Kadapa | మైదుకూరు మున్సిపల్ టీడీపీ అభ్యర్థి ఎందుకు కన్నీరు పెట్టారు..
మున్సిపల్ ఎన్నికలు నిలిపి వేతతో టీడీపీ కూటమికి ఎదురుదెబ్బ. వీడియోల కథనాలు..
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి చేదు గుళిక మింగక తప్పలేదు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నామినేషన్లను ధ్వంసం చేయడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీంతో కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. కడప జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఎన్నికల ప్రక్రియ ఆగుతుందని ప్రకటించారు.
మైదుకూరు టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ధనపాల జగన్ కన్నీటి పర్యంత అయ్యారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఉదయం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు నామినేషన్ల దాఖలు చేసే ప్రక్రియ జరిగింది. మైదుకూరు మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఉద్రిక్తలు రాజ్యమేలాయి. అనేక వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు చించి వేయడం, నామినేషన్ దాఖలు చేసే కేంద్రాల వద్ద దాడులకు పాల్పడిన సంఘటనలతో ఉద్రిక్తం ఏర్పడింది. స్వచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే వాతావరణం లేకపోవడం వల్ల పరిస్థితి చేయిదాటింది.
"మైదుకూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు చించి వేశారు" అని వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కడప జిల్లా వైసీపీ నేతల ఫిర్యాదు, పోలీసు అధికారుల నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చు చెరుకూరి అందించిన నివేదిక ఆధారంగా మైదుకూరు మున్నిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తే, ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై మైదుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శెట్టి పల్లి రఘురామిరెడ్డి స్పందించారు.
"నాయకులు జనం నుంచి రావాలి. రాష్ర్ట ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి ఐరి పోయడమే" అని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అభివర్ణించారు. ఈ ఘటనల నివారణలో ఎన్నికల యంత్రాంగం వ్యవహరించిన తీరుపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మైదుకూరు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ధనపాల జగన్ కన్నీటిపర్యంతం అయ్యారు.
ఎందకనేది ఈ వీడియోలో చూడండి
Next Story

