
చిత్తూరు మామిడి బెల్ట్ లో హార్ముజ్ జలసంధి బంద్ ప్రకంపనలు
మామిడి గుజ్జు ఎగుమతి ఆగింది, మామిడి రైతు గుండె జారింది.
ఇజ్రేల్, అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రభావం చిత్తూరు జిల్లా మామిడి రైతులకు బలంగా పడుతూ ఉంది. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడింది. ఈ జలసంధి చిత్తూరు జిల్లా మధ్యదూరం కొన్నివేల కిలో మీటర్లున్నా యుద్దం సెగ మామిడి గుజు పరిశ్రమల మీద, తద్వారా మామిడి రైతుల మీద పడుతూ ఉంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్ద మొత్తంలో గల్ఫ్ దేశాలకు మామిడి గుజ్జు ఎగమతి అవుతంది. ఈ దేశాలను చేరుకోవాలంటే హార్ముజ్ జలసంధి గుండానే నౌకలు ప్రయాణంచాలి యుద్దం కారణంగా ఎగమతి అగిపోయింది. ఇప్పటికే ఎగమతి అవుతూ ఉన్న గుజ్జు కంటైనర్లు మార్గమధ్యంలోని ఓడరేవుల్లో ఆగిపోయాయి.
సముద్రంలో పరిస్థితి అలా ఉంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభం కాబోతోంది. గత ఏడాది మాదిరి కాకుండా ఈ సంవత్సం ముందస్తు కొనుగోలు సన్నాహాలు ప్రారంభం కాకపోవడం రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం గుజ్జు తయారీకి కేంద్రం గ్యారెంటీ ఇస్తేనే మామిడి కొనుగోలు చేస్తామని ఆ గుజ్జు పరిశ్రమల యజమానులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో బెంగళూరు (తోతాపురి, అంటుమామిడి) కాయలు ప్రాసెస్ చేస్తారు. ఎందుకంటే ఈ కాయ గట్టిగానే కాదు. తోలు కూడా మందంగా ఉంటుంది. ఈ రకం కాయలు పండించడానికి రైతులు ఆసక్తి చూపిస్తారు. కిందటి ఏడాది ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినా నష్టపోయామని, ఈ ఏడాది ఎలా చేస్తారో అని రైతులు ఢీలా పడుతున్నారు. ఇంతలో యుద్ధం వచ్చిపడిందని వారు ఆందోళన చెందుతున్నారు.
గుజ్జుపై యుద్ధ ప్రభావం..
గల్ఫ్ తర్వాత చిత్తురు మామిడి గుజ్జకు యూరోపియన్ దేశాలు పెద్ద మార్కెట్. అయితే, యుద్ధం కారణంగా ఎగుమతులకు తీవ్ర ఆటకం ఏర్పడింది. దీంతో 1.5 లక్షల టన్నుల వరకు మామిడి గుజ్జు గోదాముల్లో మగ్గుతోంది. 50 లక్షల టన్నులు కొనుగోలుకు ఆరు నెలల కాలానికి యూరోపియన్ దేశాల ప్రతినిధులు కాంట్రాక్టు కుదుర్చుకున్నా, ఇరాన్ యుద్ధ మేఘాలు ప్రతిబంధకంగా మారాయి. ఈ ఏడాది ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల మామిడి గుజ్జు పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో పడిందని పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు గోవర్ధనబాబీ అసహాయత వ్యక్తం చేశారు.
"ప్రధాన ఎక్స్ పోర్టర్ కువైట్, ఒమన్ దేశాలు ముందుకు రాకవపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది" అని బాబీ వివరించారు.
