శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో సంచలన మార్పులు!

టీటీడీ సంచలన నిర్ణయం! లడ్డూల నిలువకు కొత్త టెక్నాలజీ!


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోట్లాది మంది భక్తులకు మహా ప్రసాదం. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ లడ్డూ రుచి, సువాసన వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. ఇప్పుడు శ్రీవారి ప్రసాదాల తయారీలో, వాటి నాణ్యతలో ఒక సరికొత్త చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది! దేశంలోనే మొదటిసారిగా, ప్రసాదాల క్వాలిటీ, సేఫ్టీని మరింత పెంచేందుకు టిటిడి (TTD) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోపణలు, వివాదాలకు తెరదించడానికి టీటీడీ మరో ముందడుగు వేసింది.


మైసూర్ ల్యాబ్ తో ఒప్పందం

బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక 'రైజ్ కాంక్లేవ్-2026' సదస్సులో టీటీడీ ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో.. మైసూర్ లోని ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) తో టీటీడీ అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది. దేశంలో ఏ దేవాలయం కూడా ఇప్పటివరకు ఇలాంటి సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ తో నాణ్యత కోసం ఒప్పందం చేసుకోలేదు. ఈ రకమైన అగ్రిమెంట్ జరగడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం!
తిరుమల శ్రీవారిని రోజుకు కనీసంగా 65 వేల నుంచి 75 వేల మంది యాత్రికులు సందర్శిస్తుంటారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ రోజుకు దాదాపు నాలుగు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుతోంది. తిరుమలలో సగటున 3.5 లక్షల లడ్డూలు రోజూ విక్రయాలు జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లడ్డూ నాణ్యత పెంచడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అదే సమయంలో మరింత క్వాలిటీతో ప్రసాదాలు తయారీకే కాకుండా, ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు కొత్త టెక్నాలజీ వినియోగానికి చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.
(ఆ ఒప్పందం ఏమిటి? ఈ వీడియోలో చూడండి)


Read More
Next Story