బీహార్: సీఎం నితీష్ రాజీనామాకు ముందు క్యాబినెట్ రద్దు..
x

బీహార్: సీఎం నితీష్ రాజీనామాకు ముందు క్యాబినెట్ రద్దు..

బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం


Click the Play button to hear this message in audio format

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేందుకు ముందుగా మంత్రివర్గాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అత హస్నైన్‌ను కలిసే ముందే తన క్యాబినెట్‌కు ఈ సమాచారం అందించారు.

కాగా ‘‘ముఖ్యమంత్రి నితీష్ ఈ రోజు సాయంత్రం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. రాజీనామా సమర్పించే ముందు మంత్రివర్గాన్ని రద్దు చేయడం అవసరమని నితీష్ తన సహచరులకు చెప్పారు. రాజ్యాంగపరంగా తప్పనిసరి ప్రక్రియలో భాగంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా, ఇది మా అందరికీ భావోద్వేగ క్షణం. ” అని మంత్రి రామ్ కృపాల్ యాదవ్ పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం యాదవ్ మీడియాతో మాట్లాడారు.

బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం చేసేందుకు నితీష్ మధ్యాహ్నం 3 గంటలలోపు గవర్నర్‌ను కలసి రాజీనామా సమర్పించనున్నారని ఒక పార్టీ నాయకుడు తెలిపారు.

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సభ్యులున్నారు. వీరిలో 89 మంది బీజేపీ నుంచి గెలుపొందిన వారే. అధిక నియోజకవర్గాలు గెలుపొందిన కాషాయ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష నాయకుడి ఎన్నికకు వీరంతా సమావేశం కానున్నారు. మొత్తంగా నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం బీహార్ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీసింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.

Read More
Next Story