తిరుమలలో ఆక్రమణల ఆజ్యం  తట్టలున్న వారి తప్పులెరుగరు?
x

తిరుమలలో ఆక్రమణల ఆజ్యం తట్టలున్న వారి తప్పులెరుగరు?

తిరుమలలో తట్టల వ్యవహారం రాజకీయ కోణంగా మారింది. అనాధికారిక వ్యాపారం వల్ల టీటీడీ ఆదాయానికి గండి పడుతోంది. యాత్రికులకు నడక కూడా నరకం అవుతోంది.


తిరుమలలో అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. గత పాలనలో అందిన కాడికి దోచుకున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరుమల కొండపై అడుగడుగునా తట్టలు వెలిశాయి. యాత్రికులు నడిచే అవకాశం కూడా ఇవ్వకుండా దారికి అడ్డదిడ్డంగా తట్టలు తిష్ట వేశాయి. వైసీపీ అనుచరులకు తిరుమల కొండ ఒక వరంలా మారింది. అధికారులు కూడా గతంలో వారందరికీ కోరినచోట కోరినంత స్థలం కేటాయించి తట్టలు (చిన్నపాటి దుకాణం) ఎటువంటి అనుమతులు లేకుండానే కొనసాగించారు. వైఎస్.జగన్ పాలనలో టీటీడీ అధి్కారిగా ధర్మారెడ్డి అడుగుపెట్టగానే కొండపై దళారులను తరిమేస్తానని, ఆక్రమణలను అనధికారిక తట్టలను తొలగిస్తానని ప్రగల్బాలు పలికారు. పాత అన్నదానం సత్రం వద్ద అప్పటికే కొంతమంది అనధికార వ్యక్తులు తట్టలు ఏర్పాటు చేసుకున్నారు, మొదట ఆరంభ సూరత్వం ప్రదర్శించినా ఆ తర్వాత తిరుమల వైసీపీ సానుభూతిపరుల తట్టలతో నిండింది.

