ఒమన్-యూఏఈల మధ్య తొలిసారిగా అందుబాటులోకి హఫీత్ రైలు
ఒమన్‌లో రైలు కూత ఎందుకు లేదు?
ప్రపంచమంతటా ఆధునిక రైళ్లతో దూసుకుపోతుంటే ఒమన్ దేశంంలో మాత్రం రైలు కూతే వినబడదు ఎందుకని?
ఫోటోలుః
ఒమన్ 1ః ఒమన్-యూఏఈల మధ్య తొలిసారిగా అందుబాటులోకి హఫీత్ రైలు
ఒమన్ 2ః హఫీత్ రైలు ప్రాజెక్టులో భాగంగా టన్నెల్స్ కోసం కొండలను తవ్వుతున్న దృశ్యం
ఒమన్ 3ః ఒమన్ రోడ్లపై దూసుకుపోతున్న కార్లు
సంపన్న దేశం ఒమన్‌లో రైళ్లు లేవంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ నిజంగానే ఇక్కడ ఒక్కటంటే ఒక్క రైలు కూడా లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు రైలు మార్గాలు లేని దేశాలు నామమాత్రంగా ఉన్నాయి. వీటిలో ఐస్‌ల్యాండ్, అండోరా, భూటాన్, కువైట్, మాల్దీవ్స్, సైప్రస్, ఎమన్ దేశాలున్నాయి. సంపన్న దేశం ఒమన్‌లో కూడా ఇప్పటి వరకు రైలు సర్వీసులు లేవు. ఇన్నాళ్లూ కేవలం వాయు, రోడ్డ, సముద్ర మార్గాల ద్వారానే ఒమన్ కు రాకపోకలు సాగుతున్నాయి. ఎంతో కాలం తర్వాత ఈ దేశంలో తొలిసారిగా ఒమన్-యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లను కలుపుతూ 238 కి.మీల మేర రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని హఫీత్ రైల్ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. ఒమన్‌లోని ప్రముఖ ఓడరేవు నగరం సోహార్ నుంచి యూఏఈలోని అబుదాబి వరకు అల్ బురేమి, అల్ ఐన్ పట్టణాల సమీపం నుంచి నిర్మిస్తున్నారు. ఇందుకు సుమారు రూ.25 వేల కోట్లను వెచ్చిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య రైల్వే లైన్ ఏర్పాటు కోసం మార్గ మధ్యలో కొండలను తవ్వి సొరంగ మార్గాలను రూపొందిస్తున్నారు. ఈ రైల్వే లైన్ 2027 ఆఖరికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పనులను వేగవంతం చేశారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రైళ్లతో పాటు సరకు రవాణా (గూడ్స్) రైళ్లను కూడా నడుపుతారు. ఈ ట్రాక్‌పై ప్రయాణికుల రైళ్లు గంటకు గరిష్టంగా 200 కి.మీల వేగంతో, గూడ్స్ రైళ్లు 120 కి.మీల స్పీడుతోనూ ప్రయాణించేలా నిర్మాణాన్నిచేపడుతున్నారు. ఇది రైల్వే లైన్ కార్యరూపం దాలిస్తే ఒమన్-యూఏఈల మధ్య ప్రజారవాణాతో పాటు కీలకమైన సరకు రవాణా కూడా మెరుగవుతుంది. ఈ రెండు దేశాల మధ్య వ్యపారం, పర్యాటకం, సరకు రవాణా ఎంతో సులభతరమవడంతో పాటు మరింత అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు.. భవిష్యత్తులో ఈ రైల్వే లైన్ మరింత విస్తరించి మొత్తం గల్ఫ్ దేశాలను కలిపే రైల్వేనెట్‌వర్క్‌లో భాగం చేయాలని యోచిస్తున్నారు. హఫీత్ రైల్వే లైన్‌తో ఒమన్ చరిత్రలో తొలిసారిగా రైళ్లు పట్టాలెక్కే అవకాశం కలుగుతుంది. ఈ దేశ ప్రజలకు రైళ్లలో ప్రయాణించే సదుపాయం లభిస్తుంది. సోహార్ నుంచి అబుదాబికి కేవలం గంట 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
హఫీత్ రైలు ప్రాజెక్టులో భాగంగా టన్నెల్స్ కోసం కొండలను తవ్వుతున్న దృశ్యం
ఒమన్‌లో రైల్వే లైన్లు ఎందుకు లేవు?
ఒమన్ దేశంలో రైల్వే లైన్లు లేకపోవడానికి కారణం ఆ దేశ భౌగోళిక పరిస్థితులే. ఒమన్ వైశాల్యం 3.12 లక్షల చదరపు కి.మీలుండగా ఇందులో దాదాపు మూడొంతులు కొండ ప్రాంతమే. ఈ పర్వత శ్రేణుల వల్ల అనేక చోట్ల భూభాగం ఎత్తు పల్లాలుంటాయి. రైల్వే లైన్ల ఏర్పాటుకు కొండలను తొలిచి సొరంగాలను తవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఖర్చుతో పాటు కష్టతరంతో కూడుకున్న పని. అందువల్ల ఒమన్‌లో రైల్వే సదుపాయం ఇన్నాళ్లూ అందుబాటులోకి రాలేదు.

ఒమన్ రోడ్లపై దూసుకుపోతున్న కార్లు
ఒమన్‌లో సొంత కార్లదే పైచేయి..
