హైదరాబాద్ టు స్పేస్ వయా షార్.. ఆ ఇద్దరు యువ ఇంజినీర్లు ఎవరు?
ఎలాన్ మాస్క్ క్లాస్‌కే సవాల్ విసిరారా? ప్రైవేట్ రాకెట్ సృష్టించిన 'స్కైరూట్' ప్రస్థానం ఏమిటి?
అంతరిక్ష ప్రయోగాలు అంటే ఇస్రో గుర్తుకు వస్తుంది. ఆ తరువాత ఎలాన్ మాస్క్ సృష్టించిన స్పేస్ ఎక్స్ కనిపిస్తుంది. ఆ రోజులు మారిపోయాయి. హైదరాబాద్ యువ శాస్ర్తవేత్తలు సంచలనం సృష్టించడమే కాదు. ప్రయివేటు రంగంలో రాకెట్లను ప్రయోగించడంలో భారత్ ను మూడో స్థానంలో నిలిపారు. ఇంతకీ ఆ ఇద్దరు యువ ఇంజినీర్లు ఇస్రోలో సురక్షితమైన ఉద్యోగం ఎందుకు వదిలేశారు. దేశంలో మొట్టమొదటి ప్రయివేటు ఆర్బిటల్ రాకెట్ విక్రయం1 ఆగమన్ ఎలా తయారు చేశారనేది ప్రస్తుతం సైన్స్ అధ్యయనం చేసే విద్యార్థులను ఆలోచనలో పడేసింది.
ఆ ఇద్దరు ఎవరు..?
హైదరాబాద్ కు చెందిన పవన్ కుమార్ చందన సీఈఓగా , నాగ భరత్ డాకా కో సీఈఓగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. పవన్ కుమార్ చందన ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) పూర్వ విద్యార్థి. నాగ భరత్ ఐఐటీ మద్రాస్ (IIT Madras) లో చదువుకున్నారు. చదువు పూర్తి కాగానే వీరిద్దరికీ ఇస్రో (ISRO) లో శాస్త్రవేత్తలుగా పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. ఇస్రోలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దాదాపు ఐదేళ్లపాటు కీలకమైన రాకెట్ ప్రాజెక్టులపై వీరిద్దరూ కలిసి పనిచేశారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల అవసరాన్ని వీరు గుర్తించారు. కంఫర్ట్ జోన్ ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలకు ధైర్యంగా రాజీనామా చేసి, 2018లో హైదరాబాద్ వేదికగా ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) అనే స్టార్టప్‌ను స్థాపించారు.
పవన్ కుమార్ చందన (CEO): ఈయన కంపెనీకి సీఈఓగా ఉంటూ, రాకెట్ యొక్క ఓవరాల్ సిస్టమ్స్ డిజైన్, ఫండింగ్, విజన్ ముందుకు నడిపించారు. రాకెట్ నిర్మాణానికి అవసరమైన కార్బన్ ఫైబర్ బాడీ, 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్ల తయారీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నాగ భరత్ డాకా (COO): ఈయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉంటూ.. థియరీని ప్రాక్టికల్‌గా మార్చారు. రాకెట్ యొక్క ఏవియానిక్స్ (Avionics), నావిగేషన్, గైడెన్స్ మరియు కంట్రోల్ సిస్టమ్స్‌ను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. అంటే రాకెట్ ఏ దారిలో వెళ్లాలి, ఎలా ప్రయాణించాలి అనే "మెదడు" లాంటి భాగాన్ని డిజైన్ చేసింది ఈయనే!
వీరిద్దరి లీడర్‌షిప్ వల్లే నవంబర్ 2022లో 'విక్రమ్-S' అనే పరీక్షా రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లి, దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మరింత శక్తివంతమైన, నాలుగు దశల 'విక్రమ్-1' ను నిలబెట్టడంలో మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయం సొంతం చేసుకున్నారు.
కలిసి వచ్చిన కేంద్ర విధానం
అంతరిక్ష ప్రయోగాల్లో కేంద్రం తీసుకుని వచ్చిన సంస్కరణలు వారికి కలిసి వచ్చినట్లు చెప్పవచ్చు. 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక సంస్కరణలను ప్రకటించి, ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చింది. అనంతరం వచ్చిన 'భారత అంతరిక్ష విధానం' (Indian Space Policy) వీరి వృద్ధిని మరింత వేగవంతం చేసింది. దీంతో భారత భూభాగం నుంచి తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ చరిత్ర సృష్టించింది.
(ఆ వివరాలేమిటో ఈ వీడియోలో చూడండి)
Next Story