"దీనివల్ల మామిడి గుజ్జు కంటైనర్లు రవాణా చేయడానికి ఆటంకం ఏర్పడింది" గోవర్ధన్ బాబి పరిస్థితి వివరించారు. అరబ్, యూరోపియన్ దేశాల ఆర్డర్ల మేరకు చెన్నై మీదుగా కంటైనర్ ప్రయాణించాలంటే ఖర్చు పెరిగిపోయింది. గతంలో రష్యా, యుక్రెయిన్ యుద్ధం బాగా నష్టం తెచ్చింది. అపుడు ఎర్రసముద్రం మీదుగా ఓ కంటైనర్ తీసుకువెళ్లాలంటే వెయ్యి డాలర్లు అయ్యేది. ఇప్పుడు శ్రీలంక మీదుగా అనేక దేశాలు చుట్టుకుని వెళ్లడం వల్ల ఆ భారం ఐదు వేల నుంచి 6000 డాలర్లకు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 500 నుంచి 600. శాతం భారం పెరిగింది. ఆ యుద్దం పలుచబడటంతో పరిస్థతి కాస్త అనుకూలించిందనుకుంటున్న సమయంలో మళ్లీ అమెరికా, ఇజ్రేల్-ఇరాన్ యుద్దం మొదలయింది. హార్ముజ్ మూత పడింది. కంటైనర్ల షిప్పింగ్ ఆగిపోయింది,” అని గోవర్ధన్ బాబి విశ్లేషించారు.
కేంద్రం రుణం గ్యారంటీ ఇస్తేనే... :
"కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోకుంటే, ఈ సంవత్సరం గుజ్జు ప్రాసెస్ చేయడం కష్టమే. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చిన Emergency Credit Line Guarantee Scheme (ECLGS) 100 శాతం గ్యారంటీ ఇవ్వాలి" అని ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ ఛైర్మన్ (All India food processor association- Aifpa) గోవర్ధన్ బాబీ కోరారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 4.13 లక్షల హెక్టర్లలో మామిడి సాగవుతుంటే, సగటున 43 లక్షలు టన్నుల దిగుబడి వస్తుంది. చిత్తూరు జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో సాగు 5.60 లక్షల టన్నుల దిగుబడి. వస్తోంది. రైతులు ఫ్యాక్టరీలకు తరలించడం, మార్కెట్ యార్డులు, లేదా ర్యాంపులకు తరలించడానికి ఆసక్తి చూపిస్తారు. ఫ్యాక్టరీలకు తరలించడం వల్ల కాస్త అయినా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. చిత్తూరు జిల్లాలో 39 మామిడి ప్రాసెస్ యూనిట్లు దీనికోసం ఏర్పాటు చేశారు.
"గత ఏడాది మామిడి సీజన్ లో ఉత్పత్తి చేసిన 1.50 లక్షల గుజ్జు నిలిచిపోయింది. హార్ముజ్ జలసంధి మూతవేయడం వల్ల యూరప్ దేశాలకు ఎగుమతికి ఆస్కారం లేని స్థితిలో ఉన్నామని గోవర్ధన్ బాబీ చెప్పారు.
కేంద్రం స్పందించాలి..
"ప్రపంచ దేశాలపై ఇరాన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. అందులో మామిడి తోటలు, గుజ్జు పరిశ్రమలపై తీవ్రంగా ఉంది. ఈ సంవత్సరం గుజ్జు పరిశ్రమల మనుగడకు కోవిడ్ తరహా విధానంతో కేంద్ర ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలు బ్యాంకుల నుంచి రుణ అందించాలి" అని బాబీ కోరారు. ఆ శాఖల మంత్రులకు వినతిపత్రాలు కూడా సమర్పిస్తున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మామిడి గుజ్జు పరిశ్రమలు తద్వారా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ స్పందన అవసరమని గుజ్జు పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ సమయంలో ప్రధానంగా పండ్ల ఆధారిత పరిశ్రమల మనుగడకు కేంద్రం గుజ్జు పరిశ్రమలకు (Emergency Credit Line Guarantee Scheme :ECLGS) తో అండగా నిలిచిన విషయాన్ని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ (సౌత్ జోన్ )చైర్మన్ కట్టమంచి గోవర్ధనబాబీ ’ఫెడరల్ తెలంగాణ’కు గుర్తు చేశారు.
ఇరాన్ యుద్ధం ప్రారంభం అయ్యే నాటికి అతికష్టం మీద గత ఏడాది 70 వేల టన్నులు కంటెయినర్లలో పంపగలిగాం. ఇంకా రెండు లక్షల టన్నులు మిగిలే ఉన్నాయి" అని బాబీ వివరించారు.
