తిరుమల లడ్డూ సువాసనకు 2018లో ఎలా మేకప్ చేశారు?
x

తిరుమల లడ్డూ సువాసనకు 2018లో ఎలా మేకప్ చేశారు?

అస్త్రాల ప్రయోగంలో తగ్గేది లేదంటున్న వైసీపీ.


Also Read:Adulterated ghee | షోలాపూర్ కి చేరిన 'వెంకన్న' పంచాయతీ..!

శ్రీవారి లడ్డూ వివాదానికి కారణమైన "కల్తీ నెయ్యి"కి ఆజ్యం పోయడంలో టీడీపీ, వైసీపీ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో తిరుమల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. లడ్డు తయారీలో వాడే పదార్థాల వల్లే సువాసనలు వెదజల్లుతుంటుంది. ఇదే అంశం 18 నెలల తర్వాత కొత్తగా తెరపైకి వచ్చింది.

"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి మేకప్ చేశారు. అంటే, 2018 లోనే కల్తీ నెయ్యి వాడారు" అని వైసిపి ఆరోపించింది. సువాసన రావడానికి రోజుకు 975 కిలోల ఫ్లేవర్డ్ నెయ్యి (flavoured ghee) వాడారని సరికొత్త ఆరోపణను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో టీడీపీని ఇరకాటంలో పడింది.
టీటీడీ బోర్డులో 2019 నుంచి 2024 వరకు ఉన్న కొనుగోళ్ల కమిటీ ( TTD Purchasing Committee)పై సీబీఐ శీతకన్ను వేసిందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది.
తిరుమల లడ్డు లో వాడిన కల్తీ నెయ్యి పై విచారణ పూర్తి చేసిన సిబిఐ (Central bureau of investigation CBI) నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ ఏడాది జనవరి 21వ తేదీ చార్జిషీట్ దాఖలు చేసింది.
"లడ్డు తయారీకి వాడిన నెయ్యలో కొవ్వు కారకాలు కాకుండా రసాయనాలు, పామోలిన్ వాడారు" అనే అంశాన్ని కీలకంగా పట్టుకున్న వైసిపి నాయకులు
టిడిపి కూటమి
పై ఎదురుదాడి ప్రారంభించారు.
సువాసనకు కారణం ఇది..
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పాటు, శనగపిండి, పచ్చ కర్పూరం, యాలకులు, కలకండ, జీడిపప్పు వినియోగిస్తారు. ఈ పదార్థాలు వాడడానికి 1950లో టిటిడి వినియోగించే వస్తువులు సరుకుల మోతాదును నిర్ణయించారు. ఆ తర్వాత 2001లో దిట్టం (పడితరాదిట్టం స్కేల్) సవరించారు. ఒక దిట్టమంటే 5,100 లడ్డూర తయారీకి 83 కిలోల సరుకులను వినియోగిస్తారు.

లడ్డూల తయారీకి 165 కిలోలు నెయ్యి, 400 కిలోల చక్కెర, 1080 కిలోలు సెనగపిండి, 16 కిలోల ఎండు ద్రాక్ష, నాలుగు కిలోలు యాలకులు, 8 కిలోలు కలకండ, 30 కిలోలు జీడిపప్పు" వినియోగించే విధంగా టీటీడీ శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి దిట్టం సిద్ధం చేసింది. ఇన్ని పదార్థాలు కలపడం వల్ల లడ్డు ప్రసాదం 10 అడుగుల దూరంలో తీసుకుని వెళుతున్న సువాసన ఘుమఘుమలాడుతుంది.

రాజకీయ దుమారం

టిటిడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారికి వినియోగించే నైవేద్యం, లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని 2024 సెప్టెంబర్ 18 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన ఆరోపణ నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై సిబిఐ సారధ్యంలోని సిట్ అధికారులు విచారణ చేసి, కోర్టుకు చారిషెడ్ సమర్పించారు. ఇందులో 36 నిందితులను పేర్కొంటే, వారిలో బోలె బాబా డైరీ తో పాటు (Uttrakhand bhole Baba diary) తోపాటు ఇంకొంతమంది పాల కర్మ గారాల ప్రతినిధులు, 12 మంది టీటీడీ ఉద్యోగులు నిందితులుగా ఉన్నారని సిబిఐ దర్యాప్తులో గుర్తించింది.

