విశాఖలో ఓటేసేందుకు క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లు
వైజాగ్ ఓటరులో వైరాగ్యం ఎందుకొచ్చింది?
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు సగం మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు ఎందుకు?
విద్యావంతులు, చైతన్యవంతులు, మేధావులు, ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా విశాఖ నగరానికి పేరు. అలాంటి విశాఖలో జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో వైజాగ్ వాసులు వైరాగ్యాన్ని ప్రదర్శించారు. మునుపటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి దాదాపు 50 శాంతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ చురుగ్గా పాల్గొనే వైజాగ్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ముఖం చాటేశారు. తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది!
కూటమి జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి
గ్రేటర్ విశాఖలో మొత్తం 18,37,901 మంది ఓటర్లున్నారు. 98 వార్డులున్న జీవీఎంసీలో ఆ సంఖ్యను ఈ ఎన్నికల్లో 120 కి పెంచారు. అంటే మరో 22 వార్డులు పెరిగాయన్న మాట. ఆదివారం జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని బరిలో నిలిచిన అభ్యర్థులు, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల నేతలు ఆశించారు. అయితే వైజాగ్ ఓటర్లు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ ఓటింగ్‌లో 56.32 శాతం అంటే.. 10,35,154 మంది మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన వారంతా డుమ్మా కొట్టారు. అధికారులు ఎక్కడికక్కడే పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన అటు వైపు కన్నెత్తయినా చూడలేదు. తొలుత ఆదివారం రాత్రి బాగా పొద్దు పోయే వరకు 51.47 శాతం మాత్రమే పోలయినట్టు గణాంకాలు వెలువడ్డాయి. సోమవారం ఉదయానికి తుది టాబ్యులేషన్ పూర్తయ్యాక పోలింగ్ 56.32 శాతానికి పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. జీవీఎంసీ పరిధిలో భీమిలి జోన్‌లో అత్యధికంగా 66.27 శాతం, అత్యల్పంగా నార్త్ జోన్ లో 49.71 శాతం ఓట్లు పోలయ్యాయి.
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి
2021 ఎన్నికలకంటే తక్కువే..
జీవీఎంసీకి 2021లో జరిగిన ఎన్నికల్లో 59.41 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పట్లో 17.26 లక్షల ఓటర్లకు గాను 10.25 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అంతకు ముందు 2007లో జరిగిన ఎన్నికల్లో 52.48 శాతం పోలింగ్ నమోదైంది. అంటే 2021 ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు నాలుగు శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు సోమవారం ఉదయానికి పోలింగ్ శాతం పెరగడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఐదు శాతం ఓట్లు ఎలా పెరగాయని వైఎస్సార్‌సీపీ సహా వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. పోలింగ్ ముగిశాక ఓటింగ్ శాతంలో పెరుగుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని, వాట వివరాలను బహిర్గతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

ఎంపీ శ్రీభరత్ దంపతులతో ముక్కా శ్రావణి
వైజాగ్ ఓటర్లలో ఎందుకీ నిర్లిప్తత?
బీసీ మహిళకు రిజర్వు అయిన జీవీఎంసీ మేయర్ పదవి కోసం ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే కూటమి అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మధ్యే పోటీ నెలకొంది. కూటమి తరఫున టీడీపీకి చెందిన ముక్కా శ్రావణి, వైఎస్సార్‌సీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ వరుదు కల్యాణి బరిలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లలో నిర్లప్తత పెరగడానికి గల కారణాలను తలోరకంగా చర్చించుకుంటున్నారు. గత 2021 ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్సార్‌సీపీ అత్యధికంగా 58, టీడీపీ 30 సీట్లను గెలుచుకున్నాయ. దీంతో అధిక సీట్లను సాధించిన వైఎస్సార్‌సీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ మేయర్ పీఠాన్ని తన్నుకుపోవాలని కుయుక్తులు పన్నింది. దీంతో మేయర్ హరి వెంకట కుమారిని గద్దె దించేలా ఆ పార్టీ కార్పొరేటర్లకు వల వేసి విజయం సాధించింది. అనంతరం టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావును మేయర్ పదవిలో కూర్చోబెట్టింది. కేవలం ఏడాది కాలానికే వైఎస్సార్సీపీ మేయర్‌ను దించేసి టీడీపీ కార్పొరేటర్కు కట్టబెట్టడాన్ని విశాఖ వాసులు అనైతిక చర్యగా చర్చించుకున్నారు. మరోవైపు గత కొన్నేళ్లుగా విశాఖలో జరుగుతున్న పరిణామాలను బట్టి మేయర్ తో పాటు కార్పొరేటర్లు ప్రజా శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారంకంటే తమ స్వలాభానికి, అక్రమార్జనకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారన్న భావన వీరిలో వేళ్లూనుకుంది. పైగా ఇప్పుడు గెలిపించిన కార్పొరేటర్లు తమ స్వార్థానికి మరొక పార్టీలోకి జంప్ చేస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. వీటన్నిటినీ దృష్టలో ఉంచుకునే ఈసార జీవీఎంసీ ఎన్నికల్లో దాదాపు సగం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదన్న ప్రచారం మేధావి వర్గం నుంచి వినిపిస్తోంది.
నువ్వా .. నేనా? అన్నట్టుగా పోటీ..
ఇక ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణిల మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది. వాస్తవానికి విశాఖపట్నం టీడీపీకి ఎప్పట్నుంచో కంచుకోట. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకే ఎక్కువ సీట్లు దక్కడం రివాజుగా వస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదే పంథాను కొనసాగించింది. తొలుత ఈసారి జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికే విజయావకాశాలున్న ఎక్కువగా ఉన్నాయని భావించారు. క్రమంగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ముక్కా శ్రావణికి కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ శ్రేణులు కార్పొరేటర్ సీట్ల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్నారు. అలాంటి వారు శ్రావణికి బహిరంగంగా మద్దతునివ్వలేదన్న ప్రచారం ఉంది. అంతేకాదు.. శ్రావణి విశాఖ ఎంపీ, నారా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ ప్రతిపాదించిన అభ్యర్థి అన్న వాదన ఉంది. శ్రావణికి మద్దతుగా శ్రీభరత్ సతీమణి, సినీనటుడు బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నిక ప్రచారం చేశారు కూడా. ఇప్పటికే టీడీపీలో భరత్‌తో కొంతమందికి పొసగడం లేదు. అలాంటి వారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణికి లోపాయకారీగా మద్దతు పలికారని చెప్పుకుంటున్నారు.

మరోవైపు వరుదు కల్యాణి వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఎమ్మెల్సీగా ఆమె తమ పార్టీ తరఫున శాసన మండలిలో గళం విప్పుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెపై చెప్పుకోదగిన ఆరోపణలు కూడా లేవు. ఇలావుండగా పార్టీలతో పనిలేకుండా కల్యాణిని మేయర్‌గా గెలిపించాలని ఆమె సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ విషయంలో తమకు నచ్చిన పార్టీ అభ్యర్థికి ఓటేసి, మేయర్ ఓటు మాత్రం కల్యాణికే వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే వరుదు కల్యాణికి కాస్త కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక కూటమి అభ్యర్థి శ్రావణి విషయంలోనూ నగరానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే తమ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవి కోసం కూటమి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్టయింది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే కల్యాణికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది. మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుతో జీవీఎంసీ మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో తేలిపోతుంది.
Next Story