
దక్షిణాది రాష్ట్రాలపై ‘ఎల్ నినో’ ప్రభావం పడిందా?
క్రమంగా పెరుగుతున్న బియ్యం ధరలు
తమిళనాడు ప్రజలు ప్రధాన ఆహారంగా వినియోగించేది బియ్యం. ఇక్కడి తలసరి వినియోగం జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల నాణ్యమైన, ప్రాధాన్యత కలిగిన రకాల బియ్యం చిల్లర ధరలు విపరీతంగా పెరగడంతో ఈ రాష్ట్రాల్లో ఆహార ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరింది.
సాధారణంగా బియ్యం ధర ఆగష్టులో కిలోకి రూ. 50 నుంచి 60 వరకూ ఉండగా, ప్రస్తుతం అది 70 నుంచి 90 కి పెరగింది. కొన్ని రిటైల్ ధరల్లో ఇది రూ. 90 పైనే ఉంది.
జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) ప్రకారం.. జాతీయ చిల్లర ద్రవ్యోల్బణం(సీపీఐ) ఆగష్టులో 4.83 శాతం నుంచి సెప్టెంబర్ లో 5.54 పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 5.97 శాతం నుంచి 7.74 శాతానికి పెరిగింది.
తమిళనాడులో గ్రామీణ పట్టణ సంయుక్త ద్రవ్యోల్బణం ఆగష్టులో 5.91 శాతం నుంచి సెప్టెంబర్ లో 6.81 శాతానికి పెరిగింది. ఇది రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. రాష్ట్రంలో ఆహార ద్రవ్యోల్బణం 10.62 శాతానికి పెరిగింది. ఇది కూడా రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. ఏపీ మాత్రమే 10.18 శాతంతో మాత్రమే రెండంకెల సంఖ్యలో ఉన్న ఏకైక రాష్ట్రం.
జాతీయ స్థాయిలో బియ్యం ధరలు ఏడాదివారిగా సుమారు 8.25 శాతం పెరిగాయి. తమిళనాడులో ఈ పెరుగుదల 9.14 శాతంగా ఉంది.
కొరత...
తమిళనాడులో మొత్తం మీద బియ్యం కొరత లేదు. కానీ కొన్ని రకాల సరఫరా మాత్రమే జరుగుతుందని రైస్ మిల్ యజమానులు చెబుతున్నారు. అక్షయ, అమ్మన్ సోనా, ఆర్ఎన్ఆర్ వంటి ప్రసిద్ధ రకాలు. వీటిని రాష్ట్రంలో అంతబాగా పండించరు. వీటిని ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటారు.
రైస్ మిల్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన దినేశ్ కుమార్ మాట్లాడుతూ.. సన్నబియ్యం డిమాండ్ తో పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నామని చెప్పారు. రామనాథపురం, తేనీ వంటి కొన్ని జిల్లాల్లో ఈ రకాల సాగు పరిమితంగా ఉంది. స్థానికంగా మెట్టా రకమే ఎక్కువగా పండిస్తున్నారు. ఇవి కాస్త లావుగా ఉంటాయి.
వర్షపాత లోటు..
నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం లోటు ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఏపీ 29 శాతం, తెలంగాణలో 18 శాతం, కర్ణాటక లో 24 నుంచి 30 శాతం వరకూ లోటు వర్షపాతం ఉంది. దీని ప్రభావం వరి ఉత్పత్తిపై పడింది.
తమిళనాడు రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కే. రాజేంద్రన్ మాట్లాడుతూ.. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు 20 నుంచి 40 టన్నుల వరిని అందుకునే మిల్లులు ఇప్పుడు వారానికి రెండు లేదా మూడు రోజుల అవి అందుకున్నాయని చెప్పారు.