పల్ప్ తయారీ యూనిట్ల కథనాల ప్రకారం సుమారు 3 లక్షల టన్నుల గుజ్జు ఇపుడు మార్గమధ్యంలో ఓడరేవుల్లో ఆగిపోయింది. అంతేకాదు,ఓడరేవులు కంటైనర్ కంపెనీల నుంచి వార్ రిస్క్ సర్ చార్జ్ ని వసులు చేస్తున్నాయి. కంటైనర్ కు 2000 వేల అమెరికన్ డాలర్ల దాకా వసూలు చేస్తున్నాయని, దీనిని గుజ్జు తయారీ దారులే భరించాలని కంటైనర్ కంపెనీలు చెబుతూ ఉండటంతో సంక్షోభం మొదలయింది. ఇంత ఖర్చును భరించలేమని గుజ్జు తయారీ దారులు చెబుతున్నారు.
“ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు మామిడి గుజ్జు కంటైనర్ లను పంపించాం. యుద్ధం ప్రారంభం గానే కొన్ని రేవుల వద్ద ఓడలు ఆగిపోయాయి. వార్ రిస్క్ సర్ చార్జి పేరిట కంటైనర్ కు సుమారు 2000 డాలర్లు వసూలు చేస్తున్నారు.. డామరేజ్ చార్జి కూడా విధిస్తున్నారు,” అని తవణంపల్లి మండలంలోని మామిడి గుజ్జు పరిశ్రమ పరిశ్రమ యజమాని ఎస్ రమేష్ చెప్పారు.
చిత్తూరు జిల్లాలోని 1.10 లక్షల హెక్టార్లలోని మామిడి తోటల నుంచి వచ్చే దిగుబడిలో 75% తోతాపురి రకం మామిడికాయలను 47 గుజ్జు పరిశ్రమలకు తీసుకువస్తారు. ఏటా సీజన్లో ఏడు లక్షల టన్నుల మామిడి కాయలను ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం ఈ పరిశ్రమలకు ఉంది. ప్రస్తుతం దీన్నుంచి 3 నుంచి 4 నాలుగులక్షల టన్నుల మామిడి గుజుతయారవుతుంది. ఇందులో 70 నుంచి 80 శాతం దాకా ఎగుమతి అవుతుంది. గత ఏడాది సంక్షోభం వల్ల మిగిలిపోయిన గుజ్జును తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నామని, అయితే, ఇరాన్ యుద్దం దెబ్బతీస్తున్నదని గుజ్జు తయారీ దారులు చెబుతున్నారు.
యుక్రెయిన్ నుంచి గల్ఫ్ దాకా సాగుతున్న యుద్ధవాతావరణం వల్ల ఎగుమతుల ఆగిపోతున్నాయని బాబీ చెప్పురు. కొద్ది రోజులు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకల మీద హౌతీ దాడుల వల్ల ఎగమతులు అగిపోయాయి. ఇపుడు మళ్లీ హార్ముజ్ సంక్షోభం మొదయింది. వీటన్నింటి వల్ల గుజ్జు పరిశ్రమలకు సుమారు రు. 750 నుంచి రు.800 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని ఆయన ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. యుద్ధవాతావరణంలో విదేశీబయ్యర్లనుంచి చెల్పింపు జాప్యం కావడంకూడా పరిశ్రమలు పనిచేయలేకపోతున్నాయని బాబీ చెప్పారు.
“చిత్తూరు జిల్లాలో ప్రతి మామిడి రైతు ఈ గుజ్జు పరిశ్రమల మీద ఆధారపడి ఉంటాడు. ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేయకపోతే వాళ్లుతోతాపురి రకం మామిడి పళ్లు కొనడం మానేస్తారు.రైతులకు ఇద దుర్వార్త అని గల్లావాళ్లవూరుకు చెందిన మామిడి రైతుల ఆనందనాయుడు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో 2026 సీజన్ కు సంబంధించి మామిడి కాయల కొనుగోలుకు జిల్లా అధికారులు ఎలాంటి సన్నాహాలు ప్రారంభించలేదు. యూరోపియన్ దేశాల్లో అశాంతి, ఇరాన్ యుద్ద వాతావరణం నేపథ్యంలో స్తబ్దతగా వ్యవహరిస్తున్నారు. ఈపరిస్థితి మీద వ్యాఖ్యానించేందుకు ప్రభుత్వాధికారులు విముఖం చూపారు.
Next Story

