మేకెదాటు ప్రాజెక్ట్‌కుపై కేంద్రానికి డీపీఆర్ సమర్పించనున్న కర్ణాటక..
x

మేకెదాటు ప్రాజెక్ట్‌కుపై కేంద్రానికి డీపీఆర్ సమర్పించనున్న కర్ణాటక..

కావేరి నదిపై కనకపుర సమీపంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌కు తమిళనాడు ఎందుకు అడ్డు చెబుతుంది?


Click the Play button to hear this message in audio format

కర్ణాటకలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మేకెదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలో కేంద్ర జల సంఘానికి సమర్పిస్తామని ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తెలిపారు. మేకెదాటు ప్రాజెక్టును అడ్డుకునే హక్కు తమిళనాడుకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ కారణంగా మునిగిపోయే అటవీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా అటవీకరణ కోసం భూములను గుర్తిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చిన వెంటనే భూమిపూజ నిర్వహిస్తామని వెల్లడించారు.

కావేరి నదిపై కనకపుర సమీపంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా బెంగళూరుకు తాగునీరు అందించడానికేనని కర్ణాటక చెబుతోంది. తమిళనాడుకు కేటాయించిన 177 టీఎంసీల వాటాను తగ్గించబోమని డీపీఆర్‌లో హామీ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టుకు తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించవద్దని పీఎంకే నేత అన్భుమణి రామదాసు డిమాండ్ చేశారు. తమిళనాడు అనుమతి లేకుండా 2018లో ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కూడా ఆయన కోరారు.

Read More
Next Story