ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోలింగ్
x

ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోలింగ్

వర్షంలోనూ ఓటేసేందుకు వస్తున్న ఓటర్లు


Click the Play button to hear this message in audio format

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఉత్సాహం పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలలో నీరు నిలిచింది.

రాయలసీమలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో అధికార కూటమికి, ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు స్వల్ఫ లాఠీచార్జ్ లు జరిపి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి క్లీన్ స్వీప్ చేయగా, తాజాగా జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లోనూ వారి జోరే కొనసాగుతోంది

Live Updates

  • 5 Nov 2026 1:52 PM IST

    విరిగిన స్వస్తిక్‌ గుర్తు

    తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం విరూపాక్షపురం పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది. ఓటు వేసే స్వస్తిక్‌ గుర్తు విరగడంతో పోలింగ్ అధికారులు పోలింగ్ నిలిపివేశారు.

  • 5 Nov 2026 1:36 PM IST

    కడప జిల్లాలో ఉద్రికత్త. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

    కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గొడవలు చోటుచేసుకున్నాయి. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లెలో రెండు వర్గాలు గొడవకు దిగి రాళ్లు రువ్వుకున్నాయి. ఒంటిమిట్ట మండలం రాచపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తులు వచ్చారని వాగ్వాదానికి దిగాయి.

  • 5 Nov 2026 1:31 PM IST

    ఓటేసిన హోంమంత్రి అనిత..

    అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్‌లో నిల్చోని సామాన్య వ్యక్తిలా ఓటు ఓసేందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన అనిత.. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని, అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

  • 5 Nov 2026 12:19 PM IST

    పెట్రోల్ బాంబులతో దాడులు..


    ఏపీ జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. టీడీపీ పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకుని బూత్ క్యాప్చరింగ్ లకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపించగా, పోలింగ్ బూత్ లోకి ప్రవేశించడానికి వైసీపీ ప్రయత్నించిదని దాన్ని మేమే అడ్డుకున్నామని అధికార కూటమి వాదనగా ఉంది.
    ముఖ్యంగా రాయలసీమలోని కడప, తిరుపతి జిల్లాలలో పోలింగ్ సందర్బంగా ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులు విసురుకున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ పెట్రోల్ బాంబులు విసురుకున్నాయి. అలాగే నందలూర్, ప్రొద్దుటూర్, జమ్మలమడుగులోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది.


  • 5 Nov 2026 9:42 AM IST

    నంద్యాల జిల్లాలో కనిపించని వైసీపీ ఏజెంట్లు


    పరిషత్ ఎన్నికల్లో నంద్యాల జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలలో వైసీసీ ఏజెంట్లు ఎవరూ కనిపించడం లేదు. వీరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనితో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.


  • 5 Nov 2026 9:39 AM IST

    కృష్ణ జిల్లాలో అధికార, విపక్ష కూటమి కార్తకర్తల బాహబాహీ


    ఏపీలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో అధికార టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కృష్ణ జిల్లా నాగాయలంక మండలంలోని పలు గ్రామాల్లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ప్రతిపక్ష వైసీపీ ఏజెంట్లపై అధికార టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో భారీ ఎత్తున వైసీసీ శ్రేణులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రెండు వర్గాలపై పోలీసుల లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


  • 5 Nov 2026 9:29 AM IST

    చిత్తడిగా పోలింగ్ కేంద్రాలు.. ఓటర్ల ఇబ్బంది


    తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పోలింగ్ కేంద్రాలన్నీ చిత్తడిగా మారాయి. కనీసం కాలు పెట్టేందుకు కూడా స్థలం లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలన్ని బురదమయంగా మారాయి. కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది నీటిని తోడే పనులు చేస్తున్నారు. కృష్ణ జిల్లా జనార్థనపురంలోని పోలింగ్ కేంద్రం మొత్తం నీటితో నిండిపోయింది. దీనితో వరద నీటిలోనే నడుచుకుంటూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో కరెంట్ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ పోలింగ్ ను ఎందుకు  వాయిదా వేయలేదని పలువురు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. 


  • 5 Nov 2026 9:19 AM IST

    పరిషత్ ఎన్నికల వివరాలు.. ఏంటంటే..


    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 9,821 ఎంపీటీసీ స్థానాలు, 659 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 2,051 ఎంపీటీసీ స్థానాలు , 77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 7,767 ఎంపీటీసీ స్థానాలకు గాను 18,843 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది.
    పోలింగ్ కోసం రెండు లక్షల మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్ కోసం లక్షకు పైగా బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. ఎన్నికల కోసం పక్క రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికల సంఘం వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తోంది


  • 5 Nov 2026 9:10 AM IST

    వైఎస్ అవినాష్ రెడ్డి హౌజ్ అరెస్ట్..


    పరిషత్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాలను పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. తాను ప్రశాంతంగా పోలింగ్ కేంద్రాలను సందర్శన చేపట్టినప్పటికీ పోలీసులు టీడీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలింగ్ కేంద్రాలను టీడీపీ కూటమి ఏజెంట్లు చెరపట్టి రిగ్గింగ్ పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 



  • 5 Nov 2026 9:07 AM IST

    కడప జిల్లాలో ఉద్రిక్తత

    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలోని పలు ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాటలు, ఘర్షణలు జరిగాయి. పులివెందుల మండలం ఆర్. తుమ్మనపల్లిలో రెండు వర్గాల మధ్య రాళ్లదాడులు జరిగాయి. తమ ఏజెంట్లపై వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు దాడులకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. దానితో రెండు వర్గాలు పరస్పరం పిడిగుద్దులకు దిగాయి. మరో వైపు వైఎస్ఆర్సీపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పెద్దముడియం మండలంలోని ఓ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనితో వారిని పోలీసులను అదుపులోకి తీసుకున్నారు



Read More
Next Story