
నేషనల్ పర్మిట్ కు బ్రేక్: చంద్రబాబు లేఖ ఎఫెక్టేనా!
కర్నూలు దగ్గర ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధమైన విషాధ సంఘటన పర్యవసానం
ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు అనుసరిస్తున్న పన్ను ఎగవేత వ్యూహాలకు చెక్ పడనుంది. 'వన్ ఇండియా - వన్ టాక్స్ 2021' విధానంలో ఉన్న లూప్‌హోల్స్‌ను ఆసరాగా చేసుకుని ఇతర రాష్ట్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్న పద్ధతికి త్వరలో తెరపడనుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బస్సుల రిజిస్ట్రేషన్ అధికారాలు మళ్లీ రాష్ట్రాలకే దక్కాయి. ఫలితంగా ఇకపై ప్రైవేటు బస్సులు తప్పనిసరిగా ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
నేషనల్ పర్మిట్ ముసుగులో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని రాష్ట్రంలో సర్వీసులు నడుపుతున్న బస్సులు ఇకపై ఎన్‌ఓసీ (NOC) తెచ్చుకోవాలంటే కనీసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోగా తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా కొత్త పన్ను విధానాన్ని ఖరారు చేయనున్నాయి. నిబంధనల అమలు కఠినతరం కానుండటంతో ప్రైవేటు ప్రయాణం ఇకపై మరింత పారదర్శకం కానుంది.
కదిలించిన కర్నూలు ఘటన
2025 అక్టోబర్ 24వ తేదీ కర్నూలు నగరం చిన్నటేకూరుపేట వద్ద వి.కావేరీ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ విషాద ఘటనలో 21 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన దేశంలో ప్రధాన చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించింది.
2025 నవంబర్ ఒకటి న శ్రీసత్యసాయి జిల్లా తలపుల మండలం పెద్దన్నవారిపల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ, కర్నూలు విషాద సంఘటనపై స్పందించారు.
"రాష్ట్రంలో ప్రయివేటు రవాణ వ్యవస్థను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఇండియా వన్ టాక్స్ విధానం మంచిదే. ఇందులో జాతీయ పన్ను విధానం నుంచి రవాణా వ్యవస్థను తప్పించమని లేఖ రాస్తా" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. ఆయన రాసిన లేఖకు స్పందించిన కేంద్రం, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. పన్ను ఆదా కోసం ఇతర రాష్ట్రాలను ఆశ్రయించే ట్రావెల్స్ యజమానులకు కేంద్రం నిర్ణయం గట్టి షాక్ ఇచ్చింది. దీంతో అటు ప్రయాణికులకు భద్రత, ఇటు రాష్ట్ర ఖజానాకు మూడు నెలలకు రూ. 200 కోట్లకు పైగానే ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
"ప్రయివేటు బస్సులు రాష్ట్రాల పరిధిలోకి రావాలంటే కనీసంగా నెల పట్టవచ్చు. అక్కడి నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలి. రాష్ర్ట ప్రభుత్వం కూడా పన్నుల విధానం సిద్ధం చేస్తోంది" అని తిరుపతి జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ చెప్పారు.
జాతీయ విధానం.. ప్రయివేటుకు వరం
కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన 'నేషనల్ పర్మిట్' విధానం ప్రకారం, ఏ రాష్ట్రంలో తక్కువ పన్ను ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని దేశమంతా తిరిగే వెసులుబాటు ఉండేది. దీన్ని ఆసరాగా చేసుకుని ఏపీకి చెందిన వందలాది ప్రైవేటు బస్సులు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ సర్వీసులు నడుపుతున్నాయి. దీనివల్ల రాష్ట్రానికి రూ. వందల కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఉండటం వల్ల బాధ్యులను పట్టుకోవడం, బాధితులకు పరిహారం అందించడం కష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 'స్లీపర్ కోచ్' బస్సుల నియంత్రణ సాధ్యం కావడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో భారమనీ..
2021 సంవత్సరానికి ముందు వరకు ప్రైవేటు టూరిస్టు, ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ రాష్ట్రాల పరిధిలోని ఉండేది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయించిన పనులే వసూలు చేసేవారు. వన్ ఇండియా వన్ టాక్స్ విధానం అమరాన్ లోకి రావడం వల్ల ప్రైవేట్ ఆపరేటర్లకు ఇది వరమైంది. తెలుగు రాష్ట్రాలే మిగతా రాష్ట్రాల రవాణాశాఖ ఆదాయానికి గండి పడింది.
తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒకో సీటు లేదా బెర్తుకు హోమ్ టాక్స్ కింద మూడు నెలలకు రూ. నాలుగు వేలు చెల్లించాలి. అంటే 40 సీట్లు ఉన్న ట్రావెల్స్ బస్సుకు మూడు నెలలకు ఒకసారి 1.60 లక్షల రూపాయలు, ఏడాదికి 6.40 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండేది. దీనికి తోడు నేషనల్ పర్మిట్ కోసం సంవత్సరానికి రూ. మూడు లక్షలు కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి. ఈ పన్ను చెల్లిస్తే ఆ బస్సు దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా తిరగడానికి అనుమతి ఉండేది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఇది భారంగా భావించారు. వన్ ఇండియా వన్ టాక్స్ విధానం అమల్లోకి రావడం వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు వరంగా మారింది.
అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ బస్సు రిజిస్ట్రేషన్ కోసం రూ. 40వేలు, అరుణాచల్ ప్రదేశ్ లో రూ. 56 వేలు, నేషనల్ పర్మిట్ కు మూడు లక్షలు మాత్రమే అక్కడ వసూలు చేశారు. ప్రైవేటు బస్సు సీటుకు సంవత్సరానికి రూ. 35 వేలు, 40 సీట్లు ఉండే బస్సుకు కేవలం 1.52 లక్షలు మాత్రమే హోం స్టేట్ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీో సంవత్సరానికి రూ. ఐదు నుంచి రూ. ఆరు లక్షల వరకు హోంటాక్స్ వ్యత్యాసం ఉంది.
పొరుగు రాష్ట్రాల బాట.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్, హోమ్ టాక్స్ అధికంగా ఉందని భావించిన ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు పొరుగు రాష్ట్రాల్లో నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా డైయుడమన్ పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రైవేటు బస్సులను రిజిస్టర్ చేయించడానికి ముగ్గు చూపారు.
ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బస్సులన్నీ తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుపుతున్న పట్టించుకునేవారు లేరు.
" వన్ ఇండియా వన్ టాక్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి. నెలకు ఒకసారైనా సరే రిజిస్ట్రేషన్ చేయించిన రాష్ట్రానికి ఆ బస్సు వెళ్లి రావాల్సి ఉంటుంది" ఈ నిబంధన ఏ ప్రైవేటు బస్సు యజమాని పాటించలేదు అనే వ అనే విషయం తెలిసినా రవాణా శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తక్కువ పన్ను విధానం చక్కగా వాడుకునేందుకు ఏపీ నుంచి సుమారు 2000 బస్సులు రిజిస్ట్రేషన్ చేయించారు.
" తిరుపతి జిల్లాలో ప్రైవేటు టూరిస్ట్ బస్సులు ఐదు నుంచి ఆరు బస్సులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారు" అని జిల్లా రవాణా శాఖ అధికారి కుర్రపాటి మురళీమోహన్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, వంటి ఇతర రాష్ట్రాల్లో బస్సులు రిజిస్ట్రేషన్ చేయించిన యజమానులు తిరుపతి జిల్లాలో ఎవరూ లేరు. కోస్తా ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారని కూడా ఆయన చెబుతున్నారు.
చలో ఈశాన్యం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులన్నీ ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి. ఏపీ తెలంగాణ మధ్య కాకుండా అంతర్రాష్ట్ర సర్వీసులుగా 2005 నడపడం ద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఏపీఎస్ఆర్టీసీకి సవాల్ గా మారారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గడచిన నాలుగు సంవత్సరాలలో దాదాపు 1500 బస్సులు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి రీ-రీజిస్ట్రేషన్ చేయించుకున్నాయని రవాణా శాఖ అధికారుల మంచి తెలిసిన సమాచారం. తెలంగాణలో కేవలం స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో బస్సులన్నీ ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించినవే కావడమే గమనార్హం.
కర్నూలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడం వల్ల 21 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం దేశంలో ప్రధాన చర్చకు ఆస్కారం కల్పించింది. ఆ తర్వాత హైదరాబాద్ వద్ద జరిగిన సంఘటన, తమిళనాడు, కర్ణాటక తర్వాత ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై, పైన వరుస సంఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ పై దేశవ్యాప్తంగా దృష్టి సారించడానికి దారితీసింది. దీంతో..
"కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం All India Tourist Vehicles (Permit) Rules, 2023, దాని తదుపరి సవరణల ద్వారా రాష్ట్రాలకు పన్నులు వసూలు చేసే హక్కులపై స్పష్టత ఇచ్చింది. 2024, 2025 నాటి గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా పాత లూప్‌హోల్స్‌కు చెక్ పెట్టింది. నేషనల్ పర్మిట్ ఉన్నా, ఒక బస్సు తన సొంత రాష్ట్రం (Home State) కాకుండా ఇతర రాష్ట్రాల్లో వరుసగా 60 రోజుల కంటే ఎక్కువ కాలం తిరిగితే, ఆ బస్సు తప్పనిసరిగా ఆ రాష్ట్ర నిబంధనలకు లోబడి ఉండాలనే నిబంధన విధించింది. పన్ను కూడా చెల్లించాలని నిబంధనలను కఠినతరం చేసింది"
ఏపీ సీఎం నారా చంద్రబాబు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. ఏ రాష్ట్రం బస్సులు ఆ రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిబంధన అమలులోకి వచ్చింది. దీనివల్ల రాష్ట్రాల ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఏర్పడింది.
Next Story

