పాక్-బంగ్లా సరిహద్దుల్లో ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్ట్
x

పాక్-బంగ్లా సరిహద్దుల్లో ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్ట్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి


Click the Play button to hear this message in audio format

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ వెంట 6వేల కిలోమీటర్ల దూరం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్యఉద్దేశ్యమన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీట్‌లో షా మాట్లాడారు. డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాల సాయంతో చొరబాట్లను గుర్తించి వెంటనే అడ్డుకునే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించామని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చొరబాట్లను పూర్తిగా నిరోధించే విధానాన్ని అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి జనాభా గణన మిషన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని అమిత్ షా వెల్లడించారు.

Read More
Next Story