట్రిక్ విజయంపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 99 స్థానాలు సాధించి అధికారం చేపట్టారు.
కానీ తరువాత అన్ని ప్రతికూల అంశాలు ఎల్డీఎఫ్ ను చుట్టుముట్టాయి. అవినీతి,కుంభకోణాలు వెలుగుచూడటంతో యూడీఎఫ్ బలం ఫుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ వామపక్షాలు ఓటమి పాలైతే దేశంలో ఉన్న చివరి అధికారకోట కూడా కోల్పోయినట్లు అవుతుంది.

పశ్చిమ బెంగాల్ లో..

ఉత్తరాదిన ఉన్న పశ్చిమ బెంగాల్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 148. ఇక్కడ 2011 నుంచి టీఎంసీ అధికారంలో ఉంది. గత 15 ఏళ్లు పాలనలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. దీనితో బీజేపీ బలంగా పోరాడింది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని మమతా బెనర్జీ వైపు, ఇంకొన్ని బీజేపీ వైపు నిలిచాయి. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మరో పెద్ద రాష్ట్రం దాని సొంతమవుతుంది.
ఈసారి బెంగాల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి ఘర్షణలు, కర్ప్యూలు లేవు. పార్టీ కార్యాలయాలకు నిప్పులు పెట్టడం లాంటివి జరగలేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ వల్ల 27 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీనిపై టీఎంసీ వీధి పోరాటాలతో పాటు న్యాయ స్థానాలను ఆశ్రయించింది.

అస్సాం..

అస్సాంలో 126 స్థానాలు ఉన్నాయి. బీజేపీ మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగింది. ఇక్కడ మరోసారి ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదే జరిగితే వరుసగా మూడో సారి బీజేపీ అధికారం దక్కించుకున్నట్లు అవుతుంది.

Live Updates

  • 4 May 2026 11:26 AM IST

    కేరళలో యూడీఎఫ్ మెజారిటీ దాటి ముందంజ

    తమిళనాడు:

    TVK – 106

    AIADMK+ – 78

    DMK+ – 48

    పశ్చిమ బెంగాల్:

    BJP+ – 181

    TMC+ – 110

    కేరళ:

    UDF – 86

    LDF – 41

    BJP+ – 1

    అస్సాం:

    BJP+ – 97

    Congress – 26

    AIUDF+ – 2

    పుదుచ్చేరి:

    NRC+ – 17

    TVK+ – 4

    Congress+ – 3

  • 4 May 2026 11:17 AM IST

    టీఎంసీకి షాక్: ముర్షిదాబాద్‌లో లీడ్‌లో హుమాయున్ కబీర్

    వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా నౌడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడి నుంచి ఆమ్ జనతా ఉన్నాయన్ పార్టీ (Aam Janata Unnayan Party) అధినేతగా పోటీ చేసిన హుమయూన్ కబీర్ తొలి రౌండ్ ముగిసే సరికి సహిన మోన్తజ్ ఖాన్‌పై (All India Trinamool Congress)పై 2,890 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఇంకా 19 రౌండ్ల లెక్కింపు మిగిలి ఉండటంతో పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన తరువాత, బెల్డాంగాలో బాబ్రీ మసీదు తరహా మసీదు నిర్మిస్తానని ప్రకటించిన నేపథ్యంలో, కబీర్ డిసెంబర్‌లో Aam Janata Unnayan Partyని స్థాపించారు.

  • 4 May 2026 11:08 AM IST

    తమిళనాడు: స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ఫెలిక్స్ జెరాల్డ్

    తమిళనాడులో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే (Tamilaga Vettri Kazhagam) జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ ధీమా వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపు ఫలితాలను చూస్తుంటే, రాజకీయ పార్టీలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఓటర్లు టీవీకేకు మద్దతు ఇచ్చారని స్పష్టమవుతోందని అన్నారు.

    “వాళ్లకు 50 లేదా 75 ఏళ్ల అనుభవం ఉండొచ్చు, కానీ అది రాష్ట్రాన్ని దోచుకోవడంలోనే ఉపయోగపడింది,” అని జెరాల్డ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజలు టీవీకేనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని జెరాల్డ్

    పేర్కొన్నారు.

    ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ అధినేత విజయ్ మీడియాతో ఎక్కువగా మాట్లాడకపోవడంపై ప్రశ్నించగా, ప్రజలతో నేరుగా కలిసే విధానాన్నే ఆయన ఇష్టపడతారని చెప్పారు.

    టీవీకేకు ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

  • 4 May 2026 11:02 AM IST

    వివిధ రాష్ట్రాల్లో తాజా లీడ్స్..

    తమిళనాడులో..

    100కు చేరువలో TVK..

    AIADMK+ 74

    DMK+ 54

    వెస్ట్ బెంగాల్..

    BJP+ 172

    TMC+ 112

    కేరళ..

