బీజేపీ జెండా దిమ్మెలకు క్యూఆర్ కోడ్
x

బీజేపీ జెండా దిమ్మెలకు క్యూఆర్ కోడ్

కేంద్ర పథకాల ప్రచారంతో ముందుకు సాగే వ్యూహంలో భాగంగా మన ఊరు-మన జెండా కార్యక్రమం.


మన ఊరు-మన జెండా కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో బీజేపీ జెండా స్తూపాలు నిర్మించి జియో ట్యాగింగ్ తో పాటు క్యూ ఆర్ కోడ్ ను అమర్చే కార్యక్రమాన్ని బీజేపీ వారు చేపట్టారు. కేంద్ర పథకాల గురించి తెలుసుకునేందుకు క్యూ ఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. కార్యక్రమం ఏప్రిల్ 6 నుంచి మొదలైంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కేంద్ర పథకాల గురించి తెలుస్తుంది. బీజేపీ జెండా దిమ్మెలకే క్యూఆర్ కోడ్ వేయించడం వినూత్న పద్ధతిగా కనిపిస్తోంది.

కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ తన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకు బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్నారు. అయినా బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు చర్చకు దారితీస్తున్నాయి.


ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా బీజేపీ కార్యాచరణ చేపట్టి సభలు, సమావేశాలు పెట్టి బీజేపీ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ దీనిపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో మాధవ్ ను వెనక్కి తగ్గేలా చేశాయి. ఒక వైపు చంద్రబాబుతో సఖ్యతగా ఉంటూనే బీజేపీ క్యాడర్ లో ధైర్యం నింపి ముందుకు అడుగులు వేయించే పనిలో మాధవ్ ఉన్నారు.

బీజేపీలో ప్రస్తుతం గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు ఎలా చెబితే అలా చేసే వారు ఉన్నారు. ఉదాహరణకు సుజనా చౌదరి వంటి వారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మాధవ్ ఏపీలో బీజేపీ కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా క్యాడర్ లో మనో ధైర్యాన్ని నింపే పనిలో ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారు టీడీపీ ఇన్ చార్జ్ ల ముందు డమ్మీలుగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

అధికారుల్లో రెండు భయాలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర పెద్దల దృష్టికి తాము వారికి కావాల్సిన పనులు చేయడం లేదని ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఏమిటనేది ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ ల్లో ఉంది. అలా అని వారు అడిగిన వన్నీ చేసుకుంటూ పోతే చంద్రబాబు నుంచి వచ్చే వత్తిడిని ఎలా అధిగమించాలనే ఆలోచన కూడా వారిలో ఉంది. ఈ పరిస్థితులు ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఏర్పడ్డాయి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఆలోచనతో ఏప్రిల్ 6, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం గ్రామాల్లో మంచి స్పందన అందుకుంటోంది. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ ఆరు నెలల కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో బీజేపీ జెండా స్తూపాలు నిర్మించి, జియో ట్యాగింగ్‌తో పాటు QR కోడ్ అమర్చి, కేంద్ర పథకాల అమలు, గ్రామాభివృద్ధి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఒకరు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఈ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర పథకాల అమలు గురించి ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ హౌసింగ్, తాగునీరు సరఫరా, ఎల్‌పీజీ సప్లై, ఉచిత రేషన్, ఆరోగ్య సేవలు వంటి కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరువ చేసేందుకు ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామానికి బీజేపీ కార్యకర్తలు వెళ్తున్నారు. వీరి కార్యక్రమాలకు పెద్ద స్పందన లేదు. అయినా ముందుకు అడుగులు వేస్తున్నారు. వీరి యాక్టివిటీపై ఒక ప్రత్యేక కథనం పత్రికా భాషలో విశ్లేషణాత్మకంగా, పరిశీలనాత్మకంగా పరిశీలించి అందించ గలరు?

బీజేపీ పెద్దలు సోము వీర్రాజు, ఎంపీ పురందేశ్వరి వంటి వారు మాధవ్ కు పెద్దగా సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా మాధవ్ అడుగులు వేస్తున్నారు. కూటమిలో బీజేపీ ఉండటం, కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటం అనేవి మాధవ్ కు కలిసొచ్చిన అంశాలు.

టీటీడీ నీడలో ఎంత కాలం బీజేపీ ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లు బీజేపీ వారిని అణచి వేస్తున్నారనే చర్చ కూడా ఉంది. దీనిపై పెదవి విప్పేందుకు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తో సహా బీజేపీ పెద్దలు పెద్దగా సాహసం చేయడం లేదు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సందర్భం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం వారిని సెటైరికల్ గా విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ముగింపు సందర్భంగా జరిగిన కల్చరల్ యాక్టివిటీలోనూ మేము కూటమిలో భాగస్వాములం, మమ్ములను తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం లేదు. అంటూ లోకేష్ మీద సెటైర్లు వేశారు.

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుకు వీరిలో చాలా మంది సన్నిహితులు కావడంతో మాధవ్ కూడా వారిని మందలించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాగే ఉంటే ఏపీలో బీజేపీ పెరుగుదల అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదు. కూటమి అధికారంలో ఉన్నన్ని రోజులు పవర్ ను ఎంజాయ్ చేయడం తప్ప బీజేపీ బలం పెరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read More
Next Story