సీమ 'లీడర్ల' యుద్ధం: కుప్పంలో బాబు రూట్ మ్యాప్. పులివెందులలో జగన్ పంతం
స్థానిక సంస్థల ఎన్నికలపై రెండు పార్టీ అధినేతల ఫోకస్. దశాబ్దాల వైరానికి అసలు కారణం ఏమిటి? (వీడియో స్టోరీ)
రాష్ట్ర రాజకీయాలు ఎత్తు. రాయలసీమలోని కుప్పం, పులివెందుల రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటాయి. పరిశీలకులు కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందనే ఆసక్తి చూపిస్తారు. ఈ పరిస్థితుల్లో
"స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి. కుప్పంలో వందకు వంద శాతం క్లీన్ స్వీప్ చేయాలి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఈ అంశమై ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ వేడి పెంచింది.
"స్థానిక సంస్థల ఎన్నికలంటే పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలనేవి సాధారణంగా స్థానిక సెంటిమెంట్, వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది"
"గతంలో వైసీపీ చేసిన అరాచకాలను గుండెల్లో పెట్టుకోండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వందకు వంద శాతం క్లీన్ స్వీప్ చేయాలి. ప్రతి గ్రామంలో యూనిట్, క్లస్టర్, మండల్ ఇన్‌ఛార్జ్‌లు యాక్టివ్‌గా ఉండాలి. ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లండి. ఈసారి కుప్పంలో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకూడదు" అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన కర్తవ్యం బోధ.
రెండు రోజుల కిందట తన తండ్రి దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి జయంతి రోజు నివాళులు అర్పించడానికి వచ్చిన మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ కూడా వైసీపీ నేతలకు కూడా పులివెందుల మున్సిపాలిటీని దక్కించుకోవడంపై స్పష్టమైన సూచనలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
కుప్పంలో పాగా వేయాలని వైసీపీ ప్రయత్నాలు. పులివెందులలో వైఎస్ కుటుంబం కోటను దెబ్బతీయాలని టీడీపీ దశాబ్దాల కాలంగా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. అసలు దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి, ఆయన వారసుడిగా వచ్చిన వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్. జగన్ మధ్య రాజకీయ విరాధానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
ఈ వీడియోలో ఆ వివరాలు చూడండి
Next Story


