LIVE Israeli Strikes on Tehrans Gandhi Hospital
x
టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రి ప్రవేశద్వారం

ఇరాన్ గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడి, ఆస్పత్రి ధ్వంసం

రోగుల హాహాకారాలు, ఆస్పత్రి నుంచి పేషెంట్ల తరలింపు


ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రి ధ్వంసమైంది. ఇరాన్-అమెరికా యుద్ధంలో ఈ ఆస్పత్రి ధ్వంసమైనట్టు తెలుస్తోంది. టెహ్రాన్ ఉత్తర భాగంలో గాంధీ స్ట్రీట్ ప్రాంతంలో ఉన్న ఈ ఆస్పత్రి ధ్వంసం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
గాంధీ ఆస్పత్రి: నేపథ్యం
గాంధీ హోటల్-హాస్పిటల్ కాంప్లెక్స్‌లో భాగమైన ఈ ఆస్పత్రి 2008లో ఏర్పాటైంది. 32,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి, 100 ఇన్‌పేషెంట్ బెడ్స్, 40 ICU బెడ్స్, 17 అధునాతన ఆపరేషన్ థియేటర్లతో ప్రసిద్ధి చెందింది.

ఇరాన్ మెడికల్ టూరిజం కేంద్రంగా ప్రసిద్ధి. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా రోగులు వచ్చే హాస్పిటల్ ఇది. ఎంట్రన్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహం ఉంటుంది. ఇది మామూలు ఆస్పత్రి మాత్రమే కాదు ఇదో లగ్జరీ హోటల్ తో కలగలిపిన అత్యాధునిక మెడికల్ ఫెసిలిటీ.
యుద్ధ సందర్భంలో...
ఫిబ్రవరి 28, 2026న అమెరికా (ట్రంప్ ప్రభుత్వం) + ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భారీ దాడులు చేశాయి. ఇందులో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా టాప్ లీడర్లు చనిపోయారు. మార్చి 1న ఈ దాడులు రెండో రోజు కొనసాగాయి. ఇజ్రాయెల్ “ఇరాన్ టెరర్ రెజిమ్ హార్ట్ ఆఫ్ టెహ్రాన్”ను టార్గెట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రి దెబ్బతింది.
ఏమి జరిగింది?
ఇజ్రాయెల్ (అమెరికా మద్దతుతో) వైమానిక దాడులు గాంధీ స్ట్రీట్ ఏరియాలోని ఆస్పత్రిని నేరుగా తాకాయి. రాయిటర్స్ ప్రకారం ఇద్దరు సాక్షులు చెప్పినట్లు – ఆస్పత్రి “బాగా ధ్వంసమైంది”, రోగులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఇరాన్ స్టేట్ మీడియా (ISNA, Fars, Press TV, IRIB) దీన్ని “జియోనిస్ట్-అమెరికన్ ఎయిర్ స్ట్రైక్స్”గా అభివర్ణించింది.
ధ్వంసం ఎలా అయిందంటే?
ఎంట్రన్స్ భాగం తీవ్రంగా దెబ్బతింది. కిటికీలు పగిలిపోయాయి. గోడలు బీటలు వారాయి. ధూళి ధూమారం రేగింది. లోపల ఫ్లోర్‌ అంతా పగిలిన గాజు పలకలతో నిండిఉంది. వీల్‌చైర్లు, స్ట్రెచర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక ఆస్పత్రి బయట చెప్పనలివి కాకుండా ఉంది పరిస్థితి.
రోగుల హాహాకారాలు...
నర్సులు, సిబ్బంది రోగులను వెంటనే బయటకు తీసుకొచ్చారు. ఒక ఇంక్యుబేటర్‌లో ఉన్న బేబీని కూడా సేఫ్‌గా బయటకు తరలించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో రోగుల ఆర్తనాదాలు, రోగులు రోడ్డుపై పరుగులు తీయడం కనిపిస్తుంది. వీల్‌చైర్లు చెల్లాచెదురు, నర్సులు రన్ చేస్తూ కనిపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, అల్ జజీరా వంటి మీడియా ఈ దృశ్యాలను ప్రసారం చేశాయి.