వైసీపీ చేతికి అస్త్రం..

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై cbi చార్జిషీట్ తర్వాత వైసిపి స్వరం పెంచింది.
"ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు లేదని సిబిఐ దర్యాప్తులో తేలింది. ఇదే మాకు లభించిన క్లీన్ చిట్" అని వైసిపి దూకుడు ప్రారంభించడమే కాకుండా, కొత్త వస్త్రాలను తెరపైకి తీసుకువచ్చింది.

ఆ సువాసనకు కారణం..?

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో మా ప్రభుత్వంలో ఎలాంటి అపచారం జరగలేదు అని వైసిపి చీఫ్ వైఎస్. జగన్ తోపాటు ఆ పార్టీ నాయకులు వాదన ప్రారంభించారు.
"మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్ రాజకీయంగా అణచివేయాలని టిడిపి కుట్ర పన్నింది" అని టిటిడి మాజీ చైర్మన్, వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులు నిర్వహిస్తున్న పాల పరిశ్రమతో మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ నెయ్యిని వ్యూహాత్మకంగా వైసిపి (YCP ) తెరపైకి తీసుకువచ్చింది. దీంతో
తిరుమలకు సంబంధించి లడ్డు తయారీలో వాడిన కల్తీ నెయ్యి పై రాజకీయ పార్టీల మధ్య అడగలేని మంటలు కార్చిచ్చుల వ్యాపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మరో అస్త్రాన్ని ఆదివారం తెరపైకి తీసుకొని వచ్చారు.
"మీ కుటుంబం నిర్వహిస్తున్న పాల పరిశ్రమకు, ఇందాపూర్ డైరీ కి ఉన్న అనుబంధం ఏమిటి"? అని భూమన ప్రశ్నించారు. తిరుమలకు 2018 లో ఇదే ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యి సరఫరా చేసిన సంస్థకు మళ్ళీ ఇప్పుడు టెండర్ దక్కడం వెనక లోగుట్టు ఏమిటి అని కూడా ప్రశ్నించారు.

సువాసన వెనక కుట్ర..

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కూడా కల్తీ నెయ్యి వాడినట్లు భావించాల్సి వస్తోంది అని భూమన సందేహం వ్యక్తం చేశారు.
"లడ్డు తయారీకి వాడిన దినుసులతోపాటు సువాసనన రావడానికి లడ్డుకు మేకప్ చేశారు" అని భూమన కరుణాకర్ రెడ్డి ఘాటైన ఆరోపణ చేశారు. అంటే, లడ్డు ప్రసాదం తయారీలో కుట్ర ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సువాసన రావడానికి 2018 లో టిడిపి ప్రభుత్వం లో టీటీడీ పాలక మండలి అనుసరించిన విధానాన్ని ఆయన వివరిస్తూ..
" 2018లో తిరుమల లడ్డు లో సువాసన రావడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఘీ ఫ్లేవర్ (flavoured ghee) తో తయారు చేసిన లడ్డుకు మేకప్ చేశారు. దీనికోసం 975 కిలోలు ఒక రోజుకు ఫ్లేవర్డ్ కి కొనుగోలు చేశారు. ఆ లెక్కన ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి అంత నెయ్యి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది" అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
"టిడిపి ప్రభుత్వంలో అప్పటి పాలకమండలి ఈ విధానం అనుసరించడం వెనక కల్తీ నెయ్యి వాడి ఉండకపోతే ఫ్లేవర్డ్ ఘీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది" అని ఆయన నిలదీశారు.

తిరుమలను వదలని వివాదం

తిరుమల శ్రీవారి క్షేత్రం కేంద్ర బిందువుగా తెలుగుదేశం పార్టీ కూటమి, వైసిపి మధ్య రగిలిన రాజకీయ వివాదం మంటలు ఆరని కార్చిచ్చుల వ్యాపిస్తునే ఉన్నాయి.
2019 నుంచి 2024 మధ్యకాలంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. పాలు సేకరించకుండా వెన్న ఉత్పత్తి లేని డైరీలే 1.61 కోట్ల కిలోల నెయ్యి సరఫరా చేస్తే, అందులో 68 లక్షల కిలోల నెయ్యితో 40 శాతం పామోలిన్, పామ్ కేర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలు ఉన్నాయి అనేది cbi దాఖలు చేసిన చార్జిషీటులో ప్రస్తావించారు.

