
ఎగ్జిట్ పోల్స్ లైవ్..
పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు..
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలు నేటితో ముగిశాయి. రెండో దశలో బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ నమోదైంది. కేరళ, అస్సాంలలో అధికార ప్రభుత్వాలు తమ పట్టును నిలుపుకోనున్నాయా? తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో హోరాహోరీగా సాగిన ప్రచారాలు ఓటర్లను ప్రభావితం చేశాయా, పుదుచ్చేరి కీలక పోరులో ఎవరికి ఆధిక్యం ఉంది అన్నది త్వరలో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఈ అంచనాలు ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితిపై మొదటి సంకేతాలు ఇస్తాయి. కేరళ, అస్సాంలో అధికార పార్టీలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గట్టిపోటీ ప్రచారం ఓటర్లపై ఎలా ప్రభావం చూపిందో కూడా అర్థమవుతుంది. పుదుచ్చేరి పోరులో ఎవరు ముందంజలో ఉన్నారో కూడా ఈ అంచనాలు సూచించవచ్చు. అయితే అసలు ఫలితాలు మే 4న ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి.
Live Updates
- 29 April 2026 8:47 PM IST
“అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ముందంజలో ఉన్నాం’’
ఎగ్జిట్ పోల్స్‌పై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ముందంజలో ఉందని తెలిపారు. “అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో మేం ముందంజలో ఉన్నాం. మా అంచనాల ప్రకారమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూపిస్తున్నాయి” అని అన్నారు.
అయితే కేరళలో పార్టీ పరిస్థితి బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈరోజు కాకపోతే రేపు, కేరళలో కూడా బీజేపీ పాలన వస్తుంది” అని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ తమ నమ్మకాన్ని మరింత పెంచాయని పేర్కొంటూ, “ఈసారి అన్ని వైపుల నుంచి ప్రజలు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు” అని మనోజ్ తివారి అన్నారు.
#WATCH | Delhi | On exit polls, BJP MP Manoj Tiwari says, "We are clearly ahead in Assam, West Bengal and Puducherry. The exit polls are showing the results as we had expected...We are looking weak in Kerala, but we are confident that if not today, then tomorrow, the BJP will… pic.twitter.com/E5LehnFjl1
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 8:43 PM IST
140కి పైనే గెలుస్తాం..టీవీకే ప్రతినిధి రాధన్ పండిట్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై టీవీకే పార్టీ ప్రతినిధి రాధన్ పండిట్ విశ్వాసం వ్యక్తం చేశారు. టీవీకేకు సుమారు 30 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా. అయితే ఆయన వాటిని పూర్తిగా తిరస్కరించారు.
“మేము ఈ ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోవడం లేదు. మేము 140కంటే ఎక్కువ లేదా 170కంటే ఎక్కువ స్థానాలు గెలిచి ఈ ఎన్నికల్లో స్వీప్ చేస్తాం” అని పేర్కొన్నారు.
అలాగే, తమ పార్టీ స్వంత సర్వేలు నిర్వహించిందని, కనీసం 45% ఓట్ల మద్దతు తమకు ఉందని తెలిపారు. “ఇది 20-25 శాతం కాదు, మాకు భారీ ఓటు బ్యాంక్ ఉంది” అని పేర్కొన్నారు.
ఇంకా, “ఎన్నికల లెక్కింపునకు ఇంకా 108 గంటలు మాత్రమే ఉన్నాయి. 109వ గంట మేం ప్రమాణ స్వీకారం చేస్తాం. మా నాయకుడు విజయ్ ముఖ్యమంత్రి అవుతారు” అని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Chennai, Tamil Nadu: On Exit Polls for Tamil Nadu Legislative Assembly Election 2026, Tamilaga Vettri Kazhagam (TVK) Spokesperson, Radhan Pandit says, "We are just ignoring these exit polls. I am sure we are going to sweep this election by above 170 or above 140. We… pic.twitter.com/KgEMEAf0Lh
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 8:40 PM IST
పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఓటింగ్ శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో ఓటింగ్ శాతం 92.47%కి చేరిందని, ఇది మొదటి దశతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉందని వెస్ట్ బెంగాల్ సీఈవో మనోజ్ అగర్వాల్ చెప్పారు. “పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చిన్నచిన్న ఘటనలు మాత్రమే చోటుచేసుకున్నాయి” అని తెలిపారు.
