‘బీజేపీ ఉన్నంత వరకు అది జరగదు’
x

‘బీజేపీ ఉన్నంత వరకు అది జరగదు’

‘‘దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, దేశ విచ్ఛిన్నానికి పాల్పడే శక్తులకు సపోర్టు చేయడం రాహుల్, కాంగ్రెస్‌కు అలవాటై పోయింది.’’ - అమిత్ షా


కేంద్ర హోం మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు అమిత్ షా బుధవారం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై, లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్‌లను ఎవరూ రద్దు చేయలేరని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ జార్జ్‌టౌన్ యూనివర్సిటీ విద్యార్థుల సమావేశంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై షా విరుచుకుపడ్డారు.

‘‘ప్రస్తుతం భారతదేశంలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం లేదు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం పెద్దగా కనిపించడం లేదు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు గురించి మేం ఆలోచిస్తాం’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

‘అలా మాట్లాడడం రాహుల్‌కు అలవాటైంది’

దేశ విభజనకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘‘దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, దేశ విచ్ఛిన్నానికి పాల్పడే శక్తులకు సపోర్టు చేయడం రాహుల్, కాంగ్రెస్‌కు అలవాటై పోయింది. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశవ్యతిరేక, రిజర్వేషన్ల వ్యతిరేక అజెండాకు మద్దతు ఇవ్వడం, విదేశీ గడ్డపై భారత్‌ వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం..రాహుల్ ప్రతిసారీ దేశ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రాంతీయవాదం, మతం, భాష పరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్‌ ప్రకటన బయటపెట్టింది. రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడి.. వాటిపై కాంగ్రెస్‌ వ్యతిరేకతను మరోసారి మనముందుంచారు. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను రద్దు చేయడం ఎవరి వల్ల కాదు.’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story