
ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
నటి త్రిష పై నోరు జారిన ఫలితం
కావేరీ జలాల వివాదంపై జరిగిన రైతుల ఆందోళనలో సినీ నటి త్రిషా కృష్ణన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను తంజావూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళలను అవమానించేలా, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీవీకే సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంజావూర్ తూర్పు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఉదయనిధి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా, అక్కడ డీఎంకే కార్యకర్తలు నిరసనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
కావేరీ సమస్యపై దక్షిణ తమిళనాడులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా ఖండిస్తూ, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించలేమని అన్నారు.
ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలై, అధికార–ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కాయి.

