పేకాటకు డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉందా?
x

పేకాటకు డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉందా?

ఏపీ రాజకీయాల్లో కాకరాజేసిన బ్రిడ్జి గేం. అసలు ఈ గేమ్ జూదమా? లేక మేథోపరమైన క్రీడా? వీడియో స్టోరీ.


బ్రిడ్జ్ గేమ్ ఏపీ రాజకీయాల్లో కాక రగిల్చింది. డీఎస్సీ పరీక్షలో 40వ ప్రశ్నగా వచ్చిన ఈ అంశం ఇప్పుడు రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశం చుట్టూ ఆందోళనలు, అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. దీనిని అస్తంగా మార్చుకున్న వైసీపీ న్యాయ పోరాటానికి ఏకంగా ఓ కమిటినీ ఏర్పాటు చేస్తూ గురువారం ప్రకటన జారీ చేసింది.

బ్రిడ్జ్ అంటే పేకాట కదా.. పేకాట ఆడేవారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తారా?" అని సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనివల్ల నిరుద్యోగుల్లో, అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

బ్రిడ్జి గేమ్ vs పేకాట

బ్రిడ్జి గేమ్ ను చాలా మంది సాధారణ పేకాటతో పోలుస్తుంటారు. కానీ ఈ రెండింటి మధ్య తేడా ఉంది. బ్రిడ్జి గేమ్ అంటే ఇది ఒలింపిక్ కౌన్సిల్ గుర్తింపు పొందిన మైండ్ స్పోర్ట్ అంటే మేతో క్రీడగా గుర్తింపు ఉంది. అదృష్టం కంటే విశ్లేషణ, జ్నాపకశక్త, భాగస్వామితో సమన్వయం, వ్యూహ రచన ప్రధానంగా ప్రపంచంలో దీనికి అధికారిక టోర్నెమెంట్లు నిర్వహిస్తున్నారు.
పేకాట అనేది పూర్తిగా అదృష్టంపై ఆధారపడడమే కాకుండా, పేక ముక్కలను సమయస్ఫూర్తిగా డిస్కార్ట్ చేయాలి. లేదంటే ఆర్థిక నష్టం తప్పదు. అంటే డబ్బు పందెంగా కాసి ఆడే జూదం. కాబట్టే.. బ్రిడ్జి గేమ్ ను స్కిల్ గేమ్ గా పేకాటను గ్యాంబ్లింగా పరిగణిస్తున్నారు. ఇదిలా ఉంటే..
"పేకాటలో ఫస్ట్ వచ్చినా, డీఎస్సీలో క్రీడా కోటా కింద ఉద్యోగం ఇచ్చారు" అని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో వివాదం తెరపైకి వచ్చింది. వైసీపీ ఈ అంశాన్ని ప్రభుత్వం మీద దాడికి ఆయుధంగా మార్చుకుంది. ఇది కాస్తా వైసీపీ వర్సస్ టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
బ్రిడ్జి గేమ్‌ను 'క్రీడ'గా పరిగణించాలా? అనేది ప్రశ్న. ఇది పాఠ్యాంశాల్లో అంత ప్రాధాన్యత లేని అంశం. ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల సమయం వృథా కావడంతో పాటు మార్కుల విషయంలో అన్యాయం జరుగుతుందనేది అభ్యర్థుల వాదన. ఇదే అంశంపై డీఎస్సీ అభ్యర్థులు ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ ను కలిశారు. డీఎస్సీ పరీక్ష విధానంలో ఉన్న లోపాలు ఎత్తిచూపాలని అభ్యర్థులు జగన్ ను కోరారు. దీనిపై న్యాయపోరాటానికి వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్. జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలతో పాటు న్యాయవాదులతో అభ్యర్థుల పక్షాన పోరాటానికి కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
"బ్రిడ్జి గేమ్, పేకాటకు ఉన్న తేడా ఏమిటో పేర్ని నానీకి తెలుసా? ఆ గేమ్ వెనుక ఉన్న నిర్వచనం కూడా ఏమిటో తెలియని మాజీ మంత్రి నానా యువకులను రెచ్చగొట్టాలని ప్రయత్రిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(ఈ వీడియోలో వివరాలు చూడండి )



Read More
Next Story