ఆస్పత్రి బిల్డింగ్ బాగా డ్యామేజ్ అయింది. పేషెంట్ కేర్ పూర్తి స్థాయిలో ఆగిపోయింది. హాస్పిటల్ స్పెసిఫిక్ మరణాల సంఖ్య ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ టెహ్రాన్‌లోని ఇతర దాడుల్లో 20మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల నివాసితులు, సిబ్బంది భయంతో రోడ్లపైకి వచ్చారు.
అంతర్జాతీయ ప్రతిస్పందన..
WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్... “టెహ్రాన్ గాంధీ ఆస్పత్రి ధ్వంసం అత్యంత ఆందోళనకరం. హెల్త్ ఇస్ నాట్ ఎ టార్గెట్!” అని Xలో పోస్ట్ చేశారు. WHO ధృవీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇది “యుద్ధ నేరం” అని ఇరాన్ ఆరోపించింది.
ఇది ఎందుకు ముఖ్యం?
గాంధీ ఆస్పత్రి ధ్వంసం కేవలం ఒక హాస్పిటల్ దాడి కాదు- ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో సివిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆసుపత్రులు) కూడా టార్గెట్ అవుతున్నాయనే దానికి సిగ్నల్. ఇది ఇరాన్ రిటాలియేషన్ (దుబాయ్‌పై దాడులు)ను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. ఇరాన్ మెడికల్ టూరిజం, సాధారణ ప్రజల జీవితాలపై పెద్ద విఘాతం అనే చెప్పాలి.
ప్రస్తుతం (మార్చి 2, 2026) ఆస్పత్రి ఖాళీ అయింది. రోగుల్ని ఇతర చోట్లకు షిఫ్ట్ చేస్తున్నారు. పరిస్థితి ఇంకా టెన్షన్‌గానే ఉంది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం మానవీయ విపత్తుగా మారకుండా శాంతి ఏర్పడాలని ఆశిద్దాం.

Live Updates

  • 2 March 2026 6:37 PM IST

    క్రూడ్ ఆయిల్ సరఫరాకు అంతరాయం..

    దేశ ప్రజల అవసరాల నిమిత్తం 88 శాతం క్రూడ్ ఆయిల్, సుమారుగా సగం నేచురల్ గ్యాస్‌ను ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇవి హార్ముజ్ స్ర్టైట్ మార్గం ద్వారా భారత్‌కు చేరుతాయి. అయితే అమెరికా,ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ అధికారులు ఈ మార్గాన్ని మూసివేశారు. దీని ప్రభావం క్రూడ్ ఆయిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై పడనుంది. కాగా, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు.

  • 2 March 2026 5:53 PM IST

    ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కటార్ ఎనర్జీ..

    ప్రపంచంలోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరాదారు ‘కటార్ ఎనర్జీ’ యుద్ధం కారణంగా ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు తెలిపింది. అయితే ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే సమయం గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నూనె ధరలు ఇప్పటికే పెరిగాయి.

  • 2 March 2026 5:05 PM IST

    ఓమాన్ గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి - భారతీయుడి మృతి

    డ్రోన్ బాంబర్ ఓమాన్ గల్ఫ్‌లో చమురు ట్యాంకర్‌(ఓడ)ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఒమన్ సుల్తానేట్ రాజధాని మస్కట్ తీరంలో జరిగిన ఘటనలో భారతీయుడయిన నావీ డ్రైవర్ మృతి చెందినట్లు ఓమాన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఓడను MKD VYOM‌గా గుర్తించారు. 

  • 2 March 2026 4:47 PM IST

    టెల్ అవీవ్ కార్యాలయంపై దాడి?

    ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు టెల్ అవీవ్ కార్యాలయాన్ని, అలాగే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాకెట్లను ప్రయోగించినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. అయితే ఆ సమయంలో నెతన్యాహు కార్యాలయంలో ఉన్నారో లేరో స్పష్టంగా తెలియడం లేదని వార్తా ఏజెన్సీ UNI పేర్కొంది. 

