కరువు 'సీమ'పాదాల చెంత అలల స్వర్గధామం
తిరుపతి జిల్లాలో దీవి ఎలా వచ్చిందో వివరించే వీడియో కథనం
కరువు ప్రాంతాన్ని సముద్రం తచ్చాడంది. రాయలసీమ పాదాల చెంత కొత్త అందాలు కలిశాయి. సముద్రం, బీచ్, దీవిలో ఉన్న, గ్రామం తో పాటు అలలపై తేలియాడుతూ, పడవ ప్రయాణం ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకుని వచ్చింది. రాయలసీమ జిల్లాలకు సొంతంగా సముద్రతీరం కలిసిన అరుదైన దృశ్యం ఈ వీడియో చూడాల్సిందే..
రాయలసీమ అంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల సంగమం అని అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో నిత్యం కరువు పరిస్థితులు అంటే చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన కుప్పం నుంచి అదే మార్గంలో మహబూబ్ నగర్ వరకు ఈ బెల్ట్ ప్రాంతాలు అనుసంధానమై ఉంటాయి. ఈ ప్రాంతం మొత్తం వర్షాభావం, కరువు, ఎండిన చేలు, డెక్కలు ఎండిన పశువులే కనిపించేవి. మరి ఇలాంటి ప్రాంతంలో సముద్రతీరం ఎలా వచ్చిందనేది కదా మీ సందేహం..
రాయలసీమ నాలుగు జిల్లాలకు చిటికెన వేలుగా నెల్లూరు దగ్దరలో ఉంటుంది. తిరుపతి జిల్లా పరిధిలోకి నెల్లూరు ప్రాంతపు కోస్తా తీరం చేరడంతో, రాయలసీమ వాసులకు సముద్ర అందాలు అందుబాటులోకి వచ్చాయి. సూళ్లూరుపేట సమీపంలోని ఇరకందీవి, తూపిలిపాలెం బీచులు ఇప్పుడు పర్యాటకులకు అద్భుతమైన సేదదీరే ప్రదేశాలుగా మారాయి.
మనసు తుళ్లి పడుతుంది..
తిరుపతి జిల్లాలో కలిసిన వాకాడుకు సమీపంలో తూపిలిపాలెం బీచ్. అలల హోరు ఉన్న ఆహ్లాదకరంగా ఉంటుంది. వాకాడు మండలంలోని ఈ బీచ్ ఇంకా వ్యాపారాత్మకం కాకపోవడంతో అత్యంత పరిశుభ్రంగా, జనసంచారం తక్కువగా ఉంటుంది. ఇక్కడి సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు పర్యాటకులను మైమరిపిస్తాయి. మైపాడు, కోదండరామపురం పరిసర తీరాలు కూడా కొద్ది దూరంలోనే ఉండి పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.
చెన్నై నుంచి విశాఖవరకు సముద్రతీరం విస్తరించి ఉంటుంది. దీనివల్ల తడ మండల కేంద్రానికి సమీపంలోని బంగాళాఖాతం పులికాట్ సరస్సుకు ముఖద్వారం. దీనివల్ల పులికాట్ సరస్సులో పడవల్లో విహరించడానికి లోతైన సముద్ర జలాలు వింత అనుభూతిని కల్పిస్తాయి. ఈ సరస్సులో తూపిలిపాళెం నంచి మరబోట్లలో ఇరకదీవికి ప్రయాణించే సమయంలో మనసు ఆహ్లాదంగా మారుతుంది. పెద్దలు కూడా కేరింతలతో ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించే అనువైన వాతావరణం ఆనందడోలికల్లో తేలియాడవచ్చు.
ఈ పర్యాటక ప్రదేశాలకు ఇలా వెళ్లవచ్చు..
పులికాట్ సరస్సు, తూపిలిపాలెం బీచ్, ఇరకదీవి, ఇక్కడికి వెళ్లడానికి ముందు భీమునివారిపాలెం వద్దకు వెళ్లడానికి రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి నుంచి ఈ బీచులకు వెళ్లడం చాలా సులభం. తిరుపతి నుంచి 85 కిలోమీటర్లు హైవేలో శ్రీకాళహస్తి, మీదుగా సూళ్లూరుపేటకు చేరవచ్చు. సూళ్లూరుపేట నుంచి పులికాట్ సరస్సు వంతెనమీదుగా వాకాడు, తూపిలపాలెం వైపు 25 కిలోమీటర్లు ప్రయాణించాలి.
ఇరకందీవి (Irakam / Irakandivi): పులికాట్ సరస్సు మధ్యలో ఉన్న ఒక అందమైన ద్వీప గ్రామం ఇది. ఇక్కడికి వెళ్లడానికి భీమునివారిపాలెం వద్దకు దిగాలి. రైల్వే క్రాసింగ్ దాటి ముందుకు వెళితే, అక్కడ పడవలపై ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. అవతలి ఒడ్డుకు చేరగానే దీవిలోకి పాదం మోపవచ్చు. అక్కడి గ్రామానికి ఒకవైపు ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, మరోవైపు సముద్ర తీరం ఈ ప్రదేశం ప్రత్యేకత. ఇక్కడ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపవచ్చు. ఇక్కడ నీటిపై పడవల్లో ప్రయాణం ఎంత అందంగా, ఆనందంగా ఉంటుంది.
Next Story

