బొత్స సత్యనారాయణను ఏడ్పించిన అచ్చెన్న!
x
మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణను ఏడ్పించిన అచ్చెన్న!

"అచ్చెన్నా, నువ్వింత కుసంస్కారివా?" అంటూ బొత్స మండిపాటు, అసలేం జరిగిందంటే..


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేరున్న ఇద్దరు నేతలు పరస్పరం దూషణలకు దిగారు. ఒకర్నొకరు దెప్పిపొడుచుకున్నారు. వాళ్లిద్దరే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.
అసలేం జరిగిందంటే..
రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు వైఎస్ ఆచూకీ తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం పదవి కోసం పాకులాడుతారా? అని ప్రశ్నించారు. ఏం జరిగిందో నిర్ధరణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేస్తారా? అని విమర్శించారు.
‘‘అప్పుడు రిలయన్స్‌ ఏజెన్సీలపై దాడి చేయించారు. మళ్లీ అదే రిలయన్స్‌ను మంచి చేసుకుని రాజ్యసభ స్థానాలిచ్చారు. చాలామంది సీనియర్ నాయకులు అనేక రకాలుగా మాట్లాడారు. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని సాక్షాత్తూ బొత్స సత్యనారాయణే మాట్లాడారు. సభ్య సమాజంలో ఎవరూ ఇలాంటి పనులు చేయరని అనుకున్నాం. ఒక సైకోకు పదవీ వ్యామోహం వస్తే.. ఆ పదవి కోసం ఏమైనా చేస్తారు. తండ్రి మరణాన్ని సానుభూతిగా మలచుకుని ఎలా ప్రవర్తించారో చూశాం. తండ్రి మరణం నిర్ధరణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు ఎలా సేకరించారో చూశాం’’ అని అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు.

దీనికి బొత్స కౌంటర్ ఏమిటంటే...

తానెప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు బాధాకరమన్నారు. వైఎస్ మరణంపై అచ్చెన్నాయుడు దిగజారి విమర్శలు చేశారని చెప్పారు.
దివంగత మహానేత వైఎస్సార్‌ గురించి మాట్లాడుతూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ​​కావాలనే వైఎస్‌ జగన్‌పై బురద జల్లుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైఎస్‌ జగన్ మాట్లాడిన మావిగన్.. కూటమి నేతలకు నిద్రలో కూడా గుర్తుకు వస్తుంది. మావిగాన్ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. రాజకీయ అవసరాలు కోసం అచ్చెన్నాయుడు జగన్ పై మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు బొక్క లేదు అనే మాటలను మర్చిపోయావా?. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. వైఎస్సార్‌ మరణం వెనక జగన్ ఉన్నాడని నేను నీతో అన్నట్లు తప్పుడు మాటలు మాట్లాడతావా?’’ బొత్స ధ్వజమెత్తారు.
‘‘మాకు వైఎస్సార్‌కు విడదీయరాని సంబంధం ఉంది. రాజకీయాలు కోసం పదవుల కోసం నీచమైన రాజకీయాలు చేయకు.. నీకు దమ్ముంటే ప్రజలకు న్యాయం చేయి. అచ్చెన్నాయుడు పదవులు కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు వైఎస్సార్‌ గురించి మాట్లాడావు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను. వైఎస్సార్‌ చనిపోయినప్పుడు వైఎస్‌ జగన్ అక్కడే ఉన్నారు. నేను నా భార్య క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్‌ను తీసుకుని వచ్చాము. చనిపోయిన వైఎస్సార్‌ను ఎందుకు రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు.
కంటతడి పెట్టిన బొత్స
సభ్యత సంస్కారం లేని వ్యక్తి అచ్చెన్నాయుడు. మా చరిత్ర మీకు తెలుసు. మీ చరిత్ర మాకు తెలుసు. మావిగన్ అంటే అందుకు అంత ఉలిక్కి పడుతున్నారు.. మావిగన్ ఎందుకు నోరు మెదపడం లేదు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నాను. మావిగన్‌కు వస్తున్న స్పందన చూసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నేను బాధపడను. వైఎస్ మరణం తరువాత జరిగిన సంతకాలకు జగన్‌కు సంబంధం లేదు. ఈ విషయం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలకు తెలుసు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయాల్లో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్నారు.
Read More
Next Story