వందల నుంచి వేలకు
తిరుమల కొండపై దాదాపు2000 మంది అనధికారిక తట్టలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు వెలివాయి. తిరుమలలో స్థానిక డీఎంబీ రోడ్డు, షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, వైకుంఠంకు వెళ్లే దారి, అన్నదానం సత్రం, ఉచిత వసతి సముదాయాలు, స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న వేడి ఆంజనేయస్వామి సన్నిధి పరిసరాలు, అఖిలాండడం, మఠాలు, ఆశ్రమాలు, నందకం, వకులా నిలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ల చుట్టుపక్కల పరిసరాలు, శిలాతోరణం, పాప వినాశనం ఆకాశగంగా, ఇలా ఎక్కడ పడితే అక్కడ వందలాది తట్టలు వెలిశాయి. వీటితోపాటు ఒకప్పుడు కేవలం 28 మంది మాత్రమే నడుపుతున్న టీ స్టాల్స్ ఇప్పుడు అడుగడుగునా వందల సంఖ్యలో ఏర్పడ్డాయి. టీటీడీ ఆరోగ్య శాఖ అసలు ఇంతమందికి టీ, కాఫీలు అమ్ముకోవడానికి లైసెన్సులు ఎలా మంజూరు చేసిందో, దానికి ప్రామాణికం ఏమిటో ఎవరికి అర్థం కాదు. టీటీడీ రెవెన్యూ అధికారులే వాటిని ఏర్పాటు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీని కోసం రూ. లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఏర్పడిన తట్టల వల్ల తిరుమలలో భక్తులకు కనీసం నడిచేందుకు దారి కూడా లేకుండా చేశాయి.‌
తట్టలు ఎవరికి ఇస్తారు?
తిరుమల ఆలయ అభివృద్ధి, మాడవీధుల విస్తరణ కోసం స్థానికంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ 25 ఏళ్ల క్రితం దళలవారీగా ఖాళీ చేయించారు. వారికి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయంగా 1993లో హాకర్ లైసెన్స్ లు ఇచ్చారు. టీటీడీ మొదల 360 మందికి మాత్రమే పరిమితం చేసింది. మిగిలిన వారికి దుకాణాలు లైసెన్సులు కేటాయించింది. 2002లో అప్పటి జేఈవో బాలసుబ్రమణ్యం స్వయంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి హాకరును క్షుణ్ణంగా పరిశీలించి వారికి లైసెన్సులను రెన్యువల్ చేసారు. వాటి నుంచి ప్రతినెలా అద్దె వసూలు చేస్తున్నారు. వీటికి దుకాణాల తరహాలో రేకుల షెడ్డు నిర్మించుకునేలా అనుమతి కూడా ఇచ్చారు. ఆఖరి లైసెన్సులు 360, దుకాణాలు 800 దాకా మొత్తం కలిపి 1200 సంఖ్యకు లోపు కొండపై దుకాణాలు, హాఖరు లైసెన్స్ లు ఉండేవి.
పెరిగిన సంఖ్య
ప్రస్తుతం తిరుమలలో ఆ తట్టల సంఖ్య రెట్టింపు అయ్యింది. చివరా అనుమతి ఇచ్చే సమయానికి లైసెన్సులు 760, దుకాణాలు 1200 మొత్తం కలిపి రుండు వేలకుపైగా చేరుకున్నాయి. ఇది కాదని అనధికారికంగా దాదాపు 1000 మందికి పైగా తట్టలు ఆక్రమణలను నిర్వహించుకుంటున్నారు. ఒకే పేరుతో అనేక చోట్ల కలర్ జిరాక్స్ తో లైసెన్స్ లు చూపించుకుంటూ (తట్టలు) అనధికారిక తట్టలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో అక్రమ దుకాణాలు, తట్టలు పెరగవడానికి ప్రధానంగా టీటీడీ రెవెన్యూ విభాగం వ్యవహార శైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా స్థానికేతరులకు కొండపై హాకర్ లైసెన్సుల పేరుతో అనుమతి ఇవ్వడం వెనుక తెరచాటు వ్యవహారాలు సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాత రసీదులు, పత్రాలు సృష్టించి, బోర్డు తీర్మానాలు చేయించి, అనుమతి ఇచ్చారని సమాచారం.దీనివెనుక రూ. లక్షలు చేతుుల మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తెరచాటున వ్యవహారం
టీటీడీలో గత ఐదేళ్ల పాలనలో గుట్టుచప్పుడు కాకుండా సాగించిన వ్యవహారంలో ఓట్ల రాజకీయం తోపాటు సామాజికవర్గాల సమీకరణలు కూా పనిచేశాయని తెలుస్తున్నది. సూక్తులు వల్లించే నేతలు తమ అనుయాయులకు దొడ్డిదారిన తట్టల లైసెన్సులు మంజూరు చేయించండి, అనధికారికంగా ఏర్పాటు చేయించడానికి సహకారం అందించారనేది తిరుమల కొండపై బహిరంగ రహస్యం. రాజకీయ అండగా, టీటీడీ రెవెన్యూ సహకారంతో తట్టలు ఏర్పాటు చేసుకున్న వారు ప్రధాన లైసెన్స్ ఉన్న దుకాణాల ముందు రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నా, అడిగేవారు లేరు. దీనివల్ల రూ. వేలకు వేలు అద్దె చెల్లించే తాము నస్టపోతున్నామని పెద్దషాపులయ నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.
సమీక్షతో సరి
