‘‘అదో మతోన్మాద ముఠా, హిందూ యువతులే లక్ష్యం’’
x

‘‘అదో మతోన్మాద ముఠా, హిందూ యువతులే లక్ష్యం’’

అనేక మంది బాధితులు బయటకు వసున్నారన్న నాసిక్ పోలీసులు


ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ లో హిందూ యువతులే లక్ష్యంగా సాగిన లవ్ జిహాద్, లైంగిక వేధింపులు, మతమార్పిడి కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో ఏడుగురు ముస్లిం యువకులు, ఓ యువతి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.

వీరంతా ఓ ముఠాగా ఏర్పడి పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. ఏడుగురు పురుషులు, ఒక మహిళను అరెస్టు చేయగా, ఒక మహిళా నిందితురాలు పరారీలో ఉన్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు మహిళా నిందితుల పాత్రను నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ బుధవారం వెల్లడించారు.

ప్రధాన నిందితురాలు బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆపరేషన్స్ యూనిట్ హెచ్ఆర్ హెడ్ ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి అని చెబుతూ.. బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని, నిందితులకు వత్తాసుపలికారని ఆరోపించారు. ఈ కేసులో మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ను ఏప్రిల్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని నాసిక్ కోర్టు బుధవారం రిమాండ్ విధించింది.

సమగ్ర దర్యాప్తు..

ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? విదేశాల నుంచి నిధులు అందుతున్నాయా? అనే విషయాలు దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్ఓటీ, ఏటీఎస్, ఎన్ఐఏకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. ‘‘మాకు ఆధారాలు లభించినప్పుడే ఒక అంచనాకు వస్తాము’’ అని కమిషనర్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక పురుష ఉద్యోగి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సిట్ విచారణ..

మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కు చెందిన ఏడుగురు పురుషులు, ఒక మహిళను పోలీసులు ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. నిందితులను డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్, షారుక్ షేక్ గా తేలింది.

స్పందించిన టాటాసన్స్ చైర్మన్..

తమ కంపెనీలో హిందూ యువతులకు ఎదురైన లైంగిక వేధింపులు, లవ్ జిహాద్ ఘటనపై టాటాసన్స్ చైర్మన్ స్పందించారు. ఇది ఆందోళనకరమైనవి, బాధాకరమైనవని అభివర్ణించారు. ఈ ఘటనపై టీసీఎస్ అంతర్గతంగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కేసును దర్యాప్తు జరిపేందుకు పోలీసులు మహిళా డీసీపీ, కొంతమంది మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినట్లు కర్ణిక్ తెలిపారు. వారు సిబ్బందితో మాట్లాడాక మరిన్ని ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.
Read More
Next Story