x

రూ. 14 లక్షల కోట్ల పెట్టుబడులు కాగితంపై.. నేలపై ఎంత?

ఏపీలో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం.. అసలు పరీక్ష గ్రౌండింగ్ లోనే...


ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ కొనసాగుతోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 21వ సమావేశంలో రూ.22,178 కోట్ల విలువైన 28 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 19,739 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం పేర్కొంది. శక్తి, సమాచార సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలు ఈ జాబితాలో ఉన్నాయి.

గత రెండేళ్లలో 21 సమావేశాల్లో ఎస్‌ఐపీబీ మొత్తం 387 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది. వీటి సంభావ్య పెట్టుబడి రూ.14.05 లక్షల కోట్లు, ఉద్యోగ పొటెన్షియల్ 10.79 లక్షలు. ఇవి ఆమోదాలు మాత్రమే. నిజానికి నేలపై పనులు మొదలయ్యే గ్రౌండింగ్ వేరు అంశం.
ప్రభుత్వ వాదన ఏమిటంటే రాయితీలు ఉన్నాయి కానీ పెట్టుబడిదారులు రాయితీ కంటే వేగం, భూమి, కరెంటు, పాలసీ స్థిరత్వం చూస్తారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దీన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఆమోదం అయిన ప్రాజెక్టులు ఆరు నెలల్లో నిర్మాణం మొదలుపెట్టాలని ఆదేశించారు.

రాయితీలు ఏమిటి

పారిశ్రామిక విధానం 4.0 (2024–29), డేటా సెంటర్ పాలసీ, సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్, క్వాంటం పాలసీల కింద క్యాపిటల్ సబ్సిడీ, నెట్ ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, స్టాంప్ డ్యూటీపై 100 శాతం మినహాయింపు, పవర్ సబ్సిడీ, పారిశ్రామిక టారిఫ్ ఉన్నాయి. మెగా ప్రాజెక్టులకు కేసు టు కేసు టైలర్‌మేడ్ ప్యాకేజీలు ఇస్తున్నారు. సెమీకండక్టర్లలో కేంద్ర పీఎల్‌ఐతో కలిపి మొత్తం సబ్సిడీ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెద్ద భాగం వరకు చేరే అవకాశం ఉంది. 50 మెగావాట్లు దాటిన లేదా పెద్ద ఎఫ్‌సీఐ ఉన్న డేటా సెంటర్లకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి.
విశాఖలో గూగుల్–అదానీ డేటా సెంటర్‌కు రాష్ట్రం పెద్ద ఇన్సెంటివ్ కమిట్‌మెంట్ చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు కూడా పెద్ద ప్యాకేజీ ప్రస్తావన ఉంది. వీటిపై పారదర్శకత, రాష్ట్ర ఖజానాపై భారం అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. సీఎం ఆగస్టులో ఇన్సెంటివ్‌లను ఎస్క్రో అకౌంట్ల ద్వారా సకాలంలో ఇవ్వాలని చెప్పారు. రాయితీలను గ్రౌండింగ్‌కు లింక్ చేయాలని ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా స్పష్టం చేశారు.

ఎవరి పాత్ర ఎంత

సీఎం చంద్రబాబు నాయుడు ఎస్‌ఐపీబీ చైర్మన్‌గా పెద్ద ప్రాజెక్టుల ఫైనల్ నోడ్ ఇస్తున్నారు. సింగపూర్ వంటి విదేశీ రోడ్‌షోలు, పోర్ట్–లాజిస్టిక్స్, హార్డ్‌వేర్, క్వాంటం, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలు ఆయనే నిర్దేశిస్తున్నారు. బ్రాండ్ ఏపీ, పాలసీ స్థిరత్వం ఆయన పేరుతోనే అమ్ముతున్నారు.
నారా లోకేష్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల ద్వారా డేటా సెంటర్లు, జీసీసీలు, క్వాంటం వ్యాలీ, స్కిల్, సింగిల్ డెస్క్ వేగాన్ని నడిపిస్తున్నారు. ఢిల్లీ, జాతీయ వేదికలపై ఏపీని టెక్ హబ్‌గా పిచ్ చేస్తున్నారు. హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ వంటి ఫైళ్లలో ఆయన పేరు తరచు వస్తుంది.
పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఎడిబీ, ఏపీఐఐసీ భూమి కేటాయింపు, పార్కులు, ఎంఓయూల నుంచి ఎస్‌ఐపీబీకి తీసుకురావడం చూస్తాయి. ఎనర్జీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఫైళ్లు ఇక్కడ నడుస్తాయి. క్యాటర్‌పిల్లర్, మైహోమ్ ఇండస్ట్రీస్, షిప్‌యార్డ్ ప్రతిపాదనలు ఈ ఛానెల్‌లో ఉన్నాయి. ఎస్‌ఐపీబీ సమావేశాల్లో టీజీ భరత్, సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు వంటి మంత్రులు కూడా పాల్గొంటారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పారిశ్రామిక ఫైల్ ప్రధాన యజమాని కాదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఆయన పరిధి. పెట్టుబడుల్లో పాత్ర పరోక్షం. లా అండ్ ఆర్డర్ సందేశం, కూటమి రాజకీయ స్థిరత్వం, గ్రామీణ–ఎంఎస్‌ఎంఈ కనెక్ట్ ఇక్కడే. పెద్ద ఐటీ, స్టీల్, డేటా సెంటర్ డీల్స్‌లో ఆయన పేరు ప్రధానంగా రాదు.
సింగిల్ డెస్క్, ఆర్టీజీఎస్, కలెక్టర్లు, పోర్ట్, పవర్ యుటిలిటీలు అమలు పొర. భూమి, క్లియరెన్స్‌లు, పవర్ లైన్ ఇక్కడే నిలుస్తాయి లేదా కదులుతాయి. నాలా చట్టం రద్దు, డీక్రిమినలైజేషన్, ఈఓడీబీ యాక్ట్ 2026 ఈ పొరకు సంబంధించినవి.
కేంద్రం పాత్ర కూడా కీలకం. సెమీకండక్టర్ మిషన్, పీఎల్‌ఐ, పోర్ట్, డిఫెన్స్, గ్రీన్ హైడ్రోజన్ క్లియరెన్స్‌లు లేకుండా రాష్ట్ర రాయితీ ఒక్కటే సరిపోదు. గూగుల్, స్టీల్, రిఫైనరీ స్థాయి డీల్స్ కుదరాలంటే కేంద్ర ప్యాకేజీ కూడా కావాలి.

బ్యాలెన్స్ ఏమిటి

విజన్, ఫైనల్ నోడ్ సీఎం వద్ద. టెక్, ఐటీ డీల్స్ లోకేష్, ఐటీ శాఖ వద్ద. భూమి, పార్కు, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ వద్ద. రాజకీయ కవర్ కూటమి, డిప్యూటీ సీఎం వద్ద. అమలు సింగిల్ డెస్క్ యుటిలిటీల వద్ద.
రాయితీలు ఆకర్షణకు తలుపు తీస్తాయి. నిర్ణయం వేగం, భూమి అందుబాటు, కరెంటు, పోర్ట్ కనెక్టివిటీ లేకపోతే డీల్ ఆగుతుంది. ప్రశ్న ఇక రాయితీలు ఇస్తున్నారా కాదు అనేది కాదు. ఆమోదమైన రూ.14 లక్షల కోట్లలో ఎంత గ్రౌండ్ అవుతుంది, ఎస్క్రో ద్వారా రాయితీలు నిజంగా సకాలంలో పడతాయా అనేదే అసలు పరీక్ష.
Read More
Next Story