పెనుగాలులకు విశాఖ అల్లిపురంలో కూలిన చెట్టు
ఉత్తర కోస్తాను అతలాకుతలం చేస్తున్నఆర్నాబ్ తుఫాన్!
ఆర్నాబ్ తుపాను ఉత్తర కోస్తాను వణికిస్తోంది. మంగళవారం ఉదయం వరకు సాదాసీదాగా ఉన్న ఈ తుఫాన్ సాయంత్రానికి ఉధృత రూపం దాల్చింది.
ఆర్నాబ్ తుఫాన్ అనుకున్నంతా చేస్తోంది. ఉత్తర కోస్తాను చిగురుటాకులా వణికిస్తోంది. తుఫాన్, తీవ్రత తుఫాన్, అతి తీవ్ర తుఫాన్‌గా బలపడుతూ వచ్చింది. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం గడగడలాడించిన హుద్‌హుద్ తుఫాన్‌ను మళ్లీ గుర్తుకు తెస్తోంది. అంతటి విపత్తును పునరావృతం చేస్తుందేమో? అన్నంతగా భయపెడుతోంది. జోరువాన, పెను గాలులు కూడబలుక్కుని బీభత్సం సృష్టిస్తుండడంతో మరో 24 గంటలు ఎలా గడుస్తుందోనని ఈ ప్రాంత ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
విశాఖ ఆర్కే బీచ్‌లో స్టాల్స్‌లోకి చొచ్చుకు వస్తున్న కెరటాలు
హుద్‌హుద్, తిత్లీలను తలపిస్తుందా?
దాదాపు వారం రోజుల నుంచి ఆర్నాబ్ తుఫాన్ తీవ్రత గురించి భారత వాతావరణ శాఖతో పాటు ఇతర దేశాల ప్రఖ్యాత వాతావరణ సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ ఆర్నాబ్ ప్రతాపం చూపిస్తుందని ముందస్తు అంచనాలూ వేశాయి. 2014లో వచ్చిన హుద్‌హుద్, 2018 నాటి తిత్లీ తుఫాన్లకు తీసిపోకుండా ఆర్నాబ్ అలజడి సృష్టిస్తుందని చెబుతూ వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఈ ఆర్నాబ్ తన సత్తా ఏపాటిదో మంగళవారం ఉదయం నుంచి చూపడం మొదలెట్టింది. ఆర్నాబ్ తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతోనే తన ఉధృతిని పెంచింది. గడచిన నాలుగైదు రోజుల నుంచి సముద్రంలో గంటకు 6-10 కి.మీల వేగంతో పయనించిన ఈ ఆర్నాబ్ మంగళవారం ఉదయం నుంచి తన వేగాన్ని తీవ్రతరం చేసింది. మంగళవారం సాయంత్రానికి ఆ వేగం 20 కి.మీలకు పెరిగింది. దీంతో ఈ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకువస్తోంది.

కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో ముందుకు వచ్చిన సముద్రం
ఉత్తర కోస్తాపై ప్రతాపం ఇలా..
ఆర్నాబ్ తీవ్ర తుఫాన్ మంగళవారం ఉదయం వరకు సాదాసీదాగానే ఉంది. ఆ తర్వాత నుంచి అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో తొలుత తేలికపాటి జల్లులతో మొదలై క్రమంగా భారీ వర్షం కురవడం ఆరంభమైంది. ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. కొన్ని చోట్ల కుంభవృష్టి కురుస్తోంది. వర్షానికి పెనుగాలులు కూడా తోడయ్యాయి. అర్నాబ్ ధాటికి ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఉదయం గంటకు 30-40 కి.మీలకే పరిమితమైన గాలుల వేగం మధ్యాహ్నానికి 60-70కి, సాయంత్రానికి 80-90 కి.మీలకు పెరిగింది. దీంతో ఆయా జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పూరి గుడిసెలు, పురాతన ఇళ్లు, ఇతర కట్టడాలు నేల కూలుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగి పడుతున్నాయి. దీంతో ఉత్తర కోస్తాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకుండా పోయి అంధకారం అలముకుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించే పనులు చేపడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో చేతికంది వస్తున్న వరి పంటలు నేల వాలి నీట మునుగుతున్నాయి. రోడ్లపై పడిన చెట్లను ఎస్‌డీఆర్ ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. తీరాన్ని దాటకముందే బీభత్సం సృష్టిస్తున్న ఆర్నాబ్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఇంకెంత ముప్పును తెచ్చిపెడుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

కాకినాడ జిల్లా ఉప్పాడలో ఇళ్లలోకి వచ్చిన సముద్రపు నీరు
చొచ్చుకు వస్తున్న సముద్రం..
ఆర్నాబ్ తుఫాన్ ఉధృతితో సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, ఉప్పాడ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. విశాఖలో బీచ్ రోడ్డు వరకు కెరటాలు దూసుకు వస్తుదన్నాయి. దీంతో బీచ్‌లో ఉన్న చిన్నచిన్న దుకాణాలు, వాటి సామగ్రి కొట్టుకు పోతున్నాయి. అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు నీరు సమీపంలోని రోడ్డుపైకి చేరి ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. భయాందోళనకు గురై తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇంకా కాకినాడ రూరల్ పరిధిలోని ఎన్గీఆర్ బీచ్ వద్ద సముద్రం బాగా ముందుకు వచ్చింది. ఇంకా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

గాజువాక షీలానగర్ రోడ్డుపై కూలిన చెట్టు
తుఫాన్ ధాటికి 60 పైగా రైళ్లు రద్దు..
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని అనేక రైళ్లను ముందు జాగ్రత్త చర్యగా అధికారులు రద్దు చేశారు. ఈ జోన్ పరిధిలో 60కి పైగా ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 15 సర్వీసులను రీ షెడ్యూల్ చేశారు. దీంతో వివిధ ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలకు వెళ్లే అనేక మంది ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆర్నాబ్ ముందుగానే తీరాన్ని దాటుతుందా?
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆర్నాబ్ తుఫాన్ కాకినాడకు సమీపంలోని యానాం వద్ద తీరాన్ని దాటుతుంది. తొలుత ఈ తుఫాన్ బుధవారం తెల్లవారుజామున యానాం సమీపంలో తీరాన్ని దాటుతుందని అంచనా కట్టింది. అయితే మంగళవారం మధ్యాహ్నం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించాక ఈ ఆర్నాబ్ తుఫాన్ తన వేగాన్ని పెంచుకుంది. అప్పటిదాకా గంటకు 10 కి.మీల వేగాన్ని మించని ఆర్నాబ్ ఒక్కసారిగా 20 కి.మీలకు పెరిగింది. దీంతో ఈ తుఫాన్ అనుకున్న సమయంకంటే ముందుగానే తీరాన్ని చేరుకోనుంది. తాజాగా వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఆర్నాబ్ తుఫాన్ మంగళవారం అర్థరాత్రి దాటాక తీరాన్ని దాటుతుందని చెబుతున్నారు.

Next Story