మిల్లుల నుంచి సన్న రకాలను వ్యాపారులకు కిలోకు రూ. 60 నుంచి 75 చొప్పున, ప్రీమియం అక్షయను కిలోకు సుమారు రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. చెన్నై రిటైల్ మార్కెట్ లో ధరలు కిలోకు రూ. 90 వరకూ ఉన్నాయి. వ్యాపారి టీ. సమీనాథన్ మాట్లాడుతూ.. కన్నడ ఆర్ఎన్ఆర్ ధర ఇప్పుడు 75 నుంచి 80 గా ఉందని, వెల్ల పొన్ని దర సుమారు రూ. 70 నుంచి 90 కి పెరుగుతోందని, బీపీటీ పొన్ని ధర రూ. 60 నుంచి 70- 75 చేరిందని తెలిపారు.
ధరల పెరుగుదల..
పరిశ్రమల నివేదికల ప్రకారం.. ఇటీవల రోజుల్లో 26 కిలోల అతి సన్నని బియ్యం బస్తాల ధర రూ. 230 వరకూ పెరిగి రూ. 1950 కి చేరాయి. పలు రకాల సన్న రకాల బియ్యం పై రూ. 5 నుంచి 15 వరకూ పెరిగాయి.
వ్యాపారులు, మిల్లు యజమానులు పేర్కొన్న అంశాలలో పెరిగిన కనీస మద్దతు ధర (సెప్టెంబర్ 1 నుంచి నాణ్యమైన వరికి క్వింటాళ్ రూ. 2750, సాధారణ రకాలకు రూ. 2,600) పెరిగిన ఎరువులు, ఇంధన ధరలు, కార్మికుల కొరత, చెన్నై, మదురై, కోయంబత్తూర్ వంటి నగరాల్లో నాణ్యమైన బియ్యానికి బలమైన పట్టణ డిమాండ్, సాంబ పంటకోతకు ముందు ఉండే కాలానుగుణ విరామం వంటివి ఉన్నాయి.
సన్నాలు...
కావేరీ డెల్టాలోని రైతులతో సహ తమిళనాడులోని చాలామంది రైతులు ముతక వరిని పండిస్తారు. ఇది సన్నాలతో పోలిస్తే సుమారు 25 శాతం అధిక దిగుబడిని ఇస్తుంది. ప్రజా పంపిణీ కోసం ప్రభుత్వం వీటినే సేకరిస్తుంది. సన్న వరి ధాన్యంపై క్వింటాల్ కు కేవలం వంద నుంచి రెండు వందల అధిక ధర మాత్రమే ఉంది. ఇది పరిమిత ప్రొత్సాహాన్ని మాత్రమే అందిస్తుంది. వినియోగదారుల కోసం మెట్టా బియ్యాన్ని కొనడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇది ప్రధానంగా రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు.
పక్క రాష్ట్రాలలో కిలోకు అదనంగా చెల్లించే రూ. 5 తో ప్రభుత్వం సన్నాలను అధికంగా సేకరిస్తున్నాయి. అలాగే స్వల్పకాలిక, లాభదాయకమైన సన్నాలపై పరిశోధన చేయడం వంటివి కాలక్రమేణా స్థానిక ఉత్పత్తిని పెంచగలవని మిల్లు యజమానులు సూచించారు. ఒకవేళ దక్షిణాది సరఫరాలు పరిమితంగా ఉంటే, మధ్యప్రదేశ్ లేదా పంజాబ్ వంటి ఉత్తరాది వనరులను ఉపయోగించుకోవచ్చు. ధాన్యం నాణ్యత కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, అదనపు రవాణా ఖర్చు కిలోకు రూ. 2 నుంచి 3 మాత్రమే ఉంటుందని అంచనా.
ఎల్ నినో ప్రభావం...
భారత్ దేశవ్యాప్తంగా వరిసాగు ప్రధానంగా రుతుపవన వర్షపాతం, నీటిపారుదలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణంలోని వైవిధ్యాలు ఉత్పత్తిని తీవ్రంగా తగ్గించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకారం.. వానాకాలం వరిసాగు విస్తీర్ణం 449.18 లక్ష్లల హెక్టార్ల నుంచి 433.62 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇది 3.46 శాతం తగ్గుదల.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో సహ కీలక ఉత్పాదక ప్రాంతాలలో ఎల్ నినో పరిస్థితులు, నైరుతి రుతుపవన వర్షాలు లోపించడం వల్ల ఈ కొరత ఏర్పడింది. జలాశయాలు, నదులలో నీటిమట్టాలు తగ్గుదల వల్ల లోతైన బోర్ వేల్ లపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. దీనివల్ల ఎరువులు, డీజిల్, పురుగుమందులు, కార్మికుల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి.
