వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు..
x

వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు..

జూన్‌ 4, 8, 9, 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు


ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో బోగస్ ఓట్లు, తప్పుడు తొలగింపులపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు రూపొందించిన ఈ కార్యాచరణ ప్రకారం

జూన్ 4న మండల కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జూన్ 8 లేదా 9న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో టౌన్‌హాల్ సదస్సులు నిర్వహించి, ఎన్నికల సంఘం ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తం చేయనున్నారు.

జూన్ 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అనియమాలు, బోగస్ ఓట్లు, రాజకీయ ప్రేరేపిత తొలగింపులను ప్రజల ముందు ఎండగట్టి, ఎన్నికల సంఘాన్ని సరైన విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.

పార్టీ శ్రేణులంతా ఈ మూడు దశల నిరసన కార్యక్రమాల్లోనూ భారీ స్థాయిలో పాల్గొని, ప్రజలను సమీకరించి, బలమైన నిరసన వ్యక్తం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకత్వం సూచించింది.

Read More
Next Story