x

అలిపిరి బైపాస్.. వీఐపీలు వస్తేనే సాఫీ ప్రయాణం..?!

తిరుపతిలో ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయంపై వీడియో కథనం.


తిరుపతిలో కీలకమైన మార్గం అలిపిరి బైపాస్ రోడ్డు. తిరుమలకు వెళ్లే బస్సులు వాహనాలే కాదు. బెంగళూరు, మదనపల్లె, చిత్తూరు వేళ్లే వాహనాలకు కూడా ఇది ప్రధాన మార్గం. తిరుమలకు ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు మాత్రమే ట్రాఫిక్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మార్గంలో రోడ్డు ప్రశాంతంగా, ట్రాఫిక్ లేకుండా సాఫీగా కనిపిస్తుంది. మిగతా రోజుల్లో ప్రయివేటు వాహనాలతో ఇక్కట్లు తప్పవు. న్నారు.

అస్తవ్యస్త పార్కింగ్‌

కపిలతీర్థం సర్కిల్ నుంచి అలిపిరి వరకు ఉన్న మార్గంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా హోమ్ స్టేలు, హోటళ్లు, లాడ్జిలు వెలిసాయి. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వాహనాలను రోడ్డు పక్కనే పార్క్ చేస్తుండటంతో రహదారి ఇరుకుగా మారుతోంది. దీనిని క్రమబద్ధీకరించడంలో స్పష్టమైన లోపం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సమన్వయంతో సాధ్యమే..

తిరుపతి నగరంలో సులభతరమైన రవాణా వ్యవస్థ కోసం మున్సిపల్ కార్పొరేషన్, తుడా (TUDA), టీటీడీ (TTD), ట్రాఫిక్ విభాగం మరియు రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. ఈ శాఖల భాగస్వామ్యంతో ఏర్పడిన 'హై పవర్ కమిటీ' కేవలం సమావేశాలు, నిర్ణయాలకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఏమాత్రం మార్పు తీసుకురాలేకపోతోంది. నగరంలో పెరుగుతున్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలకు నిర్దిష్టమైన స్టాండ్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర తాత్సారం జరుగుతోంది.

భారం తగ్గించేందుకు పరిష్కారాలు

క్షేత్రస్థాయిలో కేవలం పోలీసు బలగాలపైనే ట్రాఫిక్ నియంత్రణ భారాన్ని వేయకుండా, సాంకేతికత మరియు అంతర్-శాఖల సమన్వయంతో పరిష్కారాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పార్కింగ్ సదుపాయం తప్పనిసరి: అలిపిరి మార్గంలో ఉన్న హోటళ్లు, హోమ్‌స్టేలు తమ వినియోగదారుల వాహనాల కోసం కచ్చితంగా సొంత పార్కింగ్ స్థలాలను కేటాయించేలా మున్సిపల్, తుడా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలి. రోడ్డుపై పార్కింగ్ చేసే వాహనాలపై భారీ జరిమానాలు విధించాలి.

ట్యాక్సీ స్టాండ్ల ఏర్పాటు: కపిలతీర్థం - అలిపిరి మధ్య ప్రధాన పాయింట్లను గుర్తించి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలకు నిర్దిష్టమైన 'పిక్-అప్ & డ్రాప్' జోన్లను (Stands) తక్షణమే ఏర్పాటు చేయాలి.

ట్రాఫిక్ నిఘాకు సాంకేతికత: రద్దీ ప్రాంతాల్లో 'స్మార్ట్ ఐటిఎస్' (Intelligent Traffic System) సిసి కెమెరాల ద్వారా ఆటోమేటిక్ చలానాలు విధించడం వల్ల రోడ్డుపై నిరంతరం పోలీసులను ఉంచాల్సిన అవసరం తగ్గుతుంది.

మల్టీ-లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు: అలిపిరి సమీపంలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి టీటీడీ మరియు మున్సిపల్ శాఖలు ఉమ్మడిగా భారీ మల్టీ-లెవెల్ పార్కింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలి.

జాయింట్ టాస్క్ ఫోర్స్: కేవలం ట్రాఫిక్ పోలీసులే కాకుండా మున్సిపల్, రవాణా శాఖల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రోడ్డు ఆక్రమణలను నిరంతరం తొలగించాలి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు కేవలం వీఐపీ ప్రోటోకాల్ సమయాల్లోనే కాకుండా, సాధారణ రోజుల్లోనూ స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

Read More
Next Story