
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డులు.. ఏఐ తేల్చిన లెక్కలు..
శ్రీవారిని దర్శించుకున్న 95.5 వేల మంది యాత్రికులు. తరగని హుండీ ఆదాయం.
తిరుమల శ్రీవారి క్షేత్రంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరింది. లడ్డూల విక్రయాలు కూడా ఆల్ టైం రికార్డు దాటాయి. ఆర్టిటిఫియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఫేస్ ఐడింటిఫికేషన్ ఆధారంగా యాత్రికుల సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
"తిరుమలలో సోమవారం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని 95,498 మంది దర్శించుకున్నారు" అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. యాత్రికులు శ్రీవారి హుండీకి సమర్పించిన కానుకలతో టీటీడీకి 5.63 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 4.34 లక్షల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు యాత్రికులు కొనుగోలు చేయడం అనేది ఓ రికార్డు.
తిరుమలకు సాధారణంగా వారాంతంలో యాత్రికుల రద్దీ సర్వసాధారణంగా ఉంటుంది. వేసవి సెలవులు ముగిసిన, విద్య సంవత్సరం ప్రారంభమైన తరువాత కూడా శుక్రవారం (26వ తేదీ) నుంచి ఆ సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. శనివారం నుంచి ఆదివారం వరకు తిరుమల కొండ యాత్రికులతో నిండిపోయింది.
పరిస్థితిని అంచనా వేసిన టీటీడీ "వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలు రద్దు చేసింది" సాధారణ రోజుల్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అరుదైన విషయం. అయినా, కొండపై తగ్గని రద్దీ తగ్గలేదు.
"తిరుమలలో 21 కంపార్టమెంట్లలో ఉన్న టోకెన్లు లేని యాత్రికులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి పది నుంచి 12 గంటల సమయం పడుతుంది" అని టీటీడీ ప్రకటించింది.
సూపర్ పీక్ నెల
తిరుమల చరిత్రలో ఈ సంవత్సరం మే నెల "సూపర్ పీక్" రికార్డు నమోదైంది. మూడు ఆల్ టైం రికార్డులు నమోదయ్యాయి. వేసవి సెలవులు కావడం వల్ల 25,46,160 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్యరెండు లక్షల మంది ఎక్కవ.
శ్రీవారి హుండీ ద్వారా 120. 28 కోట్లు ఆదాయం లభించింది. వేసవి రద్దీ లేని రోజుల్లో కూడా సగటున రోజుకు 90 వేల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకోవడం, రోజుకు నాలుగు లక్షల లడ్డూలు విక్రయాలు జరగడం అనేది ఈ ఏడాదిలో ప్రత్యేకత.
బ్రహ్మోత్సవాలకు తీసిపోకుండా..
తిరుమలలో సాధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మాడవీధుల్లో ఉభయ దేవేరులతో శ్రీమలయప్ప స్వామి వారి పల్లకీ సేవను చూసేందుకు యాత్రికులు ఇష్టపడతారు. అదే సమయంలో మూలమూర్తి దర్శనానికి కూడా ఏమాత్రం యాత్రికుల సంఖ్య తక్కువగా ఉండదు. కానీ, వారాంతం (శని, ఆదివారం) కాకుండా సాధారణ రోజు అయిన సోమవారం, మంగళవారాల్లో రికార్డు స్థాయిలో 95 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారనేది ప్రత్యేక వార్త. అంతేకాకుండా, వారాంతంలో శ్రీవారి హుండీకి సగటున 4.5 కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు ఆదాయం రావడం సర్వసాధారణంగా మారింది.
శ్రీవారి హుండీకి శని, ఆదివారాల్లో హుండీ ఆదాయం ఐదు కోట్ల రూపాయలు దాటడం అనేది కామన్.
2023 జనవరి ఒకటో తేదీ శ్రీవారి హుండీకి 6.73 కోట్ల రూపాయల ఆదాయం లభించడం టీటీడీ చరిత్రలో ఓ రికార్డు. అలాంటిది వర్కింగ్ డే కాకుండా, సాధారణ రోజుగా పరిగణించే సోమవారం (29వ తేదీ) 5.63 కోట్లు ఆదాయం లభించడం అనేది ప్రత్యకంగా నిలిచిందని టీటీడీ అధికారవర్గాల సమాచారం.
తిరుమలలోని తరగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా 2.58 లక్షల మందికి అన్నప్రసాదాలు వడ్డించినట్లు టీటీడీ రికార్డుల్లో నమోదు కావడం కూడా ఓ ప్రత్యేకత. ఇవన్నీ ఏఐ ఫెస్ ఐడెంటిఫికేషన్ తో టీటీడీ రికార్డుల్లో వివరాలు నమోదయ్యాయి.
Next Story

