
చిత్తూరు వద్ద పొదల్లో చిక్కుకుని మరణించిన చిరుతపులి
ప్రమాదంలో వన్యప్రాణుల ప్రాణాలు...
చిత్తూరు వద్ద వగచి.. వగచి.. ప్రాణాలు విడిచిన మూడేళ్ల వయసు చిరుత..
ఎండలు మండుతున్నాయి. కాలికి గాయమైంది. గొంతు ఎండుతోంది. ఈ స్థితిలో గ్రామ సమీపంలో పొదల్లో చిక్కుకున్న మూడేళ్ల చిరుత పులి ఒగురుస్తూ ప్రాణాలు విడిచింది. సకాలంలో రెస్క్యూ చేయలేని స్థితిలో ఈ చిరుత ఆదివారం మధ్యాహ్నం మరణానికి కారణమైనట్లు విశ్వసనీయ సమాచారం.
చిత్తూరు నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని బండ దొడ్డిపల్లి వద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. రెండేళ్ల కిందట కూడా నీళ్లు లేని బావిలో పడిన ఓ చిరుత పులి ప్రాణాలు వదిలింది. అడవుల్లో నీటి కొరత ఒకపక్క. ప్రస్తుతం మండుతున్న ఎండలు నేపథ్యంలో వడగాల్పులు అధికం కావడం వల్ల వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి.
రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2018లో 492గా ఉన్న చిరుతల సంఖ్య 2022 నాటికి 569కు పెరిగింది. చిత్తూరు జిల్లాలోని ప్రధాన అటవీప్రాంతాలు కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పాలమనేరు, బంగారుపాళ్యం, ఐరాల, గంగాధర నెల్లూరు అడవుల్లో చిరుతల సంచారం గణనీయంగా పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
చిత్తూరు సమీపంలో ఏమి జరిగింది?
చిత్తూరు నగరానికి సమీపంలోని అడవులు విస్తరించి ఉన్నాయి. రూరల్ మండలం బండ దొడ్డిపల్లికి సమీపంలోని అడవుల్లో నీటి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కాలికి గాయం తగిలిన స్థితిలో చిరుత పులి ఇందిరమ్మ కాలనీ సమీపంలో పొదల్లో మూలుగుతూ పడిపోయింది. దీనిని బండ దొడ్డిపల్లి గ్రామానికి సమీపంలోని పొదల్లో చిరుతపులిని గ్రామస్తులు గుర్తించారు.
"ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళాం. గాయంతో బాధపడుతూ ఉన్న చిరుత పులి కనిపించింది" అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( forest range officer fro) థామస్ చెప్పారు. ఆ చిరుతపులిని సంరక్షించాలంటే తిరుపతి శ్రీ శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్క్ నుంచి బృందం సహాయ చర్యలు తీసుకోవాలి.
" తిరుపతి జూ పార్క్ సిబ్బందికి కూడా సమాచారం అందించాం" చిత్తూరు ఎఫ్ఆర్ఓ థామస్ చెప్పారు.
రెస్క్యూ ఆలస్యం వల్లేనా..?
చిత్తూరు నగరానికి సమీపంలోని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూడు సంవత్సరాల చిరుత పులిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టడంలో జరిగిన ఆలస్యం వల్లే మరణించినట్లు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం.
" ఆపదలో ఉన్న ప్రమాదకరంగా మారిన వన్యమృగాలను బంధించడానికి ఓ ప్రత్యేక బృందం ఉంది. అడవి జంతువులకు మత్తు ఇంజక్షన్లు వేసేందుకు కూడా డాక్టర్ తోయబాసింగ్ సారథ్యంలోని సభ్యులు కీలకం" అని అటవీ శాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం.
చిత్తూరు వద్ద చిరుతపురి ప్రమాదంలో ఉందనే సమాచారం అందినట్లు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ ఉందంటూ చేశారని తెలిసింది. డిఎఫ్ సెల్వంకు చెప్పడంతో, తిరుపతి ఎస్వీ జూ పార్క్ నుంచి రెస్క్ టీం ఆలస్యంగా నైనా బయలుదేరినట్లు తెలిసింది. అప్పటికే చిరుతపులి చిత్తూరు అటవీ శాఖ అధికారుల ద్వారా అందిన సమాచారం.
"మరణించిన చిరుతపులికి అటవీశాఖ ఫోటో కాల్స్ ప్రకారం పంచనమా నిర్వహించిన తర్వాత ఖననం చేస్తాం" అని చిత్తూరు ఎఫ్ఆర్ఓ థామస్ చెప్పారు.
వేసవి కాలంలో అడవుల్లో నీటి కొరత కారణంగా చిరుతలు, ఏనుగులు ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి రావడం ప్రధాన సమస్యగా మారింది. దీనిని అధిగమించేందుకు కృత్రిమ నీటి కుంటలు (Saucer Pits ఏర్పాటు చేయడం, ట్యాంకర్ల ద్వారా నీటితో నింపాలి. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదు.
ఆగని సంఘర్షణ
చిరుత పులులు అడవి దాటి గ్రామాల్లోకి రాకుండా, మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ నివారణకు అటవీ శాఖ కింది చర్యలు తీసుకున్నారు. ఆశించిన మేరకు ఫలించడం లేదనే విషయం తరచూ వన్యప్రాణులు మరణిస్తున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
"చిరుతల కదలికలను గమనించడానికి అడవుల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. జనావాసాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాం" అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అడవిజంతువుల వేట అరికట్టడానికి యాంటీ-పోచింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు కూడా చెబుతున్నారు. చిరుతలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలో, పశువుల పాకల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయనేదే సందేహంగా కనిపిస్తోంది.
Next Story