  • 2 March 2026 4:40 PM IST

    పతనం దిశగా సెన్సెక్స్..

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సెన్సెక్స్ సోమవారం 2.1 శాతానికి పడిపోయింది. యుఎస్ ఫ్యూచర్స్ 1 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. నూనె ధరలు భారీగా పెరిగాయి. S&P 500, డౌ జోన్స్ సూచికలు 1.7 శాతానికి పడిపోయాయి. ఇక యూఎస్ నూనె ధర 9 శాతం పెరిగి 73 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ 80 డాలర్లకు చేరువలో ఉంది. జపాన్ నిక్కే 225 సూచిక వద్ద ప్రారంభమై 2 శాతం తగ్గి చివరికి 1.4 శాతం వద్ద ముగిసింది. బంగారం ధర భారీగా పెరిగి రూ. 1,70వేలు దాటింది.

  • 2 March 2026 3:21 PM IST

    స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఐఆర్‌జీసీ..

    అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు చేస్తోన్న ఇరాన్ ప్రత్యేక దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC).. ప్రస్తుతం నాయకత్వం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ‘అల్ జజీరా’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతిదాడి విషయంలో IRGC స్వతంత్రంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 1979లో ఇస్లామిక్ వ్యవస్థను రక్షించడానికి ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. అయితే అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఈ దళానికి నాయకత్వం లేకుండా పోయింది. 

  • 2 March 2026 3:11 PM IST

    రిఫైనరీపై డ్రోన్లతో దాడి..

    సౌదీ అరేబియాలోని డమ్మామ్ నగరానికి సమీపంలోని రాస్ తనూరా రిఫైనరీ రోజుకు ఐదు లక్షల బ్యారెల్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ఈ కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం డ్రోన్లతో దాడికియత్నం జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే వస్తున్న డ్రోన్లను సౌదీ సైన్యం కూల్చివేసిందని అధికారులు తెలిపారు. వాటిని కూల్చేసినప్పుడు వచ్చే నిప్పురవ్వలతో రిఫైనరీకి అగ్నిప్రమాదం పొంచి ఉంచి.  

  • 2 March 2026 1:10 PM IST

    ఇజ్రాయెల్ దాడుల్లో 31 మంది మృతి

    ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వైమానిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడుల్లో మరో 149 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కువైట్‌లో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడున్న అమెరికన్లు వెంటనే ఆశ్రయం తీసుకుని ఇండ్లలోనే ఉండాలని అమెరికా అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.  

  • 2 March 2026 1:04 PM IST

    ఖమేనీ పోయినా దిగిరాని ఇరాన్: ఇరాన్ మత నేత ఖమేనీ హత్య తర్వాత అమెరికా అనుకున్నట్లు ఇరాన్ లొంగిరాలేదు. బతికి ఉన్న ఉన్నతస్థాయి నాయకులంతా విబేధాలు మర్చిపోయి చేతులు కలపి ధిక్కార వినిపిస్తున్నారు. అమెరికా పై దాడులు సాగుతాయని ప్రకటిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలపై క్షిపణులను ప్రయోగిస్తూ నే ఉన్నారు. దీనితోో టెహరాన్ మీద అమెరికా బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. కొత్త పాలక వర్గం పనిలోకి దూకుతుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజస్కియాన్ ప్రకటించారు.

  • 2 March 2026 12:53 PM IST

    అమెరికా సైనిక విమానం కూలిపోయింది: కొద్ది సేపటి కిందట కువైట్‌లోని అల్ జహ్రా సమీపంలో అమెరకి వైమానిక దళ F-15E స్ట్రైక్ ఈగిల్ కూలిపోయింది, ఆన్ లైన్ వీడియో ఫుటేజ్ ప్రకారం పైలట్ తో మరొక మిలిటరీ అధికారి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణం, యాంత్రిక లోపం లేదా ఎవరైనా దీనిని కూల్చేశారా అనేది ఇంకా తెలియదు. ఈ సంఘటనకు సంబంధించి అమెరికా లేదా కువైట్ అధికారులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Read More
Next Story