x

సీమలో ‘సీన్’ రివర్స్? కూటమికి సొంతింటి సెగ. వైసీపీకి ‘పరామర్శల’ పవర్!

52 సీట్ల రాయలసీమలో పొలిటికల్ హీట్ పీక్స్.


రాయలసీమలో గడ్డపై ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగింది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ తరహా విజయాన్ని సాధించిన టీడీపీకి అసలైన సవాలు ఎదురైంది. ఒకవైపు వైసీపీ విసురుతున్న పోరుబాట సవాళ్లు. మరోవైపు సొంత ఎమ్మెల్యేల్లో కొందరిని గాడిలో పెట్టడం సీఎం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది!

రాయలసీమలో 52 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత మూడు ఎన్నికల ఫలితాలను చూస్తే సీమ ఓటరు తీర్పు ఎంత ఘాటుగా ఉందో అర్థమవుతుంది 2014లో టీడీపీ 28 గెలిస్తే, వైసీపీ 24 సీట్లు సాధించింది. 2019లో టీడీపీ మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా వైసీపీ 49 స్థానాలు దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఏడు సీట్లకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ కూటమి 45 సీట్లు సాధించింది. నెల్లూరులో పదికి పది సీట్లు టీడీపీ సాధించింది. 2019 ఎన్నికల సీన్ వైసీపీకి రివర్స్ అయింది. ఇంతటి భారీ ప్రజా మద్దతు సాధించిన టీడీపీలో సొంతింటి రగడ: చంద్రబాబుకు 'కట్టడి' తలనొప్పింగా మారింది. రాయలసీమలో వైసీపీ సవాళ్లను పక్కనబెడితే, కూటమి ఎమ్మెల్యేల తీరు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది.
కోల్పోయిన రాయలసీమ కోటను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ గట్టి స్కెచే వేశారు.
1) సాగునీటి యుద్ధం: రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం జలాశయ మట్టంపై ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ రైతులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
2) హామీల అమలుపై నిలదీత: సూపర్ సిక్స్ హామీల అమలులో ఆలస్యాన్ని ఎండగడుతూ, పాత సంక్షేమ పథకాలతో పోల్చి విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రధానంగా మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు వీధిపోరాటాలు ముమ్మరం చేశారు.
3) ఇదే సమయంలో రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు ఎత్తిపోతల పథకమే శరణ్యం అంటే కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో హంద్రీ. నీవా కాలువల లైనింగ్ పనుల నాణ్యతపై పోరుబాట పట్టారు.
4) శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోవడం అనేది మహిళలపై దాడులు, వైసీపీ నేతలను వేధిస్తున్న తీరుపై పవర్ ఫుల్ వెపన్ గా వాడుకుంటున్న వైసీపీ జనంలోకి వెళ్లడంలో ఏమాత్రం తగ్గడం లేదు. కేసులకు భయపడేది లేదనే స్థాయిలో హెచ్చరికలతో మొండిగా ముందుకు వెళ్తున్నారు.

ఇంతటితో ఆగని జగన్...

కేసుల్లో చిక్కుకునే నేతలు, వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమంతో బలప్రదర్శనే సాగిస్తున్నారు. రాయలసీమలోనే కాదు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే. నాయకులకు కేసులతో ఇబ్బంది ఎదురైతే జగన్ వెంగనే రంగంలోకి వస్తున్నారు. ఆ నేత పరామర్శ కోసం సాగించే యాత్ర ద్వారా పిలుపు ఇవ్వకుండానే స్థానిక నేతలు పార్టీ శ్రేణులను సమీకరించే తీరు తోపాటు స్వచ్ఛందంగా వచ్చే అభిమానులు జగన్ పై అభిమానాన్ని చాటుకునే క్రమంలో హద్దులు మీరుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి ఇది ఓ రకంగా బలప్రదర్శన అనడం కంటే, పార్టీ యంత్రాంగంలో జోష్ నింపడంగానే భావిస్తున్నారు.
కేసులు నమోదవుతున్నా ఆయన పార్టీ నేతలు ఖాతరు చేయకపోగా, 2029 అధికారంలోకి వచ్చేది మేమే. ఇంతకు 20 శాతం అదనంగా వడ్డీతో సహా ప్రతికారం తప్పదని మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా తన మాటలతో పునరుద్ఘాటించడం గమనార్హం. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే మొండి పట్టుదల రాజకీయాలను రోజురోజుకు వేడెక్కిస్తున్నారు. ఇదెలా ఉంటే..

చంద్రబాబు ‘రివర్స్ స్కెచ్

వైసీపీ సవాళ్లను తిప్పికొడుతూ, సొంత నేతలను కట్టడి చేసేందుకు చంద్రబాబు-పవన్-లోకేష్ త్రయం పక్కా వ్యూహంతో దిగింది. ప్రతి సమస్యను టీ కప్పులో తుఫాను మాదిరే పరిష్కరిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక ప్రయోజనం కలిగిస్తుందా? అనేది ప్రశ్న. అంతేకాకుండా,
1) టైమ్ బౌండ్ ప్రాజెక్టులు: హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులను వేగవంతం చేసి సీమ చివరి ఆయకట్టు వరకు కృష్ణా నీళ్లను అందించడమే ఏకైక సమాధానమని బాబు రివ్యూలు పెడుతున్నారు.
2) జాబ్స్, ఇండస్ట్రీస్: సీమను 'ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ & గ్రీన్ ఎనర్జీ హబ్'గా మార్చి యువతకు వేలాది ఉద్యోగాలు తెచ్చేందుకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు.
3) పవన్ & లోకేష్ మార్క్: సనాతన ధర్మం, యువత ఓటు బ్యాంకును ఆకట్టుకోవడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అవుతుంటే... లోకేష్ 'రెడ్ బుక్' హెచ్చరికలు, ఉపాధి నియామకాలతో స్పీడు పెంచారు.

Read More
Next Story