రోడ్డును ఆక్రమించి తట్టలు వేసుకున్న వారి వద్ద పని చేసే వర్కర్ల మధ్య ఘర్షణలకు కూగా దారితీస్తున్నాయి. ఇది యాత్రికుకు ఇబ్బందికరంగా మారుతోంది. అయినా, టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం కూా సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనపించడం లేదు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈఓ శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. మిగతా శాఖలు, విభాగాలలో అమలు చేసినట్లు సంస్కరణలకు చర్యలు తీసుకున్నట్లు కనిపిచండం లేదు. ఇది కాస్తా యాత్రికులు మాడవీధుల్లోనే కాదు. రద్గీగా ఉండే ప్రదేశాలు, అఖిలాండం, ఫాపింగ్ కాంప్లెక్స్, వరాహస్వామి అతిధి గృహాలు, బస్టాండ్, హెచ్ టీ కాంప్లెక్స్, లేపాక్షి సర్కిల్, మ్యూజియం వంటి అనేక ప్రదేశాల్లో నడక కూడా కష్టంగా మారుతోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత
"తిరుమల నుంచే పాలన ప్రక్షాళన ప్రారంభిస్తా" అని సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు.
ఆ మేరకు ఈఓ జే. శ్యామలరావును నియమించారు. తిరుమలలో అదనపు ఈఓగా వెంకయ్య చౌదరిని నియమించారు. అన్నదానం, లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంపుదలకు వారు తీసుకున్న శ్రద్ధ ప్రతిఫలించింది. అయితే, తిరుమలలో తట్టలు, హాకర్ల వ్యవహారం మాత్రం అలాగే ఉంది,
వైసీపీ పాలనలో వాటి లైసెన్స్ తీసుకున్న వారే కాకుండా, అనధికారికంగా తట్టలు నిర్వహిస్తున్న వారి స్వరం మారింది. వారిలో చాలా మంది జనసేన రాగం వినిపిస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారలో తమ వర్గీయులకు కూడా తట్టలు ఏర్పాటుకు సహకారం అందించాలనే వ్యవహారంలో జనసేన పార్టీలోని ఓ వర్గం పట్టుబడుతున్నట్లు తెలిసింది. అందుకు ప్రధాన కారణం జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు ఎంఎల్ఏగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీటీగీ పాలక మండలి ఏర్పడితే, స్థానిక ఎమ్మెల్యేకి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అవకాశం ఉంటుంది.
2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్కు ఎక్స్ అఫీషియో సభ్యుడిని చేసే అవకాశం కల్పించారు. ఆ పద్దతి ఇంకా కొనసాగుతోంది. ఆ తరువాత..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో నిర్ణయం జరిగింది.
"నాన్న (వైఎస్ఆర్)కు అడుగు ముందుకు వేస్తా" అని మాజీ సీఎం వైఎస్. జగన్ చెప్పిన మాట ప్రస్తావనార్హం. ఆ మేరకు తిరుపతి ఎమ్మెల్యేకి మొదటిసారి టీటీడీ బోర్డులో ఎక్ష్ అఫీషియో సభ్యత్వం కల్పించారు. ఈ పరిహామం వల్ల తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ బోర్డులో ఓటింగ్ అర్హత లేని, సభ్యుడు అవుతారు. అందువల్ల ఆరణి శ్రీనివాసులుకు ఎమ్మెల్మేగా మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ...
తిరుమలలో తట్టల వ్యవహారం తెరమీదకు రావడమే కాదు. గ్రూపుల మధ్య సమన్వయం కుదరడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ వాయిస్ పెంచడానికి అవకాశం కల్పించినట్లు భావిస్తున్నారు.
ఆయన ఏమంటున్నారంటే..
" రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తిరుమలలో ప్రక్షాళన చేపట్టింది. తిరుమలల తట్టల గోల జనసేనపై వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు" అని కిరణ్ అన్నారు. "భక్తులు నడవకుండా తట్టలు వెలిశాయి. ఇది గత వైసీపీ ప్రభుత్వ పాపమే" అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి ఛైర్మన్లు, ఈవో, తుడా చైర్మన్, మరో మంత్రి బంధువులకు ,అనునాయులకు 250 తట్టలు ఇచ్చారు" అని ఆరోపించారు. "తట్టల వల్ల రూ. కోట్లలో జరిగే స్కాం. 20 ఏళ్లలో అక్రమంగా తట్టలు వెలిశాయి. అనుమతి లేని తట్టలు తొలగించాలి" అని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం ఉరుము ఉరిమి మంగలంపై నడినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా జనసేనలో ఆధిపత్య పోరుకు కూడా తెరతీయడం అటుంచితే, తిరుమలలో తట్టలు, హాకర్ల లైసెన్స్ తీసుకున్న వారికి దడ పుట్టిస్తోంది. టీటీడీ పాలక మండలి సభ్యత్వ రేసులో ఉన్న జనసేన తిరుపతి నేతకు పదవి దక్కితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటయనేది వేచిచూడాల్సిందే.


Read More
Next Story