x

తిరుమల బ్రహ్మోత్సవేళ మదిని తడిమే సంఘటన..

ఏడాది తరవాత భర్త చేరువ.. కాపాడిన తిరుమల పోలీసులు!


బ్రహ్మోత్సవాల వేళ పోలీసుల అప్రమత్తత

తిరుమలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని గుర్తించిన క్రైమ్ పోలీసులు.

సుమారు ఏడాదిగా కనిపించకుండా పోయిన వ్యక్తిగా గుర్తింపు

తమిళనాడులో నమోదైన మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ.

తమిళనాడు పోలీసులతో సమన్వయం.. కుటుంబ సభ్యులకు సమాచారం.

సురక్షితంగా భార్యకు అప్పగించిన తిరుపతి క్రైమ్ పోలీసులు.

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓ ఉద్వేగ సంఘటన వెలుగు చూసింది. ఏడాది కిందట తమిళనాడులోని ఇంటి నుంచి వచ్చేసిన వ్యక్తిని, ఆంధ్రా పోలీసులు తిరిగి అతని భార్యకు అప్పగించారు. ఈ సమయంలో తమిళనాడు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఆసక్తికరమై సంఘటన వివరాల్లోకి వెళితే..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు అనుమానితులపై దృష్టి పెట్టారు. తిరుమలలో గస్తీలో ఉన్నక్రైం పోలీసు సిబ్బంది ఓ వ్యక్తిని అనుమానించారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మరింత సమాచారం కోసం తిరుపతి క్రైమ్ పోలీసులకు అప్పగించారు.
ఓ విషాధ గాథ..
తిరుమలలో అదుపులోకి తీసుకున్న తిరుపతి క్రైం పోలీసులు ఆ తమిళనాడు వ్యక్తిని విచారణ చేశారు. అతని విషాథ గాధ విని, తమిళనాడు పోలీసులతో సంప్రదించారు. ఏడాది కిందట మిస్సింగ్ కేసు నమోదైన విషయాన్ని నిర్ధారించారు. దీంతో తిరుపతి క్రైం సీఐ శివకుమార్ రెడ్డి, సిబ్బంది స్పందించారు.
విచారణ లో ఆ వ్యక్తి తమిళనాడుకు చెందినవాడని గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో 2025 నవంబర్‌లో భార్య జవార్ల, పిల్లలకు చెప్పకుండా, ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలుసుకున్నారు. ఇంటి నుంచి వచ్చేిసిన తరువాత చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్‌లో కూలీ పనులతో జీవించానని ఆ వ్యక్తి వివరించారు.

తమిళనాడులో మిస్సింగ్ కేసు..

తిరుమలలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇచ్చిన సమాచారం నిర్ఢారించుకోవవడానికి తిరుపతి పోలీసులు ప్రయత్నించారు. అడయార్ సమీపంలోని నీలంకరై పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు. ఆ కేసు దర్యాప్తులో ఉందని కూడా తమిళనాడు పోలీసు అధికారులు స్పష్టంచేశారు.

భార్యకు సమాచారం...

తిరుపతి క్రైమ్ పోలీసులు వెంటనే తమిళనాడు పోలీసు అధికారులకు, అతని భార్య జవార్లకు సమాచారం అందించారు. పోలీసుల అప్రమత్తత, సమన్వయం మరియు సత్వర చర్యలతో సుమారు ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన వ్యక్తిని గుర్తించగలిగారు. ఈ నెల 17 వ తేదీ జవార్ల, తమిళనాడు పోలీసు సిబ్బంది తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ రాష్ట్ర పోలీసు అధికారుల సూచనల మేరకు ఆ వ్యక్తిని సురక్షితంగా అతని భార్య సవర్లకు అప్పగించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆ వ్యక్తి రావడం వల్ల పోలీసులకు పట్టుబట్టాడు. సంవత్సరం నుంచి కనిపించని భర్త కోసం గాలిస్తున్న కుటుంబానికి ఊరట దక్కింది. తన భర్తను తిరిగి అప్పగించిన పోలీసులకు తమిళనాడుకు చెందిన ఆ వ్యక్తి భార్య జవార్ల కృతజ్ణతలు తెలిపారు.
Read More
Next Story