Kuppam| లోకేష్ ‘మాస్టర్ ప్లాన్’ భువనేశ్వరి పోటీ? బాబు మజిలీ?
నారా చంద్రబాబు కోటకు కొత్త వారసురాలు? సేవలతో మొదలై ఘాటు వ్యాఖ్యల వైపు.. 2029 ఎన్నికల వ్యూహంలో ఐ-ప్యాక్ మార్క్ మార్పులు!
కుప్పం నియోజకవర్గం నారా చంద్రబాబు రాజకీయ కోట. 1989 నుంచి 8 సార్లు తిరుగులేని విజయాలతో సాగుతున్న ఆయన ఆత్మ ఒకటే కాదు. ఐకానిక్ సామ్రాజ్యం. 2029 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయబోయేది చంద్రబాబా? నారా భువనేశ్వరా? బాబు తన స్థానాన్ని మార్చుకోబోతున్నారా? దీని వెనుక లోకేష్ వేసిన 'పొలిటికల్ మాస్టర్ ప్లాన్' ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా నారా చంద్రబాబుకు కుప్పం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు. అది ఆయన రాజకీయ ఆత్మ. 1989 నుంచి వరుసగా ఎనిమిది సార్లు కుప్పం ప్రజలు ఆయనకు తిరుగులేని విజయాన్ని అందించారు. అయితే, ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక బిగ్ పొలిటికల్ చేంజ్ రాబోతోందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఒక ఊహించని రాజకీయ పరిణామం తెరపైకి వస్తోంది. 2029 ఎన్నికల్లో కుప్పం నుంచి నారా భువనేశ్వరి పోటీ చేయబోతున్నారా? చంద్రబాబు తన మజిలీని గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు మార్చబోతున్నారా? లోకేష్ వేసిన ఈ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు కథకు నారా లోకేష్ మాస్టర్ మైండ్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి కుప్పంలో ఆ పార్టీ నేతలే విజయం సాధిస్తున్నారు. కానీ కాలక్రమేణా అక్కడ రాజకీయ పరిణామాలు మారాయి. ఒకనాటి కాంగ్రెస్ సాంప్రదాయ ఓటర్లు, నాయకులు క్రమంగా వైసీపీ వైపు దారి మళ్లడం చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద ముల్లులా మారింది. అయినా, టీడీపీ విజయానికి గండి కొట్టడం వైసీపీకి సాధ్యం కావడం లేదు. మెజారిటీ తగ్గించడంలో వైసీపీ నేతలు కసరత్తు ఫలిస్తోంది.
వైసీపీ నుంచి ప్రతిఘటన ఉన్న నేపథ్యంలో అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు కుప్పంలో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టారు. నిరుద్యోగ యువతకు, మహిళలకు వేలాది ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదుకున్నారు. కుప్పంలో ఒప్పందాలు (MoUs), శంకుస్థాపనలు పూర్తి చేసుకున్న ఈ 27 నుంచి 30 పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 0 వేల నుంచి 40 వేల మందికి పైగా యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
200 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యంత ఆధునిక "చికెన్ ప్రాసెసింగ్ యూనిట్"ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,400 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ప్రారంభ దశలోనే 400 మందికి పైగా నియామక పత్రాలు అందజేయడం ఓ ఉదాహరణ.
పొగురుపల్లె వద్ద 44.58 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రారంభించి, స్థానిక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం 167 ప్లాట్లను అందుబాటులోకి తెచ్చారు
భువనేశ్వరి ఎంట్రీతో...
సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో ప్రజల మనసులను గెలుచుకునే బాధ్యతను నారా భువనేశ్వరి భుజాన వేసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంతో జనుల్లోకి వచ్చిన ఆమె, శాంతిపురం మండలంలో సొంత ఇల్లు నిర్మించుకుని శాశ్వతంగా కుప్పం ప్రజలకు దగ్గరయ్యారు.
రెండు, మూడు నెలలకోసారి కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి పథకాలు అందించారు. విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులను ఆదుకుంటూ సంక్షేమ ఫలాలు అందించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే యత్నం చేశారు. ఎక్కడా రాజకీయాల ప్రస్తావన తేకుండా, ప్రశాంతంగా సేవా కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన ఆదరణను సంపాదించుకున్నారు.
లోకేష్ స్కెచ్ ఏమిటి?
నారా లోకేష్ రివెంజ్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా? క్షేత్రస్థాయిలో మారిన సమీకరణాలు, సర్వే నివేదికల అంతర్యం ఏమిటి?
ఇంతకాలం రాజకీయ ప్రస్తావన తీసుకురాని నారా భువనేశ్వరి సేవ వెనుక పక్కా వ్యూహం ఉందనేది స్పష్టమవుతోంది. ఇక్కడే నారా లోకేష్ సరైన పొలిటికల్ స్కెచ్ వేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2021 అసెంబ్లీలో తన తల్లి భువనేశ్వరిపై జరిగిన వ్యక్తిత్వ హననానికి రాజకీయంగా సమాధానం చెప్పాలనేది లోకేష్ పట్టుదల. నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్న భువనేశ్వరి, ఇటీవల కుప్పం పర్యటనలో ద్రౌపదీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నాక మొదటిసారి ఘాటు రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల వెనుక మహిళల అభిమానాన్ని పూర్తిగా చూరగొనడమే కాకుండా, 2029లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రత్యర్థులకు తగిన రీతిలో సమాధానం చెప్పడమే ప్రధాన లష్యంగా కనిపిస్తోంది. దీనిపై ఇంటెలిజెన్స్ నివేదికలు, సాంకేతిక ఆధారాలతో ఐప్యాక్ తరహా సర్వే రిపోర్టులు కూడా బాబుకు అనుకూలంగా వచ్చినట్లు సమాచారం.
కుప్పంలో భువనేశ్వరి పోటీ చేయడం ఖాయమైతే... తన ఆత్మలాంటి కుప్పం స్థానాన్ని భార్యకు అప్పగించి, చంద్రబాబు గుంటూరు లేదా పల్నాడు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఒకదానికి మజిలీ మార్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు అంటున్నారు. 40 ఏళ్లకు పైగా కుప్పంతో విడదీయరాని బంధం ఉన్న చంద్రబాబు అక్కడి నుంచి వేరే జిల్లాకు మారడం సాధ్యమేనా? బాబు స్థానంలో భువనేశ్వరిని కుప్పం ప్రజలు నిండు మనస్సుతో ఆదరిస్తారా? లోకేష్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ 2029లో వర్కౌట్ అవుతుందా? అనేది తేలాలంటే మూడేళ్లలో ఏమి జరగబోతుందనేది వేచి చూడాల్సిందే.
Next Story

