అనంతపురం జిల్లా పామిడి ఆదివారం వేకువజామున ఉలిక్కిపడింది. జాతీయ రహదారి 44పై ప్రయివేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఆర్తనాదాలు మిన్నంటాయి. 40 మంది ప్రయాణిస్తున్న ఆ ప్రయివేటు బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న నవంబర్ ట్రావెల్స్ ప్రయివేటు బస్సును ఐచర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ప్రయివేటు బస్సు, ఐచర్ వాహనం డ్రైవర్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
"హైదరాబాద్ నుంచి నుంచి బయలుదేరిన బస్సులో 22 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు" అని పామిడి సీఐ శంకరనాయక్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడం వల్ల ప్రాణనష్టానికి ఆస్కారం లేకుండా కాపాడామని శంకర్ నాయక్ చెప్పారు.
కర్నూలు సమీపంలోని
చిన్న టేకూరుపేట,
మార్కాపురం సమీపంలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన విషాధ ఘటనలు దేశంలో చర్యకు తెరతీశాయి. దీంతో ఇటీవల కొన్ని నెలలుగా జాతీయ రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పోలీస్, రవాణా శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. ఊహించని విధంగా జాతీయ రహదారి 44 పై జరిగిన ఈ ప్రమాదంతో మరోసారి ఉలిక్కి పడ్డారు. వేగనియంత్రణ అనే అంశం తెరపైకి వచ్చింది.
బ్రిడ్జీ పైనుంచి బోల్తా..
పామిడి మండల కేంద్రానికి సమీపంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఆదివారం వేకువజామున ప్రమాదానికి గురయింది. బ్రిడ్జీపై నుంచి బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో 40 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సును ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రయివేటు బస్సుతో సహా రెండు వాహనాలు సుమారు. 20 అడుగుల ఎత్తు నుంచి కాలువలో పడిపోయాయి. ఈ సంఘటన ఆదివారం వేకువజామున జాతీయ రహదారి 44పై జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలివి.
"ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే పామిడి ఆస్పత్రికి తరలించాం. చికిత్స చేయించాం. వారిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ అనంతపురంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించాం" అని పామిడి సీఐ శంకరనాయక్వి వివరించారు. గాయపడిన వారికి ప్రభుత్వ వైద్యులు మెరుగైన చికత్స అందిస్తున్నారనీ ఆయన చెప్పారు.
హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి నవంబర్ ట్రావెల్స్ ప్రయివేటు ఓల్వో బస్సు బెంగళూరుకు బయలుదేరింది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. గుత్తి దాటిన తరువాత పామిడి మండల కేంద్రానికి సమీపంలో ఆదివారం వేకువజామున ఈ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది.
ఐచర్ వాహనంతో ప్రమాదం
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ప్రయివేటు ట్రావెల్స్ బస్సును ఐచర్ రూపంలో ప్రమాదం వెంటాడింది. పామిడికి సమీపంలోని పొగురూరు బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న November Travelsకు చెందిన ప్రైవేట్ బస్సును ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగినట్లు పామిడి మీడియా కథనం. అంతకుముందు ఈ బ్రిడ్జిపైనే ప్రయాణిస్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కుడివైపున వెళ్తున్న November Travels బస్సును ఐచర్ వాహనం ఢీకొట్టింది.
రెండు వాహనాలు బోల్తా...
పామిడి సమీపంలోని పొగురూరు బ్రిడ్జి పైనుంచి ప్రయాణిస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సును ఐచర్ వాహనం ఢీకొనడంతో రెండు వాహనాలు అదుపుతప్పి, సుమారు 20 అడుగులో లోతు ఉన్న కాలువలో ఎగిరి పడిపోయాయి. బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఐచర్ వాహనం ఢీకొన్న శబ్ధం ధాటికి ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగిందో తెలుగునే లూపే కాలువలో బస్సు బోల్తా పడడంతో ప్రాయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై మరొకరు పడి గాయాలకు గురయ్యారు.
40 మందికి గాయాలు
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు కూడా గాయపడినట్లు సమాచారం అందింది. వారిలో పది మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రమాద సంఘటన జరిగిన ప్రదేశం జాతీయ రహదారి 44 కావడంతో బ్రిడ్జిపై ఇంకొన్ని వాహనాలు వెళ్లలేని స్థితిలో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఈ సమాయారం అందిన వెంటనే స్థానికులు స్పందించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
స్తంభించిన ట్రాఫిక్
పామిడి సమీపంలోని పొగురూరు బ్రిడ్జిపై .జరిగిన సంఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలిచారని సమాచారం. ఈ ఘటనపై పామిడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.