
బీహార్ లో ఢంకా భజాయించిన నితీశ్
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలో (నవంబర్ 6, 11 తేదీల్లో) పోలింగ్ - రెండు దశల్లో నమోదయిన పోలింగ్ శాతం 67.13.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. బీహార్ నుంచి వచ్చిన ముందస్తు నివేదికల ప్రకారం .. NDA ఆధిక్యంలో ఉంది. కానీ ప్రతిపక్ష కూటమి కూడా వేగంగా ఆధిక్యంలోకి దూసుకుపోతోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 243 స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 67.13గా రికార్డుయ్యింది.
Live Updates
- 14 Nov 2025 6:14 PM IST
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ 35 స్థానాల్లో, JD(U) 24, RJD 6 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ మరో 55 స్థానాల్లో ముందంజలో ఉంది. JD(U) 59 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. LJP(రామ్ విలాస్) 2 స్థానాల్లో గెలుపొందింది. 17 స్థానాల్లో అధిక్యతను చాటుతోంది. AIMIM నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఒక స్థానంలో లీడింగ్‌లో ఉంది. HAM (హిందుస్థాన్ ఆవాజ్ మోర్చా) ఒక స్థానంలో గెలుపొందింది. మరో 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
- 14 Nov 2025 4:44 PM IST
తేజస్వి యాదవ్ తన నియోజకవర్గం రఘోపూర్‌లో 1186 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ 204 స్థానాల్లో, మహాఘట్బంధన్ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్బంధన్ కూటమి పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు అనంతరం వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) 12 సీట్లు దక్కించుకుంది. అయితే ఎక్కడా కూడా ఆ పార్టీ ఆధిక్యాన్ని చాటలేదు. గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే NDTV తో ఆ పార్టీ చీఫ్ ముఖేష్ సాహ్ని మాట్లాడుతూ .. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను అంటూనే NDA విజయాన్ని రెవిడీగా అభివర్ణించారు. "ఉచితాల" ద్వారా ఓట్లు కొల్లగొట్టారు. రూ. 10వేలు నగదు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు.’’ అని పేర్కొన్నారు.
- 14 Nov 2025 3:24 PM IST
వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) సత్తా చాటాలేకపోయింది. పోటీ చేసిన 12 నియోజకవర్గాల్లోనూ వెనకబడి పోయింది. ఇదే పార్టీ 2020లో నాలుగు సీట్లు గెలుచుకుంది. పార్టీ అధినేత సహానీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. తన సోదరుడు సంతోష్ సహానీని గౌరా బౌరం నుంచి పోటీకి దింపారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుజిత్ కుమార్ 7వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆర్జేడీ నుంచి పోటీ చేసిన అఫ్జల్ అలి కూడా వెనకబడి పోయారు. కాగా 243 సభ్యుల అసెంబ్లీలో మహాఘటబంధన్ 38 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. ఎన్డీయే 200 సీట్ల మార్కును దాటి ముందుకు దూసుకుపోయింది.
- 14 Nov 2025 3:04 PM IST
ఎన్డీఏ కూటమి 201 స్థానాల్లో, మహాఘట్ బంధన్ 36 స్థానాల ఆధిక్యంతో కొనసాగుతోంది. పార్టీల పరంగా చూస్తే..JD(U) 83, RJD 27, కాంగ్రెస్ 5 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఇక నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ గెలుపొందారు. ఎన్నికల ప్రచారానికి ముందు జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో నవంబర్ 2వ తేదీన అనంత్ సింగ్‌ను అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈయన జైలులో ఉన్నారు.
- 14 Nov 2025 1:47 PM IST
ప్రస్తుతం ఎన్డీఏ 198 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాఘట్‌బంధన్ కూటమి 39 స్థానాల్లో కొనసాగుతోంది. ఇక RJD నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన నియోజకవర్గం రఘోపూర్‌లో 585 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పేలవ ప్రదర్శనపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందించారు. తక్షణం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాల్సి ఉందన్నారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతుందన్నా లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. తొలగించిన ఓటర్లలో ఎక్కువ మంది పేద, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. “నేను అనుమానించింది నిజమైంది. 62లక్షల ఓట్లను తొలగించారు. 2 లక్షల ఓట్లను కలిపారు.’’ అని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) విశ్వసనీయతపై కూడా ఆయన సందేహాలను లేవనెత్తారు. ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టి ఓట్లను తొలగించిన ఈసీ బీజేపీకి సహకరించిందని ఆరోపించారు.