ఐఎండీ డేటా ప్రకారం.. దేశంలోని సుమారు 42 శాతం ప్రాంతంలో వర్షపాతం లోటుగా ఉండటంతో నైరుతి రుతుపవనాల దీర్ఘకాలం సగటు కంటే 12.6 నుంచి 13 శాతం తక్కువగా ఉన్నాయి. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 2,440 ఉండగా, బహిరంగ మార్కెట్ ధరలు క్వింటాల్ కు సుమారు రూ. 4 వేలకు చేరుకున్నాయి. గత నెలలో జాతీయ బియ్యం ధరలు 5.59 శాతం పెరిగాయి. ఏడాది క్రితంతో పోలీస్తే 52.4 శాతం అధికంగా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వంటి వినియోగ రాష్ట్రాలకు వరి, బియ్యం రాక తగ్గడంతో మిల్లుల నిల్వలు తగ్గిపోయాయి. మరోవైపు దీపావళి పండుగల సమయంలో పెరిగిన డిమాండ్ మరింత ఒత్తిడిని పెంచింది.
నిర్దిష్ట బస్తా ధరలు ఈ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. డీలక్స్ పొన్ని(26 కేజీలు), ధర సమారు రూ. 1400 నుంచి రూ. 1800 కి పెరిగింది. పొన్ని(26 కేజీలు) ధర రూ. 1600 నుంచి 1950 కి పెరిగింది. ఇడ్లీ బియ్యం (26 కేజీలు) ధర రూ. 900 నుంచి 1200 కి పెరిగింది. బాస్మతి బియ్యం(30 కేజీ) ధర రూ. 3,300 నుంచి 3,600 కి పెరిగింది.
పంట కోత ధరలు...
జనవరి - ఫిబ్రవరి లో కొత్త పంట దిగుబడి బలపడే వరకూ, రాబోయే ఒకటి రెండు నెలల పాటు నాణ్యమైన రకాల ధరలు అధికంగానే ఉంటాయని పరిశ్రమ, వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.తక్కువ వినియోగం గల స్వల్పకాలిక పంటలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల వైపు మళ్లడాన్ని ప్రొత్సహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. సరఫరాలను స్థిరీకరించడానికి అవసరమైతే బహిరంగ మార్కెట్ అమ్మకాలు లేదా ఎగుమతి చర్యలను కూడా పరిగణించవచ్చని తెలిపింది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర రాష్ట్రాల నుంచి సన్నబియ్యాన్ని సేకరించి, సహకార దుకాణాల ద్వారా కిలోకు రూ. 40 నుంచి 50 చొప్పున విక్రయించే ప్రణాళికను తమిళనాడు ప్రభుత్వం పరిశీలిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో లభ్యత, పరిమాణాలపై సమాచారం సేకరిస్తున్నట్లు సహకార, ఆహార శాఖ అధికారి తెలిపారు. కనీసం లక్ష టన్నుల బియ్యాన్ని సేకరించగలిగితే, సహకార లేఅవుట్ లో ఆ బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలను సమీక్షించేందుకు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పి. వేంకటరమణన్ అధ్యక్షతన సచివాలయంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలనలోనే ఉంది. అమలు కాలేదు.
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ దుకాణాలు ముతక బియ్యాన్ని సరఫరా చేస్తూనే ఉన్నాయి. పరిశ్రమ ప్రతినిధుల ప్రకారం.. జనవరిలో సాంబా పంట కోత తరువాత నాణ్యమైన బియ్యం సరఫరా మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో ధరలు అధికంగానే ఉన్నాయి.
Next Story