    UDF 82

    LDF 45

    BJP+ 3

    అస్సాం..

    BJP+ 97

    Congress 23

    AIUDF+ 2

    పాండిచ్చేరి..

    NRC+ 16

    TVK+ 4

  • 4 May 2026 11:02 AM IST

    బెంగాల్ ట్రెండ్స్‌పై సువేందు అధికారి వ్యాఖ్యలు

    పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభ ఓట్ల లెక్కింపు ధోరణులపై ప్రతిపక్ష నేత, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, హిందువులందరూ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఏకమయ్యారని పేర్కొన్నారు. నాలుగు రౌండ్ల లెక్కింపు తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉందని అన్నారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ధోరణులపై వ్యాఖ్యానిస్తూ, హిందూ ఓట్లు ఎక్కువగా బీజేపీకి, ముస్లిం ఓట్లు ఎక్కువగా టీఎంసీకి వెళ్లాయని అభిప్రాయపడ్డారు. అయితే మాల్డా, ముర్షిదాబాద్, నార్త్ డినాజ్‌పూర్ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని ఆయన తెలిపారు.

  • 4 May 2026 10:59 AM IST

    మహారాష్ట్ర బైపోల్స్: బారామతిలో సునేత్రా పవార్ ఆధిపత్యం, రాహురిలో బీజేపీ..

    మహారాష్ట్ర బారామతి అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసే సరికి సునేత్రా పవార్ 26,773 ఓట్లు సాధించగా, పోటీలో ఉన్న మిగతా 22 మంది అభ్యర్థుల్లో 21 మంది 100 ఓట్ల మార్క్‌ను కూడా దాటలేదు.

    పుణే జిల్లాలోని బారామతి నియోజకవర్గంలో 58.27 శాతం ఓటింగ్ నమోదైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ ఉపఎన్నిక నిర్వహించారు.

    రాహురిలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ కార్డిలే, ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి గోవింద్ మోకాటేపై 21వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాహురి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కార్డిలే మరణంలో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది.

  • 4 May 2026 10:54 AM IST

    పుదుచ్చేరి ఫలితాలు: రంగసామి, AINRC ముందంజ

    పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (AINRC) నేత ఎన్. రంగసామి సహా ఆయన పార్టీ అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన రంగసామి, తట్టంచావడి సీటులో 3,591 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

    ఇతర AINRC అభ్యర్థులు ఆర్. రవికుమార్, వైయాపురి మణికందన్, సి. అయ్యప్పన్, ఈ. మోహందాస్, పి. రాజవేలు, పి.ఆర్.ఎన్. తిరుమురుగన్ వరుసగా విల్లియనూర్, ముతియల్పేట్, ఆర్యంకుప్పం, ఎన్బలం, నెట్టపాక్కం, కారైకాల్ నార్త్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థులు ఏ. నమస్సివాయం, టీ.కే.ఎస్. మీనాచ్చిసుందరం కూడా మన్నడిపేట్, నెరావి టి.ఆర్. పట్టినం సీట్లలో ముందంజలో ఉన్నారు.

  • 4 May 2026 10:53 AM IST

    గుజరాత్ బైపోల్: ఉంరేత్‌లో హర్షద్ పార్మర్ ముందంజ

    గుజరాత్ ఉంరేత్ అసెంబ్లీ బైఎన్నికలో బీజేపీ అభ్యర్థి హర్షద్భాయి పార్మర్ బలమైన ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ ప్రత్యర్థి భృగురాజ్‌సింహ్ చౌహాన్‌పై ఆయన ముందంజలో కొనసాగుతున్నారని తాజా లెక్కింపు ధోరణులు వెల్లడించాయి. అనంద్ జిల్లాలోని వలభ్ విద్యానగర్‌లోని బీజేవీఎం కాలేజీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. తొమ్మిదో రౌండ్ వరకు హర్షద్ పార్మర్ 33,745 ఓట్లు సాధించగా, చౌహాన్‌కు 23,310 ఓట్లు వచ్చాయి.

    ముగ్గురు స్వతంత్రులు, ఒక చిన్న పార్టీ అభ్యర్థి సహా మిగతా నలుగురు అభ్యర్థులు చాలా వెనుకంజలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ పార్మర్ మృతి కారణంగా ఈ బైఎన్నిక జరిగింది. ఆయన కుమారుడైన హర్షద్ పార్మర్‌ను బీజేపీ బరిలోకి దించింది. ఇది ఆయన తొలి పెద్ద ఎన్నిక. ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్‌లో 306 బూత్‌లలో 59.04 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 4 May 2026 10:52 AM IST

    విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు..

    చెన్నైలో టీవీకే చీఫ్ విజయ్ ఇంటి బయట భద్రతను కట్టుదిట్టం చేశారు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఎలక్షన్ ట్రెండ్స్ ప్రకారం TVK (Tamilaga Vettri Kazhagam) రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Read More
Next Story