
చిత్తూరు 'తోతాపురి మామిడి ధర' చిన్నబోయింది.!
వారంలో గుడ్ న్యూస్ చెబుతామంటున్న ప్రభుత్వం.
చిత్తూరు జిల్లాలోని తోతాపురి రకం మామిడి తోటలు సాగు చేస్తున్న రైతుల కళ్లలో దైన్యం రాజ్యమేలుతోంది. వ్యాపారులకు కాసుల గలగలలు వినిపిస్తున్నాయి. మరో వారంలో మామిడి గుజ్జు పరిశ్రమల నుంచి కొనుగోలు చేయించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
చిత్తూరు జిల్లాలో తోతాపురి రకం మామిడి ధర సంక్షోభం నుంచి గట్టెక్కడం లేదు. దిగుబడి పెరిగినా, ఆదాయం లేక అప్పులు మిగులుతున్నాయని రైతులు కలత చెందుతున్నారు. ఇజ్రేల్, ఇరాక్ యుద్ధం నేపథ్యంలో గుజ్జు ఎగుమతి చేసే పరిస్థితి లేకపోవడం వల్ల మామిడి గుజ్జు పరిశ్రమ కూడా సంక్షోభంలో పడింది. ఇది కాస్తా 2026 సీజన్ లో కూడా రైతులతో పాటు, గుజ్జు పరిశ్రమల యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2025 మామిడి సీజన్ లో కిలో తోతాపురి రకం మామిడికాయలకు రూ. 12 మద్దతు ధర ప్రకటించి, ఊరట ఇచ్చింది. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యపై
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ జూమ్ మీటింగులో చర్చించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమంత్ కుమార్ ఈ సమావేశంలో జిల్లాలోని పరిస్థితిని వివరించారు.
"చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ధర కిలోకు రూ.7 చొప్పున ప్రారంభించాం. ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉండటంతో మార్కెట్‌లో అసమానతలు ఉన్నాయి" ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు.
"రైతులకు నష్టం కలగకుండా రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఒకే విధమైన ధర విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలించండి" అని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశించారు.
చితూరు జిల్లాలో 31 జ్యూస్ ఫ్యాక్టరీలో ఉండగా, 28 ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమల్లో కేవలం 14 ఫ్యాక్టరీలు మాత్రమే తోతాపురి మామిడి కొనుగోళ్లు చేస్తున్నాయి.
"మిగతా పరిశ్రమలు కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం" అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలో మ్యాంగోనగర్ గా ప్రసిద్ధి చెందిన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని దామనచర్ల ప్రైవేట్ మార్కెట్ మండీల వద్ద ఇచ్చే రేటు కూలీలు రవాణా ఖర్చులకు రావడం లేదని రైతులు ఎందుకు వలవల ఏడుస్తున్నారు. జిల్లాలో బంగారుపాళెం, తరువాత తిరుపతి (తిరుచానూరు మార్కెట్ యార్డు) వద్ద కూడా పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు.
చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతుల దయనీయ గాధ ఎలా ఉందంటే..
( ఈ వీడియో చూడండి)
Next Story

