షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణకు కమిషన్,జస్టిస్ షమీమ్ అఖ్తర్ నియామకం
x

షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణకు కమిషన్,జస్టిస్ షమీమ్ అఖ్తర్ నియామకం

తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణకు కమిషన్ కు జస్టిస్ షమీమ్ అఖ్తర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


తెలంగాణలో షెడ్యూల్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

షెడ్యూల్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కార్యాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్ లో బి.బ్లాక్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు.
- షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సోమవారం విడుదల చేసిన జీ.వో. ఎం.ఎస్.నెంబరు 8 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఉపకులాల వర్గీకరణకు సంబంధించినటువంటి వినతులను, అభిప్రాయాలను అభ్యర్థనలను షెడ్యూలు కులాలకు చెందినటువంటి సంఘాలు,వ్యక్తుల నుంచి స్వీకరించాలని కమిషన్ నిర్ణయించింది.సంఘాలు, ప్రజలు కమిషన్ కార్యాలయం నందు కార్యాలయ పనివేళల్లో వినతి పత్రాలను అందజేయవచ్చునని షమీమ్ అఖ్తర్ చెప్పారు.తమ వినతులను, అభ్యర్థనలను మెయిల్ ద్వారా పంపించదలచినవారు కమిషన్ యొక్క మెయిల్ ఐడి '[email protected]' ని ఉపయోగించుకోవచ్చునని కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ అదనపు సంచాలకులు సి.శ్రీధర్ చెప్పారు.


Read More
Next Story