కండ్రిక కంపు కొడుతోంది.. మురుగు నీటిని తోడేయండి ప్లీజ్‌
x

కండ్రిక కంపు కొడుతోంది.. మురుగు నీటిని తోడేయండి ప్లీజ్‌

విజయవాడలో బుడమేరు వరద బీభత్సం నుంచి బాధితులు ఇంకా తేరు కోలేదు. మురుగు నీరును తోడేసి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.


విజయవాడలో బుడమేరు వరద బీభత్సం అంతా ఇంతా కాదు. రెండు వారాలైనా ఇంకా నీటిలోనే మగ్గుతున్నారు. రోడ్లపై వచ్చి చేరిన వదర నీటిని, ఇళ్లల్లోకి వచ్చిన నీటిని పంపింగ్‌ చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కండ్రిక ప్రధానమైంది. బుడమేరు వరద నీరు ఇక్కడ తాండం చేసింది. కాలనీ వాసులు అతలాకుతలమయ్యారు. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపైన ఉన్న వరద నీటిని, ఇళ్లల్లోకి వచ్చిన మురిగి నీటిని తొలగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మురుగు నీరు రోజుల తరబడి ఉండి పోవడంతో ఈ ప్రాంతమంతా దుర్గంధంగా మారింది. మురుగు కూపాలుగా మారడంతో దుర్వాసనలకు నిలయాలుగా మారాయి. దీంతో అంటు వ్యాధులు ప్రబలుతాయోమనని భయాందోళనలు చెందుతున్నారు.

అయ్యా గవర్నమెంట్‌ వారు కండ్రిక వాసులు చేసుకున్న పాపమేంటి. నీళ్లు ఎలా ఉన్నాయో చూడండి. రోడ్లపైన, ఇళ్లల్లోకి ఎంత నీరు వచ్చిందో ఒక సారి చూడండి. కాస్తో కూస్తో రోడ్లపైన ఉన్న నీటిని లాగుతున్నారు కానీ.. ఇళ్లల్లో ఉన్న నీటిని లాగడానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం వారు దీనిపై స్పందించి. త్వరగా ఈ నీటిని తొలగించాలి. అయ్యా చూడండయ్యా నీరు ఎలా ఉందో. ప్రకాశ్‌ నగర్, పైపుల రోడ్డు నుంచి వచ్చే నీళ్లను లాగుతున్నారు. చుట్టు పక్కల ఉన్న కాలనీల్లో రోడ్లు, ఇళ్లల్లో కూడా నీళ్లు లేకుండా లాగేశారు. కండ్రిక ప్రాంతపు వాసులు మాత్రం ఇప్పటికీ వరద నీటిలోనే మగ్గుతున్నారు. ఇవాళతో 12వ రోజు. గత పన్నెండు రోజులుగా నీళ్లల్లోనే మగ్గుతున్నారు. ఇప్పటికైన మా బాధలను గుర్తించండి. వీలైనంత త్వరగా నీటిని తొలగించి కండ్రిక వాసులను ముంపు బారి నుంచి రక్షించాలని ఒక బాధితుడు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌గా మారింది.
స్థానికంగా కూడా అనేక మంది కాలనీ వాసులు ఇదే బాధలను వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు వరదలకు తడిసి ముదై్దన తాము ఇప్పటికే గత 12 రోజులుగా మురుగు నీటిలోనే మగ్గుతున్నామని ఇది ఇంకా కొనసాగితే అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వరద నీటి నుంచి విముక్తి కల్పిస్తాలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు చేపట్టాల్సి అవసరం ఉంది.
మరో వైపు వరద ముంపునకు తీవ్రంగా గురైన జక్కంపూడి కాలనీ, వైఎస్‌ఆర్‌ కాలనీల్లో బాధితులు దీన స్థితిలో ఉన్నారు. నిత్యావసర సరుకుల కోసం నేటికీ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు రెండు వారాలకుపై అర్థాకలితో వరద ముంపునకు గురైన బాధితులకు ఇప్పటికీ నిత్యావసర సరుకులు అందడం లేదు. గంటల కొద్ది పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకులు పంపిణీ చేయడానికి వస్తున్న వాహనాలతో పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి హృదయ విదారక సంఘటలను ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారాయి. వరదలు సంభవించిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కరెంట్‌ను పునరుద్దరించ లేదు. ఈ రోజే కరెంటు సౌకర్యం కల్పించారు. దాదాపు రెండు వారాల పాటు చీకటిలోనే ఉండి పోయారు. ప్రతి బాధితునికి నిత్యావసర వస్తులు చేర్చడంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, దాని వల్లే బాధితులకు నిత్యావసర సరుకులు అందడం లేదని ఐఎఫ్‌టియు నాయకులు పొలారి, రవిచంద్ర తెలిపారు. వరద నీరు ఇంకా పూర్తి స్థాయిలో తొలగించ లేదని, మోకాళ్ల లోతు వరకు ఉన్నాయని, వీటిని పూర్తి స్థాయిలో తొలగించి వరద నీటి నుంచి విముక్తి కల్పించాలన్నారు.
Read More
Next Story