పర్చేజింగ్ కమిటీ పనితీరు..

టీటీడీ ( Tirumala Tirupati devasthanam TTD) పాలక మండలంలోని ప్రతినిధులు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( TTD Executive Officer ) వాటిని అమలు చేసే విధానం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే క్యాబినెట్ నిర్ణయాలతో సమానంగా ఉంటుంది.
టీటీడీకి అవసరమైన ఏ వస్తువులు కొనుగోలు చేయాలన్నా పాలక మండలిలోని కొనుగోళ్ల కమిటీ (purchasing committee) ముగ్గురు సభ్యులతో ఏర్పాటు అవుతుంది. అందులో టీటీడీ ఎఫ్ ఏ అండ్ సి ఓ (TTD finance advisor and chief accounts officer Faco) తోపాటు మార్కెటింగ్ విభాగం, ఇతర అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ నెయ్యి సరఫరా చేయడానికి టెండర్ దాఖలు చేసిన పాల పరిశ్రమను సందర్శిస్తుంది. టీటీడీ నిబంధనల మేరకు పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి, వ్యాపార లావాదేవీలు నిర్వహించిన సామర్థ్యం ఉందా? లేదా అని సమగ్ర వివరాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఈ కమిటీ టీటీడీ బోర్డు కు నివేదిక సమర్పిస్తుంది. అందులో లోటుపాట్లను సమీక్షించిన తర్వాత టిటిడి చైర్మన్ సారథ్యంలోని కమిటీ రాజకీయ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని తిరుమల జేఈవో (అదన ఈఓ) ద్వారా శాఖల వారీగా టిటిడి ఆర్థిక విభాగానికి ఫైల్ చేరుతుంది. ఆ తర్వాత నిధులు మంజూరు చేయడానికి అక్కడి ఎఫ్ఏ అండ్ సి ఓ ఆర్డర్ పాస్ చేస్తారు.
"టిటిడి పాలకమండలి తీసుకుని నిర్ణయాలు సరైనవి కాకుంటే, ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయవచ్చు. టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం ఉంటుంది" ఇంతవరకు ఆ విధంగా గతంలో ఏ ఒక్క టీటీడీ ఈవో కూడా తన విచక్షణాధికారాన్ని వినియోగించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్న సమాచారం.

కల్తీ నెయ్యి వివాదం తర్వాత..

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసిన తర్వాత సిబిఐ అనేక కోణాల్లో రికార్డులు పరిశీలించడంతోపాటు అన్ని వివరాలు సేకరించింది. మిగతా వ్యవహారాలను పక్కన ఉంచితే నెయ్యి కొనుగోలుపై లోతైన దర్యాప్తు చేసిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
"నెయ్యి సరఫరా చేసిన పాల పరిశ్రమల యాజమాన్యాలను, అధికారులను మాత్రమే ఇందులో బాధ్యులను చేసింది. పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసిన టిటిడి బోర్డులోని ముగ్గురు సభ్యులను ఉపేక్షించారు" ఇదే అంశాన్ని వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి కూడా ప్రస్తావించారు.
"2019 నుంచి 24 వరకు పనిచేసిన టిటిడి చైర్మన్ వై వి. సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆనాటి ఈఓగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డి కూడా విచారణ ఎదుర్కొన్నారు. పర్చేసింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న ముగ్గురి ఇళ్ల వద్దకు వెళ్లి cbi అధికారులు విచారణ చేశారనే వార్తలు వచ్చాయి"
"అంతా అధికారులదే బాధ్యత అని ఆ ముగ్గురు సభ్యులు చెప్పినట్లు" విశ్వసనీయ సమాచారం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సరికొత్త ఆరోపణలతో టీడీపీ కూటమిని వైసీపీ ఇరకాటంలో పెట్టే ప్రయత్రం చేస్తోందనడంలో సందేహం లేదు. ఈ వివాదం ఎప్పుడు, ఎలా సద్దుమణుగుతుందనేది మాత్రం శ్రీవారు కూడా చెప్పలేని స్థితి ఏర్పడింది.
Read More
Next Story