ఏపీలో 81 మంది లిటిగెంట్ పిటీషనర్ లు
రిజిస్ట్రేషన్ శాఖపై సమీక్షలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో ౮౧ మంది లిటిగెంట్ పిటీషనర్ లు ఉన్నారని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వేల సంఖ్యలో వారి నుంచి వస్తున్న పిటీషన్ లను ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కరి నుంచి వేల కొలది పిటీషన్ లు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటువంటి వారి వల్ల పరిపాలనలో స్తబ్ధత ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరందరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Next Story

