నెల్లూరు దర్గామిట్ట సమీపంలో స్వర్ణాలచెరువు వద్ద కిటకిటలాడుతున్న యాత్రికుల్లో ఓ భాగం..
కోరికల గుర్రం.. నెల్లూరు రొట్టెల పండుగ వెనుక ఉన్న ఆ.. మ్యాజిక్ ఇదీ..
కిటకిటలాడుతున్న దర్గామిట్ల స్వర్ణాల చెరువు
రొట్టె మనిషి ఆకలి తీరుస్తుంది. అదే రొట్టె ఆశలు, ఆశయాలను కూడా తీరుస్తోంది. కులమతాల గోడలను బద్దలు కొడుతూ, నమ్మకమే మతంగా నెల్లూరు నగరానికి శివారులోని బారాషాహీ దర్గా సమీపంలోని దర్గామిట్ట వద్ద ఉన్న స్వర్ణాల చెరువు వద్ద శుక్రవారం ఐదు రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ప్రారంభమైంది. శనివారం ఉదయం నాటికి ఇసుక వేస్తే రాలనంతగా యాత్రికులు తరలివచ్చారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా, ఎస్పీ డాక్టర్ అనిత వేజెండ్ల ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి , వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ అజీజ్,మేయర్ సుజాత,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,ఎస్పీ అజితా వేజెండ్ల,కలెక్టర్ హిమాన్షు శుక్లా ,కమీషనర్ నందన్,టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ,దర్గా చైర్మన్ మునీర్ లతో కలిసి ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు రొట్టెల పండుగకు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు.
నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న 'బారా షహీద్ దర్గా' వేదికగా ఈ ఉత్సవం ఏటా మొహర్రం మాసంలో (ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం) ఐదు రోజుల పాటు ఈ పండుగ అత్యంత వైభవంగా సాగుతుంది.
పండుగలో ప్రధాన ఘట్టాలు..
గంథోత్సవంతో ఈ రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది
గంథం ఊరేగింపు జరిగిన శనివారం నాటికి లక్షలాది మంది యాత్రికుల తరలివచ్చారు.
ఆదివారం ప్రధాన రొట్టెల పండుగ ఉత్సవం జరుగుతుంది. ఇది కీలక ఘట్టం
సోమవారం ఈ ఉత్సవం ముగుస్తుంది.
దాదాపు 18వ శతాబ్దంలో ఆర్కాట్ నవాబ్ కాలంలో రొట్టెల పంపిణీ వెనుక ఉన్న కథ ఇది. అప్పుడే ఈ పండుగకు పునాది పడింది. కాలక్రమంలో ఇది రొట్టెల పండుగగా మారడానికి దారితీసిన విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి.
ఒకరి నమ్మకం, మరొకరు ఆశతో ముడిపడి ఉన్న ఈ రెట్టెల మార్పిడి వెనుక దాగి ఉన్న చరిత్రను ఈ వీడియోలో చూడండి.
Next Story