ప్రత్యేకంగా కోల్‌కతాలో ఓటర్ల స్పందన చారిత్రాత్మకంగా నమోదైందని పేర్కొంటూ, “ఇప్పటివరకు ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈసారి ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. ప్రజలు దీన్ని ఒక పండుగలా భావించారు” అని వివరించారు.
#WATCH | Kolkata: West Bengal Chief Electoral Officer Manoj Agarwal says, "... Turnout reached 92.47%, with slightly higher voting in the second phase than the first. Polling was largely peaceful, with only minor incidents. Kolkata saw historic participation — even those who had… pic.twitter.com/FmevKSyPQs
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 8:00 PM IST
తమిళనాడులో టీవీకేకు 98 నుంచి 120 స్థానాలు..
ఇతర అన్ని సర్వేలకు విరుద్ధంగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సంచలన అంచనాలను వెల్లడించింది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు 98 నుంచి 120 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ పార్టీ స్వతంత్రంగా మెజారిటీ సాధించే స్థాయికి చేరవచ్చని సూచించింది.
ఇక డీఎంకేకు 92 నుంచి 110 స్థానాలు, ఏఐఏడీఎంకేకు కేవలం 22 నుంచి 32 స్థానాలు మాత్రమే రావచ్చని అంచనా వేసింది.
ఈ అంచనాలు ఈరోజు వెలువడిన ఇతర ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పీపుల్స్ పల్స్, మ్యాట్రైజ్, చాణక్య స్ట్రాటజీస్ వంటి సంస్థలు డీఎంకేకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేయగా, టీవీకేకు గరిష్టంగా 10 నుంచి 24 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొన్నాయి.
యాక్సిస్ మై ఇండియా అంచనాలు నిజమైతే, ఇది భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక తొలి విజయం (debut)గా నిలుస్తుంది. అయితే అసలు ఫలితాలు మే 4న వెల్లడవుతాయి.
- 29 April 2026 7:51 PM IST
‘ఎగ్జిట్ పోల్స్ గ్రౌండ్ రియాలిటీకి భిన్నంగా ఉన్నాయి. ’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఖండించారు. టీఎంసీకి చెందిన కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. ఈ సర్వేలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడంలేదన్నారు. “ఈ ఎగ్జిట్ పోల్స్‌కు అసలు ప్రామాణికత లేదు. గ్రౌండ్ రియాలిటీకి సంబంధం లేకుండా ఉన్నాయి.” అని పేర్కొన్నారు.
ఫలితాలు ఈ అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ, “మేము 235కి పైగా స్థానాలు గెలుస్తాం” అని చెప్పారు.
అలాగే బీజేపీ గాలి పరిమితంగానే ఉంటుందని చెబుతూ..“బీజేపీ 50 స్థానాలకంటే ఎక్కువ గెలవదు” అని కునాల్ ఘోష్ వ్యాఖ్యానించారు.
#WATCH | Kolkata | On exit polls for West Bengal, TMC leader Kunal Ghosh says, "The exit polls are baseless...It has nothing to do with the ground reality...We will win more than 235 seats and the BJP will not even win more than 50 seats" pic.twitter.com/kOfHJ4hWYv
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 7:48 PM IST
అస్సాం ఓటర్లు బీజేపీకి ఓటు వేయలేదు..
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి దేవబ్రత సైకియా తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “నేను ఎగ్జిట్ పోల్స్‌ను పెద్దగా పట్టించుకోను. ఈసారి సాధారణ ప్రజలు బీజేపీకి ఓటు వేయలేదని నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడూ సమస్యల ఆధారంగా జరుగుతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. “10 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ ఇచ్చినా, అందులో చెప్పిన హామీలను అమలు చేయలేదు. మంచి రోజులు వస్తాయని చెప్పి, అస్సాంలో మాత్రం చెడు రోజులు వచ్చాయి” అని అన్నారు.
ఉద్యోగ సమస్యను ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ.. “3.3 మిలియన్లకు పైగా యువకులు నిరుద్యోగంగా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని విమర్శించారు.
అలాగే పాలనపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. “ఇప్పటికంటే అవినీతి పెరిగింది. ఇచ్చిన హామీలు నెరవేరలేదు” అని సైకియా ఆరోపించారు.
