EOS-05: రెకెట్ తెల్లవారుజామునే ఎందుకు లాంచ్ చేశారు.?
ప్రత్యేక రీజన్ ఉందంటున్న SHAR శాస్త్రవేత్తలు.. వీడియో స్టోరీ.
శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటల సమయం. వర్షం కురుస్తోంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. నిప్పులు చెందుతూ రాకెట్ నింగివైపు దూసుకుపోయే సమయం ఆసన్నమైంది.
షార్ కంట్రోల్ రూం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
5.. 4.. 3..2..1.. లిఫ్ట్ ఆఫ్. రాకెట్ నింగిలోకి దూసుకుని పోయింది.
శ్రీహరికోట నుంచి రోదసిలోకి దూసుకెళ్లే రాకెట్లను చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఒక అనుమానం వచ్చిందా? ఇస్రో ప్రయోగాలు చాలా వరకు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున 2:00, 3:00 గంటల సమయంలోనే ఎందుకు జరుగుతాయి?
పగటిపూట హాయిగా వెలుతురులో ప్రయోగించవచ్చు కదా? చీకట్లో ప్రయోగించడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగేదా లేక దీని వెనుక పెద్ద ఫిజిక్స్, సైన్స్ దాగి ఉన్నాయా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పే వీడియో కధనం ఇది.
మొదటగా, రాకెట్ ప్రయోగ సమయాన్ని సైంటిస్టులు వాళ్లకు నచ్చినట్లు రాత్రి లేదా పగలు అని ఎంచుకోరు. దీనిని శాస్త్రీయంగా 'లాంచ్ విండో' (Launch Window) అంటారు. రాకెట్ మోసుకెళ్లే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ఒక నిర్దిష్టమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టాలి.
భూమి తన అక్షం చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అంతరిక్షంలో మనం చేరుకోవాల్సిన టార్గెట్ పాయింట్ ముందుకు సరిగ్గా మన లాంచ్ ప్యాడ్ (శ్రీహరికోట) ఏ సమయానికి వస్తుందో, ఆ సమయాన్నే ప్రయోగానికి ఎంచుకుంటారు. ఆ క్షణం రాత్రి కావచ్చు లేదా పగలు కావచ్చు!
2) సూర్యకాంతి, సోలార్ పవర్.. శాటిలైట్‌కు అవసరమయ్యే విద్యుత్ శక్తి అంతా దాని సోలార్ ప్యానెల్స్ ద్వారానే లభిస్తుంది. రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో వదిలిపెట్టిన వెంటనే దానికి ఉన్న సోలార్ ప్యానెల్స్ తెరుచుకోవాలి.
ఆ సమయంలో ఉపగ్రహంపై సూర్యకాంతి సరైన కోణంలో పడాలి. ఒకవేళ ప్రయోగం పూర్తి కాగానే శాటిలైట్ భూమి నీడలోకి అంటే చీకటిలోకి వెళ్తే దానికి పవర్ అందక డివైజ్లు పనిచేయవు. అందుకే తగినంత సూర్యకాంతి పొందేలా రాత్రిపూట ఒక నిర్దిష్ట సమయంలో ప్రయోగిస్తారు.
3) అంతరిక్ష చెత్త లేదా 'స్పేస్ డెబ్రిస్'! భూమి చుట్టూ వేలాది పాత ఉపగ్రహాల శిథిలాలు తిరుగుతున్నాయి. ప్రయోగించే రాకెట్ ఈ చెత్తను ఢీకొట్టకుండా ఉండటానికి ఇస్రో రాడార్ల ద్వారా అత్యంత సురక్షితమైన సమయాన్ని లెక్కిస్తుంది.
పగటిపూట తీరప్రాంతంలో ఈదురుగాలులు, మేఘాలు... రాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న సముద్ర తీరం ఆహ్లాదంగా ఉంటుంది.
ఇదే కీలకం...
వాటన్నింటితో పాటు వాతావరణం కూడా కీలకం. శ్రీహరికోట లాంటి తీరప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతల వల్ల గాలులు, మేఘాలు, స్థానిక తుఫానులు రావచ్చు. కానీ రాత్రి లేదా తెల్లవారుజామున వాతావరణం, గాలుల తీవ్రత చాలా ప్రశాంతంగా ఉంటాయి.
శుక్రవారం వేకువజామున..
GSLV-F17 / EOS-05 మిషన్ కూడా ఇందుకే తెల్లవారుజామున 2:55 గంటల సమయాన్ని ఖరారు చేసుకుంది. ఈ EOS-05 ఉపగ్రహాన్ని భూమికి ఏకంగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియోసింక్రోనస్ ఆర్బిట్‌లో సరిగ్గా పొజిషన్ చేయడానికి ఈ తెల్లవారుజామున 2:55 గంటల సమయమే అత్యంత అనుకూలమైన 'లాంచ్ విండో' రాకెట్ ప్రయోగం వెనుక ఎంత పెద్ద సైన్స్, కచ్చితమైన గణాంకాలు దాగి ఉన్నాయి.
"అందుకే రాత్రి లేదా వేకువజామున రాకెట్లు ప్రయోగానికి అనుకూలంగా నిర్ణయిస్తాం" అని ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పష్టం చేశారు.
Next Story