- 14 Nov 2025 1:06 PM IST
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగమైన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పోటీ చేసిన 28 స్థానాల్లో 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. LJP (రామ్ విలాస్) పనితీరు కూటమి స్థానానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రస్తుతం ECI ప్రకారం 86 స్థానాల్లో BJP, 35 స్థానాల్లో RJD, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
- 14 Nov 2025 12:40 PM IST
ఎన్డీఏ కూటమి బీహార్ లో 193 సీట్లలో ముందువరస లో వుంది. మహాగట్‌బంధన్ 46 సీట్లలో ఆధిక్యం లో వున్నారు. బీహార్ లో వస్తున్న ఫలితాలకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కారణం గా సమాజ్వాది పార్టీ కి చెందిన అఖిలేష్ యాదవ్ అన్నారు. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లో యిలాంటి ప్రక్రియ జరగనివ్వం అని అన్నారు. మహాగట్‌బంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి గా వున్న ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ ప్రస్తుతం ముందు వరస లో వున్నారు. లాలూ యాదవ్ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 10,000 ఓట్లతో మహుయా నుండి వెనుకంజ లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు.
- 14 Nov 2025 12:20 PM IST
బీహార్ ఎన్నికల ఫలితాలు జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆయన పార్టీ అభ్యర్థులు ఎక్కడా కూడా ఆధిక్యాన్ని చాటలేకపోయారు. ఎక్స్‌లో తన ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేశారు. “మేము నెలకు కేవలం రూ. 200 రూపాయలకే మా ఓట్లను అమ్ముకున్నాము” అని హిందీలో పోస్టు చేశారు. ఎన్డీఏ కూటమి ‘‘మహిళా రోజ్‌గార్ యోజన పథకం’’ కింద ఎన్నికలకు ముందు బీహార్ మహిళల ఖాతాలో నగదు ప్రోత్సాహకం రూ. 10 వేలును వారి బ్యాంకు ఖాతాలో జమచేసిన విషయం తెలిసిందే.
- 14 Nov 2025 12:08 PM IST
బీహార్ లోని సీమాంచల్ లోని 24 సీట్లలో ఎన్డీఏ కూటమి 17 సీట్లు, మహాగట్‌బంధన్ 4 సీట్ల లో ఆధిక్యం వుండగా 4 సీట్లలో 3 సీట్లలో ఆధిక్యం లో వున్నారు. తిర్హట్ ప్రాంతం లో ని 49 సీట్లలో ఎన్డీఏ కూటమి 44 సీట్లు మహాగట్‌బంధన్ 5 సీట్లు లో ముందు వరసలో వున్నారు. అంగ ప్రదేశ్ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి కి 25 సీట్లు, మహాగట్‌బంధన్ కు రెండు సీట్ల లో ఆధిక్యం లో వుంది. చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ 22 సీట్లలో ముందు వరస లో వుంది. మహాగట్‌బంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి గా వున్న ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ నుండి వెనుకంజలో వున్నారు. జేడీయు కు చెందిన అనంత్ సింగ్ మోకామ్ ఓట్ లతో ఆధిక్యం లో వున్నారు.
- 14 Nov 2025 11:51 AM IST
ఎన్డీఏ కూటమి బీహార్ లో 190 సీట్లలో ముందువరస లో వుంది. ఎన్డీఏ లో జెడియు కు 85 సీట్ లలో ఆధిక్యం ఉండగా. బీజేపీ 76 సీట్లలో ముందుంది. మహాగట్‌బంధన్ లోని ఆర్జేడీ 36 సీట్లలో సిపిఐ (ఎమ్ఎల్) 7 సీట్లలో, కాంగ్రెస్ 5 సీట్లలో, సిపిఎం 1 సీటు లో ముందు వరసలో వుంది. మహాగట్‌బంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి గా వున్న ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ నుండి వెనుకంజలో వున్నారు. ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుండి ఆధిక్యం లో వున్నారు. జేడీయు కు చెందిన అనంత్ సింగ్ మోకామ్ 11,000 ఓట్ లతో ఆధిక్యం లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు.