#WATCH | Sivasagar, Assam: On the exit polls for Assam, LoP and Congress candidate from Nazira assembly, Debabrata Saikia says, "I don't pay much attention to exit polls, but the common man didn't vote for the BJP this time. I know this because elections are fought on issues. The… pic.twitter.com/Fjav6s4YRI
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 7:41 PM IST
అభివృద్ధికి పట్టం కట్టారు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై డీఎంకే నేత టి.కె.ఎస్. ఎలంగోవన్ స్పందించారు. ఈ అనుకూల అంచనాలకు పార్టీ పాలనలోని పనితీరే కారణమని తెలిపారు.
“గత ఐదేళ్లలో మా ప్రభుత్వ పనితీరే డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడానికి సాయపడింది” అని అన్నారు. తాజాగా విడుదలైన ఆర్థిక గణాంకాలను ప్రస్తావిస్తూ, “ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం తమిళనాడు ఆర్థిక వ్యవస్థను మేం రెట్టింపు చేశాం” అని పేర్కొన్నారు.
ఈ అభివృద్ధిని ముఖ్యమంత్రి M. K. Stalin నాయకత్వానికి అనుసంధానిస్తూ, “మన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తున్నారో ఇది చూపిస్తోంది. అందుకే ప్రజలకు ఆయనపై విశ్వాసం పెరిగింది” అని ఎలంగోవన్ అన్నారు.
అలాగే, “ప్రజలు ఆయనను రెండోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు” అంటూ డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
#WATCH | Chennai, Tamil Nadu: On exit polls for TN Assembly Election 2026, DMK spokesperson T K S Elangovan says, "... The performance for the past five years has helped DMK to come back to power. Even yesterday, the report says that the economic indicators show that we have… pic.twitter.com/CD4acS5X4h
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 7:37 PM IST
మళ్లీ ముఖ్యమంత్రి స్టాలినే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై డీఎంకే నేతలు స్పందించారు. ఆ అంచనాలు తమ విజయాన్ని తక్కువగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. డీఎంకేకు చెందిన సరవణన్ అన్నాదురై మాట్లాడుతూ.. “ఎన్నికల రోజు నుంచే మేము భారీ మెజారిటీతో గెలుస్తామని చెబుతున్నాం. కానీ ఎగ్జిట్ పోల్స్ మా బలాన్ని పూర్తిగా ప్రతిబింబించలేకపోయాయి.” అని అన్నారు. “180 సీట్ల తప్పక గెలుస్తాం. ఓట్ల శాతం తేడా కూడా 5% కంటే ఎక్కువగా ఉంది” అని చెప్పారు. ఈ విజయానికి కారణంగా ప్రభుత్వ పనితీరు, నాయకత్వమే నన్నారు. “ప్రజలు సంక్షేమ పథకాలు, మా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని విశ్వసించి డీఎంకేకు భారీగా మద్దతు ఇచ్చారు” అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి మాట్లాడుతూ.. “ఆయన ఒక్కరే ఈ ఎన్నికలను ముందుండి నడిపించారు. ఆయననే మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతారు” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
#WATCH | Chennai: On the exit polls for Tamil Nadu, DMK spokesperson Saravanan Annadurai says, "Right from the day of the election, we have been maintaining that we will win this election with a massive margin. And the exit polls, though they are conservative in my estimate, the… pic.twitter.com/Rios8z7Sv0
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 7:32 PM IST
“Let the leader descend.. Let history be written”
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ డీఎంకేకు అనుకూలంగా వస్తుండడంతో ఆ పార్టీ ఐటీ వింగ్ స్పందించింది. మూడు ప్రధాన ఎగ్జిట్ పోల్స్ డీఎంకేకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే డీఎంకే ( Dravida Munnetra Kazhagam) ఐటీ వింగ్ “నాయకుడు ముందుకు రావాలి. చరిత్ర లిఖించాలి” (“Let the leader descend.. Let history be written”)అని X (ట్విట్టర్)లో పోస్టు చేసింది. అయితే, ఈ పోస్టులో ఎగ్జిట్ పోల్స్ గురించి నేరుగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయినప్పటికీ, తాజా అంచనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను పార్టీ విజయం పై సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
தலைவர் இறங்கட்டுமே..
— DMK IT WING (@DMKITwing) April 29, 2026
சரிதம் எழுதட்டுமே!
#DMKWinningTN pic.twitter.com/un32ydYZRA


