కాంగ్రెస్ కీలక సమావేశానికి శశి థరూర్ ఎందుకు హాజరుకాలేదు?
x

కాంగ్రెస్ కీలక సమావేశానికి శశి థరూర్ ఎందుకు హాజరుకాలేదు?

కేరళ ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతున్న వేళ పార్టీలో బయటపడ్డ అంతర్గత విభేదాలు..


Click the Play button to hear this message in audio format

కేరళ(Kerala)లో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వ్యూహాలు, పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్(Congress) పార్టీ శుక్రవారం (జనవరి 23) మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశానిని రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharror) హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


‘రాహుల్ ప్రవర్తన థరూర్‌ను బాధించింది..’

లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పట్ల ఉన్న అసంతృప్తిగా కారణంగానే థరూర్ ఈ సమావేశానికి రాలేదని పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల రాహుల్ గాంధీ కొచ్చి పర్యటన సందర్భంగా తనతో “దురుసుగా ప్రవర్తించారని” భావించిన థరూర్.. పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు ‘ది ఫెడరల్’కు తెలిపారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వారిని సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ‘మహా పంచాయతీ’ కార్యక్రమానికి థరూర్ హాజరయ్యారు.


‘KLFకు హాజరవుతున్నందువల్లే..’

కోజికోడ్‌లో జరుగుతోన్న కేరళ సాహిత్య ఉత్సవానికి (KLF) హాజరు కావాల్సి ఉండడంతోనే థరూర్ పార్టీ సమావేశానికి రాలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే థరూర్ గైర్హాజరు వెనుక రాజకీయ అసంతృప్తి మాత్రం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.


‘థరూర్ పేరు ప్రసావించకపోవడం వల్లే..’

రాహుల్ గాంధీ థరూర్‌ను పట్టించుకోలేదని చెప్పే ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం థరూర్‌ను బాధించిందని పార్టీ అంతర్గత వర్గాలు సమాచారం. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ఇతర నాయకుల పేర్లను ప్రస్తావించి, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన థరూర్ పేరు ప్రస్తావించకపోవడం థరూర్‌కు నచ్చలేదని పార్టీకి చెందిన ఒక వ్యక్తి తెలిపారు.


మోదీ ప్రభుత్వంపై అనుకూలంగా థరూర్ వ్యాఖ్యలు..

ఈ మధ్య వయనాడ్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేరళ నేతలు ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు. ఇదే సమావేశలో పార్టీ సీనియర్ నేతలు థరూర్‌తో కూడా చర్చించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరు వినిపిస్తున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఆసక్తి లేదని థరూర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే గత కొంతకాలంగా థరూర్ కాంగ్రెస్ నాయకత్వంతో విభేదిస్తున్నారు. వివిధ అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, అవలంబించిన వైఖరి పార్టీకి ఇబ్బందిగా మారాయి. గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రవాద దాడి, ‘ఆపరేషన్ సిందూర్’ అంశాల్లో .. థరూర్ మోదీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణులను అసంతృప్తికి గురిచేసింది.


‘రాజవంశ రాజకీయాల’పై ప్రశ్నలు..

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ వారసత్వాన్ని సమర్థిస్తూ.. కాంగ్రెస్‌లోని ‘రాజవంశ రాజకీయాలను’ థరూర్ ప్రశ్నించడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. వివాదాస్పద రథయాత్రకు నాయకత్వం వహించిన అద్వానీ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఒకే ఒక ఎపిసోడ్‌కు పరిమితం చేయడం అన్యాయమని, అలాగే జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో సమాంతరంగా చూడకపోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల ప్రధాని మోదీ(PM Modi) ఉపన్యాసానికి హాజరైన థరూర్.. ఆ తర్వాత 12 రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను సమీక్షించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి మాత్రం హాజరు కాలేదు.

గురువారం బీజేపీ ఎంపీ, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని థరూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా కాంగ్రెస్–థరూర్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

కేరళ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఈ అంతర్గత విభేదాలు పార్టీ వ్యూహంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story