ఒమన్‌లో సొంత వాహనదార్లు అత్యధికంగా ఉండగా, ద్విచక్ర వాహనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం 18,96,956 వివిధ రకాల వాహనాలుండగా అందులో 15,03,239 ప్రైవేటు వాహనాలు (కార్లు వగైరా)న్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాల సంఖ్య కేవలం 9,005 మాత్రమే. అంటే సగటున ప్రతి నలుగురిలో ఒకరికి ఒక కారు, ప్రతి 15 వేల మందికి ఒక ద్విచక్ర వాహనం చొప్పున ఉందన్న మాట! ఇక కార్లలో విలాసవంతమైనవే ఎక్కువగా ఉంటాయి. కొందరు ధనికులు మూడు, నాలుగు కార్లను కలిగి ఉంటారు. ఈ దేశంలోని ప్రధాన రోడ్లపై రయ్‌రయ్‌మని దూసుకుపోయే కార్లే తప్ప బైక్‌లు మాత్రం కనిపించవు. ఆ బైక్‌లు కూడా ఖరీదైనవే (రూ.20-60 లక్షల విలువ చేసేవి). పెట్రోల్ ధర లీటరు 0.229 రియాల్స్ (భారత కరెన్సీలో రూ.57.67లు). ఆసక్తికరమైన విషయమేమిటంటే దేశం మొత్తమ్మీద ప్రజా రవాణా బస్సులు కేవలం 500 మాత్రమే ఉన్నాయి. వీటికంటే స్కూలు బస్సులే (22,242) ఎక్కువ. ఇక్కడ కార్లలో తప్ప బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రభుత్వం అందుకనుగుణంగానే వీటిని నడుపుతోంది. రాజధాని మస్కట్ లాంటి మహానగరంలో సైతం సిటీ బస్సు సర్వీసులు లేవు. అలాగే దేశం మొత్తమ్మీద ఆటో సర్వీసులుండవు. ఈ దేశంలో తిరిగే లారీలు, వ్యాన్లు వంటి రవాణా వాహనాలకు కూడా కార్ల మాదిరిగా ఏసీలే ఉంటాయి.
వేగాన్ని బట్టి రోడ్డు లేన్లు..
మరోవైపు ఈ దేశంలో వాహనాలు వేగంగా పయనించడానికి నాలుగు, ఆరు, ఎనిమిది లేన్ల రోడ్లున్నాయి. ఒకే రోడ్డుపై 120 కి.మీలకు పైగా వెళ్లే వాహనాలకు ఒకటి, 100-120 కి.మీల వేగానికి మధ్య లేన్, అంతకంటే తక్కువ వేగంతో వెళ్లేందుకు మరో లేన్ ఉంటాయి. వేగానికి అనుగుణంగా ఆయా వాహనాలు నిర్దేశిత లేన్లపై మాత్రమే ప్రయాణిస్తాయి. దీంతో ఓవర్ టేకింగ్‌లు ఉండవు. అంతేకాదు.. ఒమన్ రోడ్లపై వాహనాల హారన్లు అస్సలు వినిపించవు. అత్యవసరమైతే తప్ప ఎవరూ హారన్లు కొట్టరు. ఇలా క్రమశిక్షణతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంటుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు, జామ్‌లకు ఆస్కారం ఉండదు.
హైవే పక్కన ఊళ్లుండవ్..
ఇంకో విశేషమేమిటంటే.. ఒమన్‌లో హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలకు ఆనుకుని చాలా చోట్ల ఊళ్లుండవు. కొన్ని పట్టణాలు, నగరాల మీదుగా కొన్ని హైవేలు, బైపాస్‌లో ఎక్స్‌ప్రెస్ వేలు ఉన్నాయి. భారత్‌లో మాదిరిగా రోడ్లకిరువైపులా ఊళ్లు లేకపోవడం వల్ల రోడ్లు దాటే సమయంలో ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఉండదు.
మద్యపానానికి లైసెన్స్ తప్పనిసరి..
ఒమన్‌లో అక్కడ ప్రజలు మద్యపానం సేవనం నిషేధం. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రం మద్యం తాగడానికి లైసెన్స్ తప్పనిసరి. ఈ లైసెన్స్ లేనివారు మద్యాన్ని కలిగివున్నా, సేవించినా నేరమే. పైగా మద్యం కొనుగోలుపై కూడా పరిమితి ఉంటుంది. లైసెన్స్ పొందిన వ్యక్తి ఆదాయానికి అనుగుణంగానే మద్యం విక్రయిస్తారు. లైసెన్స్ ఉన్న వారు మద్యాన్ని తమ ఇళ్ల వద్ద మాత్రమే తాగాలి తప్ప బహిరంగ ప్రదేశాల్లో అనుమతించరు. దీంతో ఒమన్‌లో ఎక్కడా తాగి ఊగే వారు, ఆ మత్తులో అఘాయిత్యాలకు పాల్పడే వారు, జనాన్ని ఇబ్బందికి గురి చేసే వారుండరు. అలా ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
దొంగల బెడద ఉండదు..

ఒమన్ దేశంలో దొంగల బెడద ఏమంత ఉండదు. వివిధ పట్టణాలు, నగరాల్లోని షాపులకు రాత్రి వేళ షట్టర్లు వేయరు. ఆ షాపులకుండే గ్లాస్ డోర్లకు మాత్రమే తాళాలు వేస్తారు. దొంగతనాలకు పాల్పడే వారికి ఈ దేశంలో శిక్షలు అత్యంత కఠినంగా ఉండడం, చోరీలకు పాల్పడేటంత పేదరికం కూడా లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతారు.
Next Story