చార్జ్ షీట్ నుంచి కాదంబరి తల్లిదండ్రుల పేర్లు తొలగింపు ఎందుకు?
ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఆమె తల్లి, తండ్రి, సోదరుని పేర్లను సీఐడీ పోలీసులు చార్జ్ షీట్ నుంచి తొలగించారు.
ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఆమె తల్లి, తండ్రి, సోదరుని పేర్లను పోలీసులు చార్జ్ షీట్ నుంచి తొలగించారు. వైఎస్సార్సీపీ నాయకులు కుక్కల విద్యాసాగర్ కాదంబరీ జెత్వానిపై పెట్టిన కేసులో తల్లిదండ్రులు, సోదరునికి సంబంధం లేదని భావించిన సీఐడీ వారి పేర్లను తొలగించి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ విషయంలో విద్యాసాగర్ లాయర్ ద్వారా విద్యాసాగర్ ఒపీనియన్ తెలుసుకుని చెప్పాలని కోర్టు కోరింది. జెత్వానీ తల్లి అకౌంట్ కు విద్యాసాగర్ ద్వారా డబ్బు చేరిందని, ఆ డబ్బులు కాదంబరీ బెదిరించడం వల్లే ఇచ్చాడని మరో పక్క సీఐడీ పోలీసులు తేల్చారు. అయినా తల్లి పేరును ఎందుకు చార్జిషీట్ నుంచి తొలగించారనే చర్చ జరుగుతోంది.
Next Story

