మరో.. దేవలోకం..! అలిపిరి ముఖచిత్రం ఇదీ...!!
x
సెల్ఫీ పాయింగ్ మారిన అలిపిరి గరుడ సర్కిల్

మరో.. దేవలోకం..! అలిపిరి ముఖచిత్రం ఇదీ...!!

శ్రీవారి బ్రహ్మోత్సవ వేళ కనువిందుగా మారిన అలంకరణల దృశ్యాలు.


Click the Play button to hear this message in audio format

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల కు వెళ్లడానికి ముఖద్వారంగా ఉన్న అలిపిరి గరుడ సర్కిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదేశాన్ని మరో దేవలోకంగా రూపుదిద్దారు. ఈ సంవత్సరం మొదటిసారి అలిపిరి గరుడ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఇది ఒక సెల్ఫీ పాయింట్ గా మారింది.

అలిపిరి ముద్ద భారీ గరుత్మంతుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి రెండు పక్కల భారీ ఏనుగుల బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గరుడ సర్కిల్ కు చుట్టూ అందమైన పూల మొక్కలు, నమూనా మొక్కలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాల వెలుగుల్లో ఇవి కాంతులు విరజిమ్ముతున్నాయి.

టీటీడీ గార్డెన్ విభాగం ఇక్కడ చేసిన ఏర్పాట్లు ఆదివారం సాయంత్రం నుంచి కనువిందు చేస్తున్నాయి. తిరుమలకు వెళ్లే యాత్రకులే కాదు తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన యాత్రికులు కూడా ఈ కూడలి వద్ద పాదాలు ఆగిపోతున్నాయి. తిరుపతి స్థానికులు కూడా భారీ సంఖ్యలో ఈ ప్రదేశానికి చేరుకొని సెల్ఫీలు దిగడానికి అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు.


అలిపిరి సమీపంలోని ఏ గరుడ విగ్రహం వద్ద చేసిన ఏర్పాట్లు మరో దేవలోకాన్ని తలపించే విధంగానే మారింది. శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గరుడ పక్షి వాహనం. శ్రీవారి ఉబయదేవేరుల వాహనమైన ఏనుగులను ఈ విగ్రహం పక్కన ఏర్పాటు చేసి అలంకరించిన తీరు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.


కనువిందు చేస్తున్న ఈ ప్రదేశంలో యాత్రికులే కాదు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు కూడా ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించే విధంగా టీటీడీ గార్డెన్ విభాగం ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Read More
Next Story