తుఫాన్ ప్రతీకాత్మక చిత్రం (ఫైల్)
ఒంగోలు వైపు గురిపెట్టిన `మురాసు` తుఫాన్!
మురాసు తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు వైపు వడివడిగా పయనిస్తోంది. ఈ అర్థరాత్రి తర్వాత ఒంగోలుకు దక్షిణంగా తీరాన్ని దాటనుంది.
మురాసు తుఫాన్! మూడు రోజుల క్రితం అండమాన్ సముద్రంలో అల్పపీడనంగా ఏర్పడినప్పుడు వాయుగుండం వరకే పరిమితమనుకున్న ఈ వ్యవస్థ క్రమంగా తుఫాన్ గాను, ఆపై తీవ్ర తుఫాన్ గాను బలపడింది. నిన్న గాక మొన్న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలను వణికించిన అర్నాబ్ అతి తీవ్ర తుఫాన్ అంతటి తీవ్రత ఈ మురాసుకు లేకపోయినా భారీ వర్షాలు, ఈదురు గాలులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒంగోలు తీరాన్ని లక్ష్యంగా చేసుకుని అటువైపు మురాసు తుఫాన్ దూసుకు వస్తోంది. సోమవారం అర్థరాత్రి దాటాక ఒంగోలు సమీపంలోనే తీరాన్ని దాటనుంది. మురాసు ప్రస్తుతం ఎక్కడ ఉంది? దాని తీవ్రత ఎలా ఉంటుందంటే?
మురాసు గమనాన్ని తెలిపే చిత్రం
మురాసు తీవ్ర తుఫాన్ ఎక్కడుంది?
మురాసు తీవ్ర తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. సోమవారం సాయంత్రానికి నెల్లూరుకు తూర్పున 90 కి.మీలు, కావలికి ఆగ్నేయంగా 100 కి.మీలు, తిరుపతికి ఈశాన్యంగా 160, ఒంగోలుకు ఆగ్నేయంగా 140, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 170 కి.మీల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ సోమవారం మధ్యాహ్నం వరకు చాలా వేగంగా అంటే.. గంటకు 20-25 కి.మీల వేగంతో పయనించింది. మధ్యాహ్నం తర్వాత తన వేగాన్ని సగానికి సగం తగ్గించుకుంది. గడచిన రెండు మూడు గంటలుగా మురాసు వేగం 10-12 కి.మీల వేగానికే పరిమితమైంది. తొలుత వేగాన్ని బట్టి అది అలాగే కొనసాగితే సోమవారం అర్థరాత్రికంటే ముందే తారాన్ని దాటుతుందని అనుకున్నారు. కానీ వేగాన్ని తగ్గించుకోవడంతో ముందుగా ఐఎండీ అంచనా వేసిన విధంగానే ఈ అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు అతి తీవ్ర తుఫాన్‌గానే తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగనుంది.
భారీ ఈదురుగాలులు.. కుంభవృష్టి..
ఈ మురాసు తీవ్ర తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇది వరకే వెల్లడించింది. అందుకనుగుణంగా ఆ దిశలోనే మురాసు పయనిస్తోంది. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110, గరిష్టంగా 120 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అదే సమయంలో సోమవారం సాయంత్రం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, వైఎస్సార్ కడపప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇంకా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లా్లో్ల అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మంగళవారం కూడా ఆయా జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
ఎగసి పడనున్న అలలు..
తుఫాన్ తీరానికి సమీపించే సమయంతో పాటు తీరాన్ని దాటే వేళ సముద్ర కెరటాల ఉధృతి పెరగనుంది. ఈ అలలు 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తుకు ఎగసిపడనున్నాయి. వీటి ఫలితంగా దక్షిణ కోస్తాంధ్రలోని పల్లపు తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడతాయని, పాతబడిన ఇళ్లు, కట్టడాలు కూలిపోయే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. అలాగే రోడ్లపైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగిస్తుందని, చెరువు గట్లు కొట్టుకు పోవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకనుగుణంగానే చర్యలు చేపట్టింది. ప్రాణనష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

Next Story