అన్నామలై రాజీనామా..
x

అన్నామలై రాజీనామా..

తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ఐదు పేజీల నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పించిన బీజేపీ స్టేట్ మాజీ చీఫ్..


Click the Play button to hear this message in audio format

అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ఐదు పేజీల నివేదికను కూడా పార్టీ అధిష్ఠానానికి అందజేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామం వెనుక కేవలం రాజీనామా మాత్రమే కాకుండా, పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని, వచ్చే ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఈ మధ్యకాలంలో అన్నామలైకి, కేంద్ర నాయకత్వానికి మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాల వినికిడి. ముఖ్యంగా ఏఐఏడీఎంకేతో పొత్తు పునరుద్ధరణ, ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే బాగుంటుందని అధిష్టానానికి చెప్పారట. అయితే జాతీయ నాయకత్వం మాత్రం డీఎంకే వ్యతిరేక కూటమికి ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.

అన్నామలై బీజేపీకి అధికారికంగా వీడ్కోలు పలికిన తర్వాత, ఇతర పార్టీల ప్రముఖులు ఆయనతో చేతులు కలిపే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. అయితే రాజకీయ పార్టీకి ముందు ఒక సామాజిక సంస్థను ప్రారంభించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, బీజేపీలో వేగంగా ఎదిగిన నాయకుడి అన్నామలై తదుపరి అడుగులు.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా? లేక ఇది కేవలం రాజకీయ ఊహాగానే మిగిలిపోతుందా? అన్న ప్రశ్నలకు రానున్న నెలల్లో సమాధానం లభిస్తుంది.

Read More
Next Story