
కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ప్రాజెక్ట్ స్థలం
మేకెదాటు ప్రాజెక్ట్ పై కేంద్రం స్పష్టత
ఇతర రాష్ట్రాల అనుమతి అవసరం లేదన్న జలశక్తి శాఖ
కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు కర్ణాటకకు పొరుగు రాష్ట్రాల ముందస్తు అనుమతి తప్పనిసరి కాదని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. రాజ్యసభలో తమిళనాడు ఎంపీ డాక్టర్ అన్బుమణి రాందాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి భూషణ్ చౌదరